వివేక్ ఆత్రేయ(Vivek Atreya) దర్శకత్వం(Direction)లో రూపొందుతోన్న ‘అంటే సుందరానికీ! మూవీలో నేచురల్ స్టార్ నాని, మలయాళ నటి నజ్రియా ఫాజిల్ జంటగా నటిస్తున్నారు.

ఈ మూవీని జూన్ 10(June 10th)న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్(Promotions) లో చిత్రబృందం(Movie Unit) వేగం పెంచేసింది.

ఇప్పటికే సినిమాను తెలుగు(Telugu)తో పాటు తమిళం(Tamil), మలయాళం(Malayalam)లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ మేకర్స్(Movie Makers), తాజాగా మూవీ టీజర్ రిలీజ్ డేట్(Teaser Release Date) ను ప్రకటించారు.

అంటే సుందరానికీ మూవీ టీజర్ ను ఏప్రిల్ 20(April 20th)వ తేదీ ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరోహీరోయిన్లు నాని, నజ్రియా డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.

అయితే ఇటీవలే నాని పుట్టినరోజు(Brithday) సందర్భంగా ఓ గ్లింప్స్(Glimpse) ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్(Response) పొందింది.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం(Mytri Movie Makers Productions)లో నవీన్ యర్నేనేని(Naveen yaranneni), రవి శంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు.

వివేక్ సాగర్(Vivek sagar) ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్(Music Director) గా పనిచేస్తున్నారు.