స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల(Release) చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం SBI లో 54 ఉద్యోగాలు భర్తీ చేయబడతాయి.

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ(Application Process) ఇప్పటికే ప్రారంభం(Starts) అయింది.

దరఖాస్తు చేయడానికి అభ్యర్థి అఫిషియల్ వెబ్‌సైట్(Official Website) sbi.co.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ(Last Date) 29 డిసెంబర్(December 29th) 2022. ఎస్బీఐ నిర్వహించే ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(Recruitment Drive) కింద 54 పోస్ట్‌ లను రిక్రూట్ చేస్తారు.

ఇందులో రెగ్యులర్(Regular) మరియు కాంట్రాక్టు(Contract) పోస్టులు ఉంటాయి. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద రెగ్యులర్ స్థానాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్(Online) రాత పరీక్ష(Written Exam), ఇంటర్వ్యూ(Interview)లో హాజరు కావాలి.  అదే సమయంలో, కాంట్రాక్ట్ పోస్ట్‌ పై అభ్యర్థుల నియామకం కోసం వారు ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్(Shortlist) చేయబడతారు. అభ్యర్తులు(Candidates) డిగ్రీ(Degree), పీజీ(PG)తో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం(Work Experience) ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ / EWS / OBC కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము(Application Fee)గా రూ.750 చెల్లించాలి.SC/ ST/ PWD కేటగిరీ(Category) అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. తర్వాత అవసరమైన పత్రాల(Documents)ను అప్‌లోడ్(Uploads) చేసి రుసుము చెల్లించాలి.

తర్వాత ఫైనల్(Final) సబ్ మిట్ బటన్(Submit Button) నొక్కితే.. మీ దరఖాస్తు సమర్పించబడినట్లే. అభ్యర్థులు భవిష్యత్ అవసరాల(Future reference) కొరకు ఆ దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్(Download) చేసుకొని ప్రింట్(Print) తీసుకోండి.