పవర్ స్టార్(Power star) పవన్ కళ్యాణ్(Pavan Kalyan) తో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పీరియాడిక్ యాక్షన్(Periodic Action) అడ్వెంచర్ మూవీ(Adventure Movie) హరిహర వీరమల్లు(Harihara Mallu). డైరెక్టర్(Director) క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

భారీ స్టార్ క్యాస్టింగ్(Huge Star Casting) తో అత్యంత భారీ వ్యయంతో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్(Mega Surya Productions Banner) పై ఏ ఎం రత్నం(AM Ratnam) నిర్మిస్తున్న, ఈ చిత్రంలో హరిహర వీరమల్లు పాత్రలో పవన్ నటిస్తుండగా ఆయనకు జోడీ(Pair)గా యంగ్ బ్యూటీ(Young Beauty) నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తోంది. నర్గిస్ ఫక్రి(Nargis Fhakri) కీలక పాత్ర(Key Role) చేస్తున్నారు.

ఈ మూవీలో ఆదిత్య మీనన్(Aditya Menon), అర్జున్ రామ్ పాల్(Arjun Rampal), పూజిత పొన్నాడ(poojitha Ponnada) తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్(Shooting) జరుపుకున్న ఈ చిత్రంలో నుండి కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్(First Look Teaser) ఎంతో ఆకట్టుకుని అందరిలో మూవీ పై భారీ అంచనాలు(Huge Excpectations) పెంచింది.

అయితే, ఇటీవల కొన్నాళ్లుగా తన జనసేన పార్టీ(Janasena Party) పనుల్లో బిజీగా ఉన్న పవన్, కొద్దిరోజుల క్రితం స్క్రిప్ట్(Script) విషయమై దర్శక నిర్మాతల(Producer)కి కొన్ని సూచనలు చేయగా, ఇటీవల ఫైనల్(Final) గా అవన్నీ పూర్తి చేసిన దర్శకుడు క్రిష్, తదుపరి షెడ్యూల్ (Next Schedule)సిద్దంచేసినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో సమ్మె పరిస్థితులు కనిపిస్తుండడంతో అన్ని చక్కబడిన తరువాత పక్కాగా తదుపరి షెడ్యూల్  ని ప్రారంభించి నిర్విరామంగా మూవీని పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా(Pan India) మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు వచ్చే ఏడాది ప్రేక్షకుల(Audience) ముందుకు రానుంది.