బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) తోమిదో వారం మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ లో పది నామినేషన్స్(Nominations) లో వున్నారు.బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఎప్పుడు, ఎలాంటి మలుపులు తిప్పుతాడో చెప్పలేము.

అయితే మంగళవారం నాటి ఎపిసోడ్లో  పది మంది కంటెస్టెంట్స్ (Contestants) లో ఒక్కరు మాత్రం ఇమ్మ్యూనిటి(Immunity) వచ్చే ఛాన్స్ ని కల్పించాడు.

అందుకోసం హౌస్ మేట్స్(House mates) కి ఊహించని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మరి ఆ టాస్క్(Task) ఏంటో? ఆ టాస్క్ లో ఎవరు గెలిచారో? తెలుసుకుందాం…….

ఈ టాస్క్‌ ను మొత్తం గార్డెన్ ఏరియాలో బ్యాగేజ్ జోన్(Baggage Zone) , సేఫ్ జోన్(Safe Zone), డేంజర్ జోన్(Danger Zone), గా మూడు భాగాలుగా విభిజించాడు.

బ్యాగేజ్ జోన్‌లో కంటెస్టెంట్ల ఫోటోలతో వున్న బ్యాగులుంటాయి. కంటెస్టెంట్ ఫోటో వున్నా బాగ్స్ ని తీసుకుని పరిగెత్తుకుంటూ సేఫ్ జోన్‌(Safe Zone)లోకి రావాలి.  అలా చివరగా ఎవరైతే వస్తారో వారు డేంజర్ జోన్‌లోకి వస్తారు.

చివరన వచ్చిన కంటెస్టెంట్‌(Contestant)తో పాటుగా వారి చేతిలో ఎవరి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉంటుందో వారు కూడా డేంజర్ జోన్‌లో వుంటారు. అలా ప్రతీ రౌండ్లో ఎవరో ఒకరు ఆట నుంచి పక్కకు తప్పుకుంటారు.

ఒకరి సేఫ్ అవుతుంటారు అని గేమ్ రూల్స్ ని తెలిపాడు బిగ్ బాస్(Big Boss).

అలా చివరకు ఒక్కరు మాత్రమే ఆటలో వుంటారు. వారికి  ఇమ్యూనిటీ(Immunity) లభిస్తుంది. మొత్తానికి మొదటి రౌండ్ ఆటలో శ్రీరామచంద్ర తన స్ట్రాటజీ(Strategy)తో గేమ్ ఆడాడు .

ముందుగా వచ్చిన  కూడా సేఫ్ జోన్‌లోకి వెళ్లకుండా చేతిలో కాజల్ ఫోటో  ఉన్న బ్యాగును పట్టుకుని ఆగిపోయాడు. కాజల్‌ను ఆటలోంచి తప్పించేందుకు శ్రీరామచంద్ర ప్లాన్ వేశాడు.

అలా మొదటి రౌండ్‌లో శ్రీరామ్, కాజల్ డేంజర్ జోన్‌లోకి వచ్చారు. దీంతో సేఫ్ జోన్‌లో ఉన్న హౌస్ మేట్స్(House mates) శ్రీరామ్‌కు మొదటి రౌండ్ లో సేవ్ చేసారు. కాజల్ అవుట్ అయింది.

ఇక రెండో రౌండ్‌లో జెస్సీ చివరగా సేఫ్ జోన్‌(Safe Zone)లోకి వచ్చాడు.

అతని చేతిలో సన్నీ బొమ్మ ఉన్న బ్యాగ్ ఉండడంతో  సన్నీ, జెస్సీ డేంజర్ జోన్‌లో నిలిచారు. దీంతో సేఫ్ జోన్‌లో ఉన్న హౌస్ మేట్స్(House Mates)  జెస్సీ మూడో రౌండ్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చారు. సన్న నామినేట్(Nominate) అయ్యాడు. ఇక మూడో రౌండ్లో జెస్సీ చివరగా రావడం, అతని చేతిలో సిరి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉండటంతో ఆఇద్దరూ కూడా డేంజర్ జోన్‌లోకి వచ్చారు. దీంతో సేఫ్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్(Contestants) మెజార్టీ ఓట్లతో జెస్సీ పక్కకు తప్పుకున్నాడు. సిరి నాల్గో రౌండ్లోకి వెళ్లింది.

ఆ తరువాత నాల్గో రౌండ్లో శ్రీరామచంద్ర చివరగా వచ్చాడు. అతని చేతిలో విశ్వ బొమ్మ ఉన్న బ్యాగ్ ఉంది. దింతో హౌస్ మేట్స్ శ్రీరామ్ చంద్ర ని సేఫ్ చేసి, విశ్వని నామినేట్ చేసాడు.

శ్రీరామచంద్ర ఐదో రౌండ్లోకి వచ్చాడు. అయితే ఆ రౌండ్లో సిరి చివరగా రావడంతో రవి కూడా డేంజర్ జోన్‌లోకి వచ్చేశాడు. అలా ఆ రౌండ్ నుంచి సిరి నామినేట్ అయింది. రవి సేఫ్ జోన్లోకి వచ్చాడు.

ఆరో రౌండ్లో ప్రియాంక బ్యాగుని పట్టుకోకుండా పరిగెత్తుకుంటూ రావడంతో నేరుగా టాస్క్ లో నామినేట్(Nominate) అయ్యినట్టు ప్రకటించేశాడు సంచాలక్ షన్ను. ఏడో రౌండ్లో మానస్ చివరగా  రావడం, అతని చేతిలో రవి ఫోటో ఉన్న బ్యాగు ఉండటంతో ఆ ఇద్దరూ నామినేట్ అయ్యారు. అందులోంచి రవి పక్కకు తప్పుకున్నాడు.

మానస్ ఎనిమిదో రౌండ్లోకి వెళ్లాడు. ఇక చివరగా ఎనిమిదో రౌండ్లో మానస్ చివరగా  రావడం, ఆనీ మాస్టర్ బొమ్మ ఉన్న బ్యాగు పట్టుకోవడంతో ఇద్దరూ డేంజర్ జోన్‌లోకి వచ్చారు. శ్రీరామచంద్ర ఒక్కడి నిర్ణయంతో ఆనీ మాస్టర్‌ను తదుపరి రౌండ్‌కు ఎంపిక చేసాడు. దింతో మానస్ నామినేట్ అయ్యాడు.

అలా చివరకు శ్రీరామచంద్ర, ఆనీ మాస్టర్ ఉండటంతో హౌస్  మేట్స్(House mates) ఎక్కువ శాతం ఆనీ మాస్టర్‌కు వోట్ లు వేశారు, దింతో ఆనీ  కి ఇమ్యూనిటీ  లభించింది.

అయితే ఇక్కడే బిగ్ బాస్(Big Boss) ఓ మెలిక పెట్టాడు. ఎనిమిదో వారం ఆనీ మాస్టర్‌కు వచ్చిన పవర్‌ను వాడే టైం వచ్చిందని చెప్పాడు. ఆ పవర్‌తో ఒక కంటెస్టెంట్(Contestant) ని నామినేషన్ నుంచి తప్పించవచ్చని అన్నాడు.

దీంతో ఆనీ మాస్టర్ తన కోసం లెటర్ త్యాగం చేసి డైరెక్ట్ నామినేట్ అయ్యాడు కాబట్టి  తన పవర్‌ను మానస్‌కు ఇచ్చింది. దీంతో ఆనీ, మానస్ తప్పా మిగిలిన అందరూ నామినేషన్‌ (Nomination)లోనే ఉన్నారు.

సిరి, జెస్సీ, కాజల్, సన్నీ, విశ్వ, రవి, శ్రీరామచంద్ర, ప్రియాంకలు నామినేట్ అయ్యారు. మొత్తానికి టాస్క్(Task) అంతా ఆడి ఎంతో కష్టపడ్డ ఆనీకి  ఇమ్యూనిటీ(Immunity) లభించింది.

అలాగే ఆని మాస్టర్ దగ్గర వున్న పవర్ ని మానస్ కి ఇవ్వడంతో, మానస్ కూడా ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్(Safe) అయ్యాడు.