భారత్ (India) మొత్తం జనాభా(Population)లో 50 శాతానికిపైగా 30 ఏళ్ల లోపు వారే ఉండటం విశేషం. అంటే సగం మందికిపైగా యువతే ఉంది. దీంతో.. భారత్ ప్రస్తుతం ప్రపంచం(World)లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ(economic system)గా అంచనా వేయబడింది.

ఇక జనవరి 18 వరకు భారత జనాభా 142.3 కోట్లకు చేరి ఉంటుందని WPR పేర్కొంది. భారత్‌లో జనాభా పెరుగుదల కాస్త మందగించినప్పటికీ.. కనీసం 2050 వరకు భారత జనాభా పెరుగుతూనే(Increases) ఉంటుందని అంచనా వేస్తోంది.

భారత్ జనాభాలో చైనాను అధిగమించి తొలిస్థానానికి చేరుకున్నట్లు పలు అంతర్జాతీయ సంస్థలు ఇదివరకే అంచనా వేయగా తాజాగా వరల్డ్ పాపులేషన్ రివ్యూ(World Population Review) కూడా అదే మాట తెలిపింది. ఇతర అంతర్జాతీయ మార్కెట్(International Market) పరిశోధన (Research)సంస్థ మాక్రోట్రెండ్స్ (Macro trends) కూడా ప్రస్తుతం భారత జనాభా 142.8 కోట్లు అని లెక్కగట్టింది. ఇది చైనా(China) ఇటీవల ప్రకటించిన జనాభా కంటే ఎక్కువే.

ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు ప్రకటించే భారత్ ఈసారి కరోనా సృష్టించిన అవాంతరాల మధ్య ఆ పని చేయలేకపోయింది. అంతర్జాతీయ సంస్థలు, వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనా వేస్తున్న క్రమంలో ఇప్పటికే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ ముందుగా ఉందనే స్పష్టం అవుతోంది.

చైనాలో ఇటీవల అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్(Covid) మహమ్మారి విజృంభించగా లెక్కలేనన్ని సంఖ్యలో మరణాలు(Deaths) కూడా సంభవించాయి. మరోవైపు జననాల రేటు తగ్గుతోంది. వయోవృద్ధుల(Senior Citizen) సంఖ్య ఎక్కువగా ఉంది.

దీంతో ఈ నేపథ్యంలోనే తమ జనాభా తగ్గినట్లు చైనా ఇటీవల పేర్కొంది. చైనా జనాభాను భారత్ 2023 నాటికి అధిగమిస్తుందని ఐక్యరాజ్యసమితి(United Nations) అంచనా వేయగా అది కాస్త ముందుగానే చేరుకున్నట్లు తెలుస్తోంది. 2025 చివరికల్లా భారత దేశ జనాభా ఏకంగా 167 కోట్ల (167 Crores)ను తాకుతుందని ఐరాస అభిప్రాయపడింది.