బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) పన్నెండో వారం ప్రారంభమైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్(Contestants) తో మొదలైన షో ప్రస్తుతం 8 మంది మిగిలారు. సోమవారం ఎలిమినేషన్(Elimination) కి జరిగే నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.

సోమవారం అంటేనే  హౌస్ మేట్స్ అందరు పూనకం వచినట్టు తెగ ఊగిపోతుంటారు. ఈ వారం నామినేషన్(Nomination) ప్రక్రియ కూడా హీట్ ఆర్గ్యుమెంట్స్ తో కొనసాగింది. సిల్లీ రీజన్స్ ని కూడా పెద్దగా క్రియేట్ చేసి హౌస్ మేట్స్(House mates) ని నామినేట్ చేసి రచ్చ రచ్చ చేస్తుంటారు.

మరి ఈ వారం ఎవరు ఎవరి మీద పగ పెంచుకుని ఇంట్లో నుంచి పంపడానికి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేసారో ఆ హైలైట్స్  ఇక్కడ చూద్దాం.

బిగ్‌బాస్‌ ఇంట్లో ఈ వారం నామినేషన్స్‌(Nomination) లో భాగంగా కెప్టెన్ మానస్ ని నామినేషన్స్ నుంచి మినహాయింపు పొందాడు. ఈ ప్రక్రియలో భాగంగా నామినేట్‌ చేయాలనుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్(Contestants) దిష్టిబొమ్మలను పగలగొట్టాల్సి ఉంటుంది.

మొదటగా రవి వంతు రాగా విధులు సరిగా చేయలేదంటూ సన్నీని, తర్వాత కాజల్‌ను నామినేట్‌ చేశాడు. గతవారం ఆట పెద్దగా ఆడలేదంటూ షణ్ను కుండ పగలగొట్టింది ప్రియాంక. సిరిని నామినేట్‌ చేసే క్రమంలో ఇద్దరు వాగ్వాదానికి దిగారు.

కెప్టెన్‌గా, సంచాలకుడిగా పర్ఫెక్ట్‌ గా లేడంటూ షణ్ను, రవి దిష్టిబొమ్మపై కుండ పెట్టి పగలగొట్టాడు. సిరి-షణ్ను ప్లాన్‌ చేసుకుని వచ్చారా? అన్న ప్రశ్న వీకెండ్‌లో కాకుండా డైరెక్ట్‌గా తనని అడిగివుంటే  బాగుండేదని కాజల్‌ను నామినేట్‌ చేశాడు. నీవల్ల కెప్టెన్సీ కంటెండర్‌ (Captaincy Contender)కాలేకపోయానంటూ సన్నీ కుండ బద్ధలకొట్టాడు శ్రీరామ్‌.

ఎవిక్షన్‌ పాస్‌(Eviction Pass) యానీ మాస్టర్‌కు రాకుండా చేసి సన్నీకిచ్చిన కాజల్‌ కుండ ముక్కలు చేస్తూ ఆమెపై మండిపడ్డాడు శ్రీరామ్‌. యానీ మాస్టర్‌కు పాస్‌ రాకుండా చేయడం వల్ల ఆమె ఎలిమినేట్‌(Eliminate) అయిందని తన కోపాన్ని వెళ్లగక్కాడు.

దీంతో వారై మధ్య జరుగుతున్న ఆర్గ్యుమెంట్ లో ఆటిట్యూడ్(Attitude) చూపించిన శ్రీరామ్.  వీరి మధ్యలో  గ్రూప్ మ్యాటర్ రావడంతో నేను, షణ్ముఖ్, సిరి, మానస్ ఒక గ్రూప్ ఇప్పుడేమంటావ్ అని అడిగిన శ్రీరామ్.

ఆ తరువాత నేను ఐదు కోట్ల మంది ఒక గ్రూప్ ఇప్పుడు చెప్పు అని అన్నాడు. దీంతో సన్నీ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు. ఆ ఐదు కోట్లమంది గ్రూప్‌కి లీడర్‌ని నేను అని అన్నాడు. కోపం లో వున్న శ్రీరామ్ సన్నీని నామినేట్ చేసి కుండబద్దలు కొట్టాడు .

హౌస్‌లో అందరికంటే ఫేక్‌(Fake) అంటూ రవిని నామినేట్‌(Nominate) చేశాడు సన్నీ. ఇక హౌస్‌ నుంచి వెళ్లిపోయిన యానీ మాస్టర్‌ కోసం సన్నీ, శ్రీరామ్‌ మధ్య తార స్థాయి లో రచ్చ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు నానా మాటలు అనుకున్నారు.

తరువాత  సిరి, నా వెనకాల మాట్లాడొద్దంటూ పింకీని, అలాగే రవిని నామినేట్‌ చేసింది. హౌస్‌లో నాకు ఇష్టం లేని వ్యక్తి, జెన్యున్‌గా లేనిది ఒక్కడేనంటూ రవిని నామినేట్‌ చేసింది కాజల్‌.

యానీ మాస్టర్‌ ఉసురు పోసుకుంటున్నామని అనడం నచ్చలేదని శ్రీరామ్‌ కుండ పగలగొట్టింది. తర్వాత కెప్టెన్‌(Captain) మానస్‌, శ్రీరామ్‌, రవిని నామినేట్‌ చేశాడు. మొత్తానికి సాగిన నామినేషన్(Nomination) ప్రక్రియలో కెప్టెన్‌ మానస్‌ మినహా మిగతా ఏడుగురూ నామినేషన్ లో వున్నారు