జులై 1వ తేదీ వచ్చింది అంటే ,అందరం హ్యాపీ డాక్టర్స్ డే అంటాం .. వాట్సాప్ లో మెసేజ్ చేస్తాం .. మరి ఈ డాక్టర్స్ డే ఎలా వచ్చింది అసలు మీకు తెలుసా ??

ప్రతి సంవత్సరం జులై ఒకటవ తారీకున డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం. ఈ రోజుని పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి Dr. B.C .Roy డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ స్మృతి సందర్భంగా జరుపుకుంటున్నాం.

ఈ డాక్టర్స్ డేని మొదటిసారి 1991లో జరుపుకున్నాం.

వైద్యరంగంలో ఉన్నవారందరూ దైవంగా భావించే మార్గదర్శి డాక్టర్‌ బీసీ రాయ్‌.ఆయన పూర్తి పేరు బిధాన్‌ చంద్రరాయ్‌.

జననం

జులై 1,1882 న బీహార్‌ రాష్ట్రంలోని బంకింపూర్‌లో ఆయన జన్మించారు.

విధ్యాబ్యాసం

కలకత్తా మెడికల్‌ కళాశాలలో వైద్య విద్య , 1909లో ఇంగ్లాండ్‌ లోని బర్త్‌ హోమ్‌ హాస్పిటల్‌లో ఎం.ఆర్‌.సి.పి, ఎఫ్‌.ఆర్‌. సీ.ఎస్‌ డిగ్రీలు పూర్తిచేశారు.

వృత్తి

1911లో స్వదేశానికి వచ్చి వైద్య కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు.

పేదలకు నిరంతరం వైద్య సేవలు అందించాలన్న ఆశయంతో ఆయన జాదవ్‌ పూర్‌ టీ.బీ హాస్పిటల్, ఆర్‌.జి.ఖార్‌ మెడికల్‌ కాలేజ్, విక్టోరియా ఇనిస్టిట్యూట్, చిత్తరంజన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఇలా ఎన్నో వైద్య సంస్థల్ని ఏర్పాటుచేశారు.

ప్రచురణలు

అంతేకాదు వైద్యరంగంలో వస్తున్న పోకడలకు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయడానికి ఎన్నో వ్యాసాలు రచించారు.

1922 – 1928 మధ్య కాలంలో కలకత్తా మెడికల్‌ జర్నల్‌కు మెయిన్ ఎడిటర్‌గా కూడా పని చేసారు .

కలరా వ్యాధి విజృంభించిన సమయంలో వేలాదిమంది ప్రజల ప్రాణాల్ని ఆయన కాపాడారు.

రాజకీయం

మహాత్మా గాంధీ,మన జాతిపిత కి వైద్యుడిగా, స్నేహితుడిగా ఉంటూ ఆయన ఆశయాలకు వెన్నంటి నడిచారు.

ఆ తర్వాత 1928లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యులుగా చేరి  అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగి 1948 జనవరి 13న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రతీ  రోజూ సాయంత్రం కొంత సమయాన్ని వైద్య సేవలకు కేటాయించారు.

అవార్డులు

1961లో ఫిబ్రవరి 4న ఈయన భారత రత్న అందుకున్నారు.

మరణం

వైద్యుడిగా సేవలందిస్తూ ముఖ్య మంత్రి గా ప్రజల మధ్యనే ఉన్న ఆయన 1962 జూలై 1న మరణించారు.

ఆయన గౌరవార్థమే 1991 వ సంవత్సరం  నుంచి జూలై 1న భారత ప్రభుత్వం డాక్టర్స్ డేను  ప్రకటించింది.

డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

ప్రతి ఏటా కొత్త నినాదంతో డాక్టర్ డేను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే ని డాక్టర్లు దేశానికి ,ప్రజలకి చేసే సేవలను గుర్తించడానికి సెలిబ్రేట్ చేసుకుంటున్నాం.

ఈ రోజున రకరకాల ఈవెంట్స్, యాక్టివిటీస్ ని కండక్ట్ చేస్తారు. ఫ్రీ మెడికల్ కాంప్స్ (Free medical camps ) నిర్వహించి ప్రజలకు ఆరోగ్యం మీద అవగాహనను కలుగచేస్తారు.

దేశమంతటా హెల్త్ చెకప్ (Health checkups), ప్రివెన్షన్, రోగనిర్ధారణ, చికిత్స వంటి విషయాల మీద కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పేద ప్రజలకూ, వయో వృద్ధులకూ తదితరులకు పోషకాహారం గురించిన వివరాలను తెలియచేస్తారు.

స్కూల్స్, కాలేజీ ల  లో డాక్టర్స్ చేసే అమూల్యమైన సేవల గురించి పలురకాల యాక్టివిటీస్ కండక్ట్ చేసి వారిలో వైద్య వృత్తి పట్ల ఆసక్తి కలిగేలా చేస్తారు.

మరి ఈ కోవిడ్ పరిస్థితుల్లో తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా అపరిమత సేవలని అందిస్తున్న ఎందరో వైద్యులకి చేతులు జోడించి నమస్కరిస్తూ

హ్యాపీ డాక్టర్డ్స్ డే – Happy Doctors Day ….