బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) లో ఎనిమిదో వారం లోబో ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇక తోమిదో వారం ఎలిమినేషన్స్(Eliminations) కి జరిగే నామినేషన్స్(Nominations) ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ లో ఎవరు ఎవరిని నామినేట్ చేసి  ఇంటి నుంచి బయటకు పంపనున్నారో?

వాళ్ళ మధ్య జరిగిన హీట్ డిస్కషన్ ఏంటో?  తెలియాలంటే సోమవారం 58 వ   ఎపిసోడ్ చూడాల్సిందే.

తొమ్మిదో వారం నామినేషన్స్‌ లో భాగంగా హౌసే మేట్స్(House mates) ఎలాంటి ముసుగు లేకుండా నామినేట్ చేయాల్సింది బిగ్ బాస్(Big Boss) మెలిక పెట్టారు. అందులో భాగంగా ఒక్కో కంటెస్టెంట్(Contestants) ఇద్దరినీ నామినేట్ చేస్తూ అందుకు తగిన కారణాలను తెలియజేసి నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్స్  ముఖంపై తెల్లటి క్రీమ్‌ని పూయాలని చెప్పారు బిగ్ బాస్.

ఇంటి కెప్టెన్ అయిన షణ్ముఖ్ ని నామినేట్ చేయడానికి వీళ్లేదని చెప్పారు బిగ్ బాస్.

ఈ నామినేషన్ ప్రక్రియను మానస్‌తో మొదలు పెట్టమని ఆదేశించారు బిగ్ బాస్.

మానస్- శ్రీరామ్, జెస్సీలను నామినేట్(Nominate) చేశాడు. సంచాలకుడిగా సరైన నిర్ణయం తీసుకోలేదని జెస్సీని నామినేట్‌ చేశాడు.

శ్రీరామ్‌తో కనెక్షన్ కుదర్లేదని ప్రతివారం ఎవరో ఒకరు వెళ్లిపోవాలని, నువ్వెళ్లిపోయినా నాకు ఫరాఖ్‌ పడదంటూ శ్రీరామ్‌ను నామినేట్‌ చేశాడు మానస్‌.

నువ్వు ఉన్నా ఫరాఖ్‌ పడదని కౌంటరిచ్చాడు శ్రీరామ్‌. తర్వాత  కాలేజీలో  జరిగే చైన్ బ్యాచ్‌లాంటి గొడవలొద్దంటూ శ్రీరామ్‌ -సన్నీ, మానస్‌ను నామినేట్‌ చేశాడు.

‘అన్నీ మంచి క్వాలిటీస్‌, ఫెంటాస్టిక్‌ పర్సన్‌ కానీ ధైర్యం కోల్పోతున్నావ్‌’ అంటూ మానస్‌ను, తర్వాత కాజల్‌ను నామినేట్‌ చేశాడు రవి.

స్ట్రాంగ్‌ అంటూ విశ్వను, రవి ఆలోచనలను అందుకోలేకపోతున్నా నామినేట్‌ చేసింది,ప్రియాంక .

సిరి- సన్నీ, యానీని; జెస్సీ- సన్నీ, మానస్‌ను; సన్నీ- జెస్సీ, సిరిని నామినేట్‌ చేశారు.

స్ట్రాంగ్‌గా ఉండేవాళ్లు వెళ్లిపోవాలంటే వీక్‌గా ఉండేవాళ్లు కూడా ఈ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ విశ్వ- ప్రియాంకను, తర్వాత మానస్‌ను నామినేట్‌ చేశాడు.

ఇక కాజల్- రవి మధ్య మరోసారి ఫైట్‌ జరిగింది. ఆమె రవితోపాటు శ్రీరామ్‌ను నామినేట్‌ చేసింది. యానీ- సిరి, కాజల్‌ను నామినేట్‌(Nominate) చేసింది. షణ్ను- మానస్‌, ప్రియాంకను నామినేట్‌ చేశాడు.

ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ ‘ప్రియాంక నీ గేమ్‌ నువ్వే ఆడు, అందరిలో నువ్వే స్ట్రాంగ్‌ అనిపిస్తావు’ అని అన్నాడు.

దీంతో ఇర్రిటేట్ అయిన పింకీ ‘నామినేట్‌ అయ్యి  వెళ్లిపోయాక ఇంకెవరు ఆడతారు?’ అని షన్ను మీద విరుచుకుపడింది. అయిన  నేను ఏ టాస్క్ లో  సరిగా ఆడటంలేదో చెప్పాలి అని కోపడింది. షణ్నుక్రీం రాస్తుంటే  పింకీ ఆ ప్లేట్‌ను కోపం తో  తన ముఖాన గట్టిగా కొట్టుకుంది.

నామినేషన్‌(Nomination) పూర్తయ్యాక సిరి మరోసారి సన్నీని ఎందుకు నామినేట్‌ చేశానో అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. కానీ ఇది వారిద్దరి వాగ్వాదానాలకు దారి తీసింది.

హైలైట్‌ అవ్వాలనే ఇలా చేసింది అని సన్నీ మానస్‌ గుసగుసలు ఆడుతుంటే అది విన్న సిరి, ఎం అన్నావు హైలైట్‌ ఆ?  నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ పడరిక్కడ అని గట్టి వార్నింగ్‌ ఇచ్చింది.

ఇక ఈ వారం మానస్‌, సన్నీ, శ్రీరామ్‌, సిరి, కాజల్‌, ప్రియాంక, రవి, జెస్సీ, యానీ, విశ్వ నామినేషన్స్ ఉన్నట్టు బిగ్ బాస్(Big Boss) ప్రకటించారు.

అయితే మంగళవారం ఎపిసోడ్‌లో నామినేషన్స్(Nominations) లో వున్న కంటెస్టెంట్స్(Contestants) నుంచి ఒక్కరిని సేవ్ కావడానికి ఇమ్యునిటీ (Immunity)టాస్క్ బిగ్ బాస్(Big Boss) ఇచ్చారు.

ఆ టాస్క్‌ లో నామినేషన్స్‌ లో ఉన్న పది మంది పోటీ పడుతున్నారు ప్రోమో(Promo) లో చూపెట్టారు.

మరివారి లో ఎవరు ఇమ్మ్యూనిటి గెలుచుకుని ఈవారం నామినేషన్స్ నుంచి తప్పుకోనున్నారో? చూడాలంటే మంగళవారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే…..