రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) హిమాలయన్(Himalayan) ADV ఆధారిత స్క్రామ్ 411ని భారతదేశం(India)లో మార్చి 15(March 15th)న విడుదల చేసింది. రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ కొత్త బాడీ టైప్‌(New Body Type)ను అందించే ప్రపంచం(World)లోనే అత్యంత పురాతనమైన బైక్ బ్రాండ్( Ancient Bike Brand) నుండి విడుదల చేసిన ప్రధాన లాంచ్‌లలో ఒకటి. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఆధారంగా రూపొందించబడినప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కంటే దీనిని నిర్వహించడం చాలా సులభం మరియు రోడ్డుకు అనుకూలమైనది.

హిమాలయన్ స్క్రామ్ 411 ప్రత్యేకతలు:

రాయల్ ఎన్ఫీల్డ్(Royal Enfield) లో ఇప్పటికే ఉన్న హిమాలయన్ బైక్ ప్లాట్ఫారమ్ ఆధారంగానే ఈ “స్క్రామ్ 411” బైక్ ను రూపొందించారు. అయితే చిన్న చిన్న మార్పులు చేశారు. ముందుగా చెప్పుకోవాల్సింది హెడ్ లాంప్ డిజైన్(Head Lamp Design) గురించే. హిమాలయన్ కు, స్క్రామ్ 411కు మధ్య గుర్తించగల్గిన తేడా  హెడ్ లాంప్. హిమాలయన్ లో బయటకు పొంగుకొచ్చినట్లుగా ఉండే హెడ్ లాంప్.. స్క్రామ్ 411లో హ్యాండిల్ బార్(Handel Bar) లోకి చేర్చబడింది. ఇక ముందు టైర్(Tire) లోనూ మార్పులు చేశారు. హిమాలయన్లో ముందు భాగంలో 21 అంగుళాల టైర్ ఉంటే..స్క్రామ్ 411లో 119 అంగుళాల టైర్ అమర్చారు. ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్(Instrument Cluster) కూడా బిన్నంగా రౌండ్ LCD ప్యానల్(LCD Panel) ఏర్పాటు చేశారు.

స్క్రామ్ 411లో వెనుక భాగంలో ఫెండర్(Fender) తొలగించారు. ముందున ఉండే విండ్‌స్క్రీన్(Wind Screen), ర్యాప్‌రౌండ్ ఫ్రేమ్‌(Rap Round Frame)ను కూడా తీసేసారు . స్ప్లిట్ సీటు(Split Seat) స్థానంలో సింగిల్-పీస్ సీటు(Single Piece Seat) ఏర్పాటు చేశారు. వెనుకన ఉండే లగేజి ర్యాక్(Luggage Rack) ను తొలగించి గ్రాబ్ రైల్‌ ఏర్పాటు చేశారు. ఇవి మినహా ఇంజిన్ పరంగా హిమాలయన్ కు.. స్క్రామ్ 411కు మధ్య పెద్దగా మార్పులు లేవు. స్క్రామ్ 411.411cc, సింగిల్-సిలిండర్(Single Cylinder), ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌(Air Cooled Engine) కలిగి ఉంది. ఇది 24.3 bhp 32 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.5 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉన్నాయి. వైట్ – రెడ్(White-Red), గ్రే – యెల్లో(Grey-Yellow), గ్రే-రెడ్(Grey-Red), బ్లాక్ – రెడ్(Black-Red) వంటి కలర్ల కంబోలో ఈ హిమాలయన్ స్క్రామ్ 411 అందుబాటులో ఉంటుంది.