బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) తొమ్మిదో వారం షన్ను తప్ప మిగిలిన వారందరు నామినేషన్స్(Nominations) లో ఉండగా, టాస్క్ ద్వారా ఒక్కరు  సేఫ్ జోన్ లోకి వెళ్తారంటూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్(Big Boss).

ఈ టాస్క్(Task) లో యానీ మాస్టర్ సేఫ్ అవ్వగా, ఆ తరువాత యానీ సంపాదించుకున్న ఇమ్మ్యూనిటిక్ పవర్ ఇచ్చి ఒక్కరిని (Safe) చేయవచ్చని మెలిక పెట్టాడు. దాంతో యాని, మానస్ కి పవర్ ఇచ్చి సేవ్ చేసింది. మొత్తానికి ఈ వారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు.

అలా నామినేషన్ ప్రక్రియ ముగిసిందో లేదో హౌస్ మేట్స్(House mates)కి కెప్టెన్సీ (Captaincy)టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగం గా హౌస్ మేట్స్ ని రెండు గ్రూపులుగా విడదీసాడు.

ఇందులో హీరోస్(Heroes)టీంలో షన్ను,మానస్,శ్రీరామ్,పింకీ,కాజల్ వున్నారు. విలన్స్‌(Vilans) టీమ్‌లో రవి, యానీ, సన్నీ, విశ్వ, జెస్సీ, సిరి ఉన్నారు. బిగ్ బాస్ ప్రతి టాస్క్ లో ఎదో ఒక మెలిక పెట్టడం సాధారణమే ఈ టాస్క్ లో కూడా కంటెస్టెంట్స్ యొక్క సహనాన్ని పరీక్షిస్తున్న బిగ్ బాస్.

ఈ విలన్ టీమ్‌ ని లీడ్ చేస్తున్న రవిని హీరోస్ టీమ్‌ టార్గెట్ చేసారు మరి ఆ టాస్క్ ఏంటో ఇంతకీ విలన్స్ వెర్సస్ హీరోస్ టీమ్‌ లో ఎవరు గెలిచారో? నాతో పాటు మీరు ఇక్కడ నిన్నటి ఎపిసోడ్ పై ఓ లుక్ వేసేయండి…..

కాజల్, మానస్ కూర్చుని ఉండగా మానస్ తప్పుగా అనుకోనంటే ఒకటి చెప్తా పింకీ మానస్ అనే జోన్ దాటి వెళ్లడం లేదు నిన్న నైట్ వెళ్లి ఆమెకు చెప్పాను. నీ ఆట నువ్వు ఆడు అని చాలామంది అంటున్న మాట ఇదే పింకీకి మానస్ అంటే ఇష్టం ఉంది. అలాగే గేమ్ ఆడుతుంది అని సన్నీ అంటే ‘నేను ఈ మాట ఆమెకు రెండు వారాలుగా చెప్తున్నా.

పింకీ మైండ్ ఎలాంటిదంటే తనకు ఏది అనిపిస్తే అదే చేస్తుంది ఎవరు చెప్పినా వినదు విన్నట్టుగా నటిస్తుంది తప్ప తరువాత పోరా బచ్చా అని అనుకుంటుంది అని మానస్ చెప్తాడు.

మరో వైపు  జెస్సీ, సిరి బెడ్ పడుకుని ఉండగా అదే బెడ్‌పైకి ప్రియాంక కూడా వచ్చింది. రా రా నువ్వు  ఈ పక్కన కూర్చో ఒకరు అటు ఒకరు ఇటు అని అంటాడు  జెస్సీ. దీంతో ప్రియాంక సుఖ పురుషుడివిరా నువ్వు అని అతని పక్కన చేరింది.

జెస్సీ బెడ్‌పై అటు సిరి ఇటు ప్రియాంక ఉండటంతో మనోడిలో రొమాంటిక్(Romantic) యాంగిల్ బయటకు వచ్చింది. ఆహా ఇదే నాకు బెస్ట్ టైం నా బుగ్గలు రెండు ఖాళీగా ఉన్నాయి.

ఇద్దరూ ముద్దులు పెట్టొచ్చు కదా అని అడిగాడు జెస్సీ. దీంతో సిరి.. కెమెరా నుంచి కాలు బయటకు వచ్చి మరీ తన్నుతుందని సెటైర్ వేసింది. అదేంటే ముద్దు పెట్టవే అని మళ్లీ సిరిని అడిగాడు జెస్సీ పెట్టనురా అది నీకు కూడా తెలుసు అని చెప్పింది సిరి. దీంతో జెస్సీ పింకీ నువ్వు కూడా పెట్టవా నాకు అని అనడంతో సర్లే పెడతాలే బొజ్జో అంటూ అతని గెడ్డం పట్టుకుని సరసాలు ఆడటం మొదలుపెట్టింది. దీంతో సిరి సర్లే నేను వెళ్లనా మీరిద్దరూ మాట్లాడుకుంటారా? అని వీళ్ల సరసాలపై మరో సెటైర్ వేసింది.

నువ్వు  ఎక్కడికి పోతావ్ నువ్వు  నా పెద్ద బేబీవి అని అన్నాడు జెస్సీ. అవున్రా ఎంతమంది వచ్చినా నీకు నా తరువాతే ఎవరైనా అంటూ సిరి అన్నది. మొత్తానికి వీళ్లు సరసాలు చూస్తే కాస్త ఫన్నీ(Funny) గా అనిపించింది

ఆ తరువాత హీరోస్ వెర్సస్ విలన్స్(Heroes versus Vilans) టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్(Big Boss). ఇందులో భాగం గా ముందు హీరోస్ టీమ్ కి టాస్క్ ఆడే ఛాన్స్ రాగానే విలన్స్(Vilans) టీమ్ రెచ్చిపోయి మరి శ్రీరామ్ ని  ఓ ఆట ఆడేసుకున్నారు.

విచిత్రమైన జ్యూస్ ఇచ్చి తాగమన్నారు. అలాగే సాస్ ఇచ్చి తలమీద పోసుకోమన్నారు శ్రీరామ్ చంద్ర కూడా ఎక్కడ తగ్గేదే లే అంటూ ఇచ్చిన టాస్క్ ని ఎంతో  సహనంగా ఆడి నిలిచాడు.  ఆ తరువాత విలన్స్ వంతు రావడం తో హీరోస్(Heroes) టీమ్ రవి ని టార్గెట్(Target) చేసారు.

అతనికి ఒంటి నిండా పేడ పూసి ఒంటిపై నుంచి పేడ నీళ్లు పోసుకునేట్టు చేసారు.  అయితే అన్నింటికీ తెగించిన రవి ఒంటికి పేడ పూసుకుని పై నుంచి పేడ నీళ్లు పోసుకున్నాడు. పై నుంచి పేడ కంపు కొడుతున్న ఏ మాత్రం చెలించని రవితో కడుపు తిప్పేసేలా ఉండే రకరకాల జ్యూస్‌లు ఇచ్చి చుక్కలు చూపించారు.

అయితే రవి మాత్రం వెనకడుకు వేయడం లేదు. వాళ్లు ఏది ఇస్తే అది తాగాడు. అంతటి తో ఆగకుండా మానస్‌ డంబెల్స్(Dumbles) తెచ్చి రవి తో వర్క్ అవుట్  చేయించాడు.

నిజానికి యాంకర్ రవికి బ్యాక్ పెయిన్ వున్నా కూడా వర్క్ అవుట్(Work Out) చేసాడు. ఆ తరువాత కాజల్, షన్ను ఇచ్చిన జ్యూస్ తాగి గెలిచాడు.

మరి ఈ టీమ్ లో చివరకు ఏ టీమ్ కెప్టెన్సీ(Captaincy) పోటీకి లో నిలబడనున్నారో తెలియాలంటే గురువారం ఎపిసోడ్ చూడాల్సిందే.