అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya ), క్రేజీ హీరోయిన్(Crazy Heroine) కృతి శెట్టి(Krithi shetty) హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కస్టడీ (Custody). తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్(Update) వచ్చింది. మే 12(MAY 12TH)న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే నాగచైతన్య ఫస్ట్ లుక్‌ తో పాటు గ్లింప్స్‌ ని కూడా విడుదల చేసిన మూవీ మేకర్స్. బుధవారం కృతి శెట్టి ఫస్ట్ లుక్‌(First Look)ని రిలీజ్ చేసింది.

ఈ మూవీలో రేవతిగా కృతి శెట్టి నటిస్తోంది. వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వం(Direction) వహిస్తున్న కస్టడీ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. అక్కినేని నాగచైతన్య పోలీస్ యూనిఫామ్‌లో ఉండగా అతని చుట్టూ పోలీసులు ఉన్న పోస్టర్‌‌ని ఇప్పటికే కస్టడీ చిత్ర యూనిట్ విడుదల(Release) చేసింది.

అలానే ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు వాళ్లకి సుపరిచితమైన రామ్కీ(Ramkee) కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలిపే పోస్టర్‌నీ ఇటీవల రిలీజ్ చేసింది. తాజాగా కృతి శెట్టి కస్టడీలో ఉన్నట్లు పోస్టర్‌లో చూపించారు.

అక్కినేని నాగచైతన్య పోలీస్ ఆఫీసర్‌(Police Officer)గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అతని క్యారెక్టర్ పేరు శివ అని ఇప్పటికే చిత్ర యూనిట్(Movie Unit) పోస్టర్‌ ద్వారా ప్రేక్షకుల(Audience)కు తెలియజేసింది. నాగచైతన్య నటిస్తున్న 22వ సినిమా(22nd Movie) ఇది. అలానే బంగార్రాజు తర్వాత కృతి శెట్టితో కలిసి వరుసగా రెండోసారి నాగచైతన్య నటిస్తున్నాడు.

ఈ  సినిమాకి ఇళయరాజా(Ilayaraja), యువ‌న్ శంక‌ర్ రాజా(Yuvan Shankar Raja) కలిసి సంగీతం(Music) అందిస్తుండగా, శ్రీనివాస చిట్టూరి(Srinivas Chitturi) ప్రొడ్యూసర్‌(Producer)గా వ్యవహరిస్తున్నారు.  కస్టడీ మూవీ ఫుల్ లెంగ్త్(Full Length) యాక్షన్ ఎంటర్‌టైనర్‌(Action Entertainer)గా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అరవింద్ స్వామి(Arvind Swamy) నెగటివ్ పాత్ర(Negative Role)లో కనిపిస్తుండగా, కమెడియన్(Comedian) వెన్నెల కిషోర్(Vennela Kishore), సంపత్ రాజ్(Sampath Raj) తదితరులు నటిస్తున్నారు.

అలానే సీనియర్ హీరోయిన్(Senior Heroine) ప్రియమణి(Piyamani) కూడా ఓ పవర్ ఫుల్ రోల్(Powerful Role) చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీని తెలుగు(Telugu), తమిళ్‌(Tamil)లో విడుదల చేయబోతున్నారు.