బిగ్ బాస్ సీజన్5(Big Boss season 5) కంటెస్టెంట్స్(Contestants) కి చుక్కలు చూపిస్తున్న బిగ్ బాస్’టికెట్‌ టు ఫినాలే(Ticket to Finale)’ టాస్క్‌ మొదటి లెవల్‌లో ఐస్‌ వాటర్‌(Ice Water)లో కాళ్లు పెట్టి తమ బకెట్‌లో ఉన్న బంతులు కాపాడుకుంటూనే ఇతర కంటెస్టెంట్స్ బకెట్‌లోని బాల్స్‌ ను తీయాల్సివుంటుందన్న విషయం తెలిసిందే.

ఈ టాస్క్ లో గ్రూప్ గా  ఆడుతున్న సన్నీ, షణ్ముఖ్‌లకు బిగ్ బాస్(Big Boss) ఓ ట్విస్ట్(Twist) ఇచ్చారు. వారి నుంచున్న ప్లేస్ ని స్వాప్ చేసుకోవాలని తెలిపారు. దీంతో సిరి పక్కకు సన్నీ, మానస్, కాజల్  మధ్యలోకి షణ్ముఖ్ వచ్చాడు.

ఇక  బుధవారం నాటి 88వ ఎపిసోడ్‌లో ఈ టాస్క్ రెండో దశకు చేరుకుంది. ఆ హైలైట్స్ ఇక్కడ మీ కోసం

అయితే ఈ ఆట లో  సిరి, సన్నీ,ల మధ్య మళ్లీ గొడవ జరిగింది. నన్ను కావాలనే టార్గెట్‌(Target) చేసి బ్యాడ్‌ చేస్తోందంటూ సిరిపై మండిపడ్డాడు సన్నీ. అతడు తన బాల్స్‌ తీయడానికి టార్గెట్ చేస్తున్నాడని ఐస్‌ వాటర్‌(Ice Water)లో నుంచి కాలు బయట పెట్టలేదు సిరి.

ఈ క్రమంలో రవి, ఐ మిస్‌ యూ అంటూ సిరి కన్నీరుపెట్టుకుంది, నీకోసం ఆడుతున్నా రవి అంటూ షణ్ముఖ్‌ ఎమోషనల్(Emotional) గా మాట్లాడాడు.

దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ (Contestants) ఒక్కసారిగా షాక్(Shock) అయ్యారు. అసలు ఈ టాస్క్ లో రవి పేరు హై లైట్ చేస్తూ షన్ను, సిరిలు ఎదో మైండ్ గేమ్ ఆడారనిపిస్తుంది

సన్నీ సిరిని టార్గెట్‌ చేయడంతో ఐస్‌ బకెట్‌ లో నుంచి కాళ్లు తీయకుండా అలాగే నిల్చుండిపోయిన సిరికి కాళ్లు పట్టేసాయి. దీంతో బజార్ మోగగానే మానస్‌ ఆమెకు సాయం అందించాడు. ఐస్ లో కాళ్లు పెట్టడం వల్ల కంటెస్టెంట్లకు(Contestants) మెడికల్ గా ట్రీట్మెంట్ (Treatment) అవసరమవడంతో మెడికల్‌ రూమ్‌లో వైద్యం అందించారు. సిరి నడవలేని స్థితిలో ఉండటంతో మానస్‌ ఆమెను ఎత్తుకుని మెడికల్ రూమ్(Medical Room) కి తీసుకెళ్లాడు. మానస్ హెల్ప్ ని తీసుకోలేని షణ్ముఖ్ హర్ట్ అయ్యాడు.

మరో పక్క  సిరి కాళ్ళ నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ నొప్పి వస్తుందని అంటే. మానస్ నుంచి హెల్ప్ తీసుకోవడం నచ్చని షన్నూ కోపంతో చిర్రుబుర్రులాడాడు.‘నాకు నీకంటే ఎక్కువ బాధగా ఉంది నామినేషన్స్ రోజు టార్గెట్ చేసింది వాళ్లు, గేమ్‌లో కార్నర్ చేసింది వాళ్ళే ఇప్పుడు కళ్ళకు దెబ్బ తగిలింది వాళ్ళ వల్లే మళ్ళీ వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నావ్ బుద్ధిలేకుండా నువ్వు నా ఫ్రెండ్‌గా ఉన్నందుకు సిగ్గుగా ఉంది. నాకు లేదా నొప్పి నేను ఐస్‌లోనే ఉన్నాను సెల్ఫ్ రెస్పెక్ట్(Self Respect) ఉండాలి, మనిషికి నాకు ఇంత వీక్ ఫ్రెండ్ ఉందని సిగ్గు వేస్తుంది నువ్ నా ఫ్రెండ్‌గా ఉండొద్దు ఛీ ’ అంటూ సిరి పై ఫైర్(Fire) అయ్యాడు.

ఐస్‌ వాటర్‌(Ice Water) నుంచి బయటకు రాగానే వేడినీళ్లు(Hot water) పోయడం హానికరమని హెచ్చరించిన బిగ్‌బాస్‌(Big Boss).ఆ విషయాన్నీ లెక్కచేయని ప్రియాంక కాళ్లు తిమ్మిరెక్కిన శ్రీరామ్‌కు జండూ భామ్‌ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్‌ చేసింది. దీంతో అతనికి తగ్గకపోగా వాపుతో పాటు నొప్పి మరింత ఎక్కువైంది. శ్రీరామ్‌ను వెంటనే మెడికల్‌ రూమ్‌లోకి పిలిచి ట్రీట్మెంట్ ఇచ్చారు.

ఐస్‌ వాటర్‌లో నుంచి బయటకు వచ్చాక కాళ్లపై వేడినీళ్లు పోయడం హానికరమని చెప్పినప్పటికీ పింకీ శ్రీరామ్‌కు అలా చేసిందేంటని మానస్‌, కాజల్‌  ఇర్రిటేట్ అయ్యారు.

అయితే ఇలా జరుగుతుందని ఊహించలేదని పింకీ శ్రీరామ్‌కు సారీ చెప్పింది. కానీ ఆమె చేసిన తప్పు వల్ల శ్రీరామ్‌ బెడ్‌కే పరిమితం అయ్యాడు.

దీంతో ఒక అడుగు కూడా వేయలేకపోతున్న హౌస్ మేట్స్ (House Mates) బాధలు చూసి సన్నీ ఏడ్చేశాడు. తర్వాతి రోజు శ్రీరామ్‌ పాడిన ‘గెలుపు తలుపులే తీసే ఆకాశమే సాంగ్‌ ప్లే చేయడంతో అతడు ఎమోషనల్ (Emotional) అయ్యి కన్నీరు పెట్టుకున్నాడు.

ఫైనల్‌(Final0గా తొలి రౌండ్‌(First Round)లో సన్నీ ఎక్కువ బాల్స్ ఉండడం తో మొదటి స్థానంలో ఉండగా, పింకీ చిట్టచివరి స్థానంలో నిలిచింది. తర్వాత ఫోకస్‌(Focus) అనే రెండో లెవల్‌(Second Level)లో బజర్‌ మోగినప్పుడు 29 నిమిషాలు లెక్కించి గంట కొట్టాలి. ఎవరైతే సరిగ్గా, లేదా 29 నిమిషాలకు దగ్గరలో ఉన్నప్పుడు బెల్‌ మోగిస్తారో వారు గెలిచినట్లు తెలిపాడు బిగ్ బాస్(Big Boss). ఈ గేమ్‌(Game)లో సన్నీ, మానస్‌ని  సాయం చేయమంగా  అతడు చేస్తానని అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

దీంతో సన్నీ మానస్‌ లెక్కపెడుతున్నాడని కూల్ గా వున్నాడు. పదేపదే అతడి వైపు చూడసాగాడు. దీంతో అక్కడున్న మిగతా హౌస్‌మేట్స్‌ కు మానస్, సన్నీ కి హెల్ప్ చేస్తున్నాడని అర్థమైంది. చివరకు మానస్‌ లెక్కపెట్టడం అయిపోయిందని సైగ చేసిన వెంటనే సన్నీ గంట కొట్టాడు.

ఇక గురువారం ప్రోమో(promo )లో షన్ను, కాజల్ మాటల బాణాలు ఒక్కరిపై ఒక్కరు విసురుతూ కనిపించారు.

 

 

 

 

.