ఆర్ఆర్ఆర్(RRR) సినిమా త‌ర్వాత యంగ్ టైగ‌ర్(Young Tiger) ఎన్టీఆర్(NTR) చిత్రం  కోసం ఆయ‌న ఫ్యాన్స్(FANS) చాలా ఆతృత‌గా  ఎదురు చుస్తున్నారు. దాదాపు ఏడాది త‌ర్వాత ఈ మధ్యనే తార‌క్ త‌న NTR 30(NTR 30)ని కొర‌టాల శివ(Koratala shiva) ద‌ర్శ‌క‌త్వం(Direction)లో లాంచ‌నంగా ప్రారంభించారు.

త్వ‌ర‌లోనే మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్స్(Regular Shootings) మొదలు  కానుంది. ఇప్ప‌టికే స్టార్ టెక్నీషియ‌న్స్(Star Technicians) అంద‌రూ ఈ చిత్రంలో జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ క‌పూర్(Janavi Kapoor) న‌టిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మ‌రో హీరోయిన్ కూడా NTR 30లో జాయిన్ అవుతుందనే వార్త‌లు నెట్టింట వైర‌ల్(Viral) అవుతున్నాయి.

ఇంత‌కీ ఎన్టీఆర్ 30లో జాయిన్ అవుతున్న ఆ సెకండ్ హీరోయిన్ ఎవ‌రో కాదు కృతి శెట్టి(Krithi shetty) అని టాక్. నాగ‌చైత‌న్య‌తో బంగార్రాజు చిత్రంలో నాగ చైత‌న్య మ‌ర‌ద‌లిగా న‌టించి మెప్పించిందీ ఈ శాండిల్ వుడ్ భామ‌. ఉప్పెన‌తో బ్లాక్ బ‌స్ట‌ర్(Block Buster) హిట్(Hit) కొట్టిన ఈ భామ త‌ర్వాత శ్యామ్ సింగ‌రాయ్, బంగార్రాజు చిత్రాలతో విజయాన్ని సొంతం చేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

త‌ర్వాత ది వారియ‌ర్‌, మాచ‌ర్ల నియోజ‌క‌ర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల‌తో హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ని  చూసింది. ఇప్పుడు మ‌రోసారి నాగ‌చైత‌న్య సినిమా క‌స్ట‌డీలో న‌టిస్తోంది. వీటితో పాటు NTR ౩౦ కూడా అవకాశం ద‌క్కించుకుంద‌ని టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై హీరోయిన్ కృతి శెట్టి  ఎలా రియాక్ట్ అవుతుందో మరి.

ఎన్టీఆర్ 30తో పాన్ ఇండియా(Pan India) రేంజ్‌లో ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని కొరటాల శివ క‌సితో ఉన్నారు. క‌చ్చితంగా ఫ్యాన్స్‌గా ట్రీట్‌గా ఉంటుంద‌నేది క్లియ‌ర్‌గా తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్‌(NTR Arts), యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌(Yuva Sudha Arts Banners) పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రికృష్ణ‌.కె. సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5, 2024(April 5th 2024)లో మూవీ రిలీజ్(Release)) కానుంద‌ని మేక‌ర్స్(Makers) ఇది వ‌రకే ప్ర‌క‌టించేశారు. ఇందులో బాలీవుడ్ స్టార్(Bollywood Star) సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) విలన్(Vilan) గా  క‌నిపించ‌బోతున్నారు.