వరుస చిత్రాలతో అభిమానులను అలరించిన మాస్ మహారాజా(Mass Maharaja), ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య(Walteru Veerayya)’లో అయన నటనతో దుమ్ములేపారు. ఇక తాజాగా విడుదలైన ‘ధమాకా(Dhamaka)’ చిత్రం కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్ల(Collections)ను రాబట్టింది. ప్రస్తుతం మాస్ మహారాజా ఫుల్ జోష్ లో ఉన్నారు. అభిమానులకు బ్యాక్ టు బ్యాక్(Back to Back) ఎంటర్టైన్(Entertain) చేస్తూనే ఉన్నారు.

ఇక రవితేజ లైనప్ లో విడుదలకు సిద్దమవుతున్న మరో యాక్షన్ థ్రిల్లర్(Action Thriller) ఫిల్మ్ ‘రావణసుర’ (Ravanasura). ఇక, ఈ చిత్రం నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్(Crazy Update) ను చిత్ర యూనిట్(Movie Unit) ప్రకటించింది. మరో రెండు  రోజుల్లో రవితేజ పుట్టిన రోజు ఉండటంతో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్(Surprise Plan) చేస్తున్నట్టు తెలుస్తోంది. రావణసుర నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్(Glimpse) ను రిలీజ్ కానుందంట.

జనవరి 26(January 26th)న మాస్ మహా రాజా బర్త్ డే(Birthday) స్పెషల్(Special) గా ఈ అప్డేట్ అందనుంది. దీంతో ఫ్యాన్స్ జోష్ లో వున్నారు. ఇక ఇప్పటి నుంచి ఈ మూవీ అప్డేట్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ అందనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘ధమాకా’తో  ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా ‘రావణసుర’ అప్డేట్స్ తో మరింత ఖుషి కానున్నారని తెలుస్తోంది.

స్వామి రారా ఫేమ్ డైరెక్టర్(Director) సుధీర్ వర్మ(Sudheer Varma)నే ఈ చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నారు. ఆర్టీ టీమ్ వర్క్(RT Team Works), అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ల(Abhishek Pictures Banners)పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవితేజ, అభిషేక్ నామా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సుశాంత్(Sushanth) ముఖ్య పాత్ర(Key Role)లో నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్(Good Response) వచ్చింది.

హీరోయిన్లు(Heroines) అను ఇమ్మాన్యుయేల్(Anu Immanuel), మేఘా ఆకాశ్(Megha Akash), ఫరియా అబ్దుల్లా(Faria Abdhulla), దక్షా నాగర్కర్(Daksha Ngarkar), పూజితా పొన్నాడ(Pooja Ponnada) నటించనున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2023 ఏప్రిల్ 7(April 7th)న థియేటర్స్(Theaters) లో విడుదల(Release) కానుంది.

ఇక మరో చిత్రం ‘టైగర్ నాగేశ్వర్(Tiger Nagaeswar)’ చిత్రంలోనూ మాస్ మహారాజ నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకుడుగా మరో చిత్రం కూడా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్(Shooting) దశలో ఉన్నాయి. ఈ ఏడాది కూడా బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.