విశ్వక్‌ సేన్‌(Vishwak sen) హీరో(hero)గా నటిస్తున్న తాజా సినిమా ‘ఓరి దేవుడా’ (Ori Devuda Movie). తమిళంలో అశోక్‌ సెల్వన్‌, ‘గురు’ ఫేమ్‌ రితికా సింగ్‌ జంటగా నటించిన ‘ఓ మై కడవులే’ సినిమాను తెలుగు(Telugu)లో రీమేక్‌(Remake) చేసారు. తమిళం సినిమా(Tamil Movie)కి దర్శకత్వం వహించిన అశ్వత్‌ మారిముత్తు(Ashwath Mrimuthu) తెలుగు సినిమాకూ దర్శకత్వం(Direction) వహిస్తున్నారు.

ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో దేవుడి పాత్ర కూడా ఉంటుంది. తమిళ సినిమా ‘ఓ మై కడవులే’లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) దేవుడి పాత్ర(God Role) పోషించారు. తెలుగులో ఆ పాత్రను విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) చేస్తున్నారు. దేవుడు అనగానే కిరీటం, స్వర్గం వంటివి గెట్ అప్ ఏమి ఉండదు, మోడ్రన్ మనిషిలా ఉంటారు. ఇంకా చెప్పాలంటే, వెంకటేష్ నటించిన  ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించిన దేవుడి పాత్రలా అన్నమాట! ఇప్పుడు విశ్వక్ సేన్ సినిమాలో వెంకటేష్ అలా కనిపించనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో వెంకటేష్, ఇతర నటీనటులు షూటింగ్(Shooting) లో పాల్గొన్నారు. ఓరి దేవుడా లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ వారాంతంలో  ఆయన షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం.

ఓరి దేవుడా చిత్రానికి పెరల్‌ వి పొట్లూరి(Pearl V Potluri), పరమ్‌ వి పొట్లూరి(Param V Potluri), ‘దిల్‌’ రాజు(Dil Raju) నిర్మాతలు(Producers). హీరోగా విశ్వక్‌ సేన్‌కు 6వ సినిమా ఇది. ఇందులో మిథిలా పాల్కర్‌ (Mithila Palkar) హీరోయిన్(Heroine) గా నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది వరకే ఫస్ట్ లుక్(First Look), మోషన్ పోస్టర్(Motion Poster), ఒక సాంగ్ రిలీజ్(Song Release) చేశారు.ఈ మూవీకి యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దాస్యం మాటలు  రాస్తున్నారు. ఈ మధ్య విడుదలైన ‘ఓకే ఒక జీవితం’ సినిమాకు ఆయన డైలాగులు రాసిన విషయం తెలిసిందే. సంభాషణల రచయిత (Dialogue Writer)గా ఆయన రాస్తున్న మరో చిత్రమిది.

విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’లో మాత్రమే కాదు, సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న హిందీ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో కూడా వెంకటేష్ గెస్ట్ రోల్(Guest Role) చేస్తున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ అన్నయ్య పాత్రలో వెంకీ కనిపించనున్నారు.

ఎఫ్ 3 సినిమాతో ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర వెంకటేష్ సందడి చేశారు. ఆ తర్వాత ఆయన మరో సినిమాలో నటించలేదు. వెంకీతో సినిమా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి తేజ వరకు చాలా మంది కథలు చెప్పారు. కానీ, ఏదీ ఓకే కాలేదు. ఇక హిందీలో హిట్ అయిన ‘దే దే ప్యార్ దే’ రీమేక్ రైట్స్ వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు దగ్గర ఉన్నాయి. బహుశా ఆ రీమేక్ ఏమైనా స్టార్ట్ చేస్తారేమో చూడాలి.

ఇప్పుడు వెంకటేష్ సోలో హీరోగా మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. మంచి కథలు వస్తే మల్టీస్టారర్(Multi Starer) సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్(Leon James) సంగీతం(Music) అందించారు. గ్యారీ బిహెచ్(Gyari BH) ఎడిటింగ్(Editing), విధు అయ్యన్న(Vidhu Ayyanna) సినిమాటోగ్రఫీ(Cinematography) అందించారు.ఈ రీమేక్ దీపావళి(Deepavali)కి అక్టోబర్ 21(October)న థియేటర్లో సందడి చేయనుంది.