బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season5) మరి కొన్ని రోజుల్లో చివరి దశకు చేరుకోనుంది.

మొత్తం 19 కంటెస్టెంట్స్(Contestants) తో ప్రారంభమైన ఈ  షో ప్రస్తుతానికి 8 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ప్రతివారం సోమవారం నామినేషన్(Nominations) ప్రక్రియ తో పాటు కెప్టెన్సీ (Captaincy) కంటెండర్ టాస్క్ లు కూడా ఆడిస్తుంటాడు బిగ్ బాస్(Big Boss).

పన్నెండో వారం కెప్టెన్(Captain)గా మానస్ కొనసాగుతుండగా తదుపరి వారానికి కెప్టెన్ ని ఎంచుకోవడానికి జరిగే కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. అయితే కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి కంటెస్టెంట్స్ అందరు ఉత్సాహంగా వున్నారు.

ఎందుకంటే ఇదే చివరి కెప్టెన్సీ టాస్క్ కాబట్టి. మరి ఈ టాస్క్ తో హౌస్ మేట్స్(House mates) మధ్య ఎలాంటి చిచ్చు పెట్టాడో బిగ్ బాస్? తదుపరి కెప్టెన్ గా ఎవరు అవ్వనున్నారో? తెలియాలంటే 80వ ఎపిసోడ్ పై ఓ లుక్ వేయాల్సిందే.

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో చివరి కెప్టెన్సీ టాస్క్‌(Captaincy Task) లో భాగంగా హౌస్ మేట్స్ కు ‘నియంత మాటే శాసనం’అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. గార్డెన్‌ ఏరియాలో నియంత సింహాసనం ఏర్పాటు చేశారు.

సైరన్‌ మోగిన ప్రతిసారి ఆ సింహాసనంలో ఎవరైతే ముందుగా కూర్చుంటారో వాళ్లు ఆ రౌండ్‌ ముగిసేవరకు నియంతలా వ్యవహరిస్తారు. అంతేకాదు ఆ రౌండ్‌ వరకు వాళ్లు సేఫ్‌(Safe) అవుతారు కూడా.

మిగిలిన ఇంటి సభ్యులు(House mates) తమని తాము సేవ్‌ చేసుకోవడానికి ఓ చాలెంజ్‌(Challenge)లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరు నియంతతో మాట్లాడి తమని సేవ్(Save) చేయడానికి ఒప్పించుకోవాలి. అయితే ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్‌ చేసే ఛాన్స్ నియంత కుర్చిలో కూర్చున్న వ్యక్తికి ఉంటుంది.

మొదటి  రౌండ్‌లో నియంత సింహాసనాన్ని లో కూర్చుంది సిరి. దీంతో నియంత సిరిని తప్ప మిగిలిన హౌస్ మేట్స్(House mates) కు ఒక చాలెంజ్‌(Challenge)ని ఇచ్చాడు బిగ్‌బాస్‌(Big Boss).

గార్డెన్‌ ఏరియాలో హుక్స్‌కి వేలాదదీయబడిన క్యాప్‌లను చేతితో తాకకుండా తలకు ధరించి.. పక్కనే ఉన్న హుక్స్‌కి పెట్టాల్సి ఉంటుంది. ఈ చాలెంజ్‌లో రవి, సన్నీలు మాత్రమే చివరి రెండు స్థానాల్లో నిలిచి నియంత దగ్గరకు వెళ్లి తాము ఎందుకు కెప్టెన్(Captain) అవ్వాలనుకుంటున్నామో తెలిపారు.

అయితే  సిరి అందరు ఊహించినట్లే సన్నీని తొలగించి రవిని సేవ్‌ చేసింది. దీంతో బాగా హర్ట్‌ అయిన సన్నీ ప్రతిసారి నన్నే టార్గెట్(Target) చేస్తున్నారని, ఫస్ట్‌ రౌండ్‌లోనే డిస్‌ క్వాలి(Dis Qualify)ఫై అయినందుకు బాధగా ఉందని షణ్ముఖ్‌ దగ్గర చెప్పుకున్నాడు.

ఇక రెండో రౌండ్‌లో నియంత సింహాసనాన్ని శ్రీరామ్ దక్కించుకున్నాడు. దీంతో మిగిలిన హౌస్ మేట్స్(House mates) కి  మరో చాలెంజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌(Big Boss). కాళ్లకి చెప్పులు ధరించి ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో అతికించాల్సి ఉంటుంది.

ఎవరైతే ఎక్కువ ఎత్తులో ఆ చెప్పుల్ని అతికిస్తారో వాళ్లు సేవ్(Save) అవుతారని. తక్కువ ఎత్తులో చెప్పుల్ని అతికించిన చివరి ఇద్దరి సభ్యులు నియంతని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఆట లో మానస్‌ అందరికంటే ఎత్తులో  చెప్పులు అతికించగా. రవి, కాజల్‌ తక్కువ ఎత్తులో  చెప్పులు అతికించడంతో  నియంత దగ్గర తమ వాదనలు చెప్పుకునే ఛాన్స్(Chance) వచ్చింది .

అయితే నియంతగా వ్యవహరించిన శ్రీరామ్ కాజల్‌ని తదుపరి రౌండ్‌కి పంపడానికి ఇష్టపడలేదు. కాజల్ ‘నేను ఇంతవరకు కెప్టెన్‌ కాలేదు. ఇదే నాకు చివరి చాన్స్‌ ఇప్పుడు నేను కెప్టెన్‌  కావాలనుకుంటున్నా’అని రిక్వెస్ట్‌ చేసినప్పటికీ. ఆమెను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి డిస్‌క్వాలిపై చేశాడు.

దీంతో బాగా హర్ట్‌ అయిన కాజల్‌,‘ఈ తొక్కలో డిస్కషన్స్ ఎందుకు రవికి ఇస్తానని ముందే చెప్పొచ్చుగా’అంటూ శ్రీరామ్‌పై సీరియస్‌ అయింది. కెప్టెన్‌(Captain) అయ్యే చివరి అవకాశం లేకుండా పోయిదంటూ. బాత్‌ రూంలోకి వెళ్లి బోరున ఏడ్చింది.

ఇక మూడో రౌండ్‌లో రవి నియంత సింహాసనాన్ని దక్కించుకున్నాడు. మిగిలిన ఇంటిన సభ్యులకు ఆరెంజ్‌ టాస్క్‌ ఇచ్చాడు. దీనిలో భాగంగా తలపై ఆరెంజ్‌లను పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి కొంచెం దూరంలో ఉన్న బుట్టలో వేయాలి.

ఈ టాస్క్‌ లో మానస్‌, షణ్ముఖ్‌ చివరి స్థానాల్లో నిలిచి నియంత రవికి ఇద్దరు తమ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న రవి. అందరు ఊహించినట్లే షణ్ముఖ్‌ని సేవ్‌ చేశాడు. ఇక నాలుగో రౌండ్‌లో ప్రియాంక నియంత సింహాసనాన్ని చేజిక్కించుకుంది . మిగిలిన హౌస్ మేట్స్(House mates) వాటర్ డ్రమ్స్ టాస్క్ ఇచ్చారు.

ఈ చాలెంజ్‌లో షణ్ముఖ్, శ్రీరామ్‌లు చివరి రెండు స్థానాల్లో నిలిచి నియంతతో తమ వాదనలు  వివరించారు. ఇక్కడ ప్రియాంక చాలా తెలివిగా వ్యవహరించి శ్రీరామ్‌ని డిస్‌ క్వాలిఫై(Dis Qualify) చేసి, షన్ను ని సేవ్ చేసింది. శ్రీరామ్‌ కూడా కెప్టెన్సీ టాస్క్‌(Captaincy Task) నుంచి డిస క్వాలిఫై అవ్వడంతో  కాజల్‌ ఆనందం తో చిందులేసింది.

ఆ తరువాత ఐదో రౌండ్‌లో భాగంగా సైరన్ మోగినా వెంటనే నియంత సింహాసనంపై ఒకేసారి సిరి, ప్రియాంక కూర్చున్నారు. అయితే సిరి కంటే ముందుగా ప్రియాంకే కుర్చుదంటూ, సిరిని కాదని పింకీకే ఛాన్స్(Chance) ఇచ్చాడు కెప్టెన్(Captain) మానస్. దీంతో సిరి చాలా హర్ట్ అయింది. ఫస్ట్‌ నేనే కూర్చున్న వాళ్లు అబద్దాలు చెబుతున్నారంటూ ఏడ్చేసింది.

ఇలాంటి చిన్న చిన్న వాటికి ఏడుస్తారా? గేమ్ ఆడు నువ్వు ఇంత వీక్ అయితే నా ఫ్రెండ్‌గా ఉండకు అని చెబుతూ సిరికి వార్నింగ్ షణ్ణ్ముఖ్‌. ప్రియాంకను గెలిపించాలని ఉంటే గెలిపించుకోండి కానీ. అన్ ఫెయిర్(Unfair) ఆట ఆడొద్దని ఫైర్ అయినా సిరి.

మరి బిగ్‌బాస్‌(Big Boss) హౌస్‌లో చివరి కెప్టెన్‌ ఎవరు అయ్యారో బుధవారం నాటి ఎపిసోడ్‌లో వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే..