రిలయన్స్ జియో(Reliance jio) అతి తక్కువ ధరకే ఎక్కువ లాభాలను తీసుకొచ్చే జియోఫోన్ 2021 ఆఫర్ ను ప్రకటించింది.

ఈ ఆఫర్ 2021 సంవత్సరపు బెస్ట్ అఫర్(Best Offer) గా చెప్పుకోవచ్చు . ఈ ఆఫర్ తో రెండు సంవత్సరాల టోటల్ అన్లిమిటెడ్ సర్వీస్(Unlimited Services)  మరియు ఉచిత జియోఫోన్(Jio Phone) ను పొందవచ్చు.

ఒక కొత్త 4G ఫీచర్ ఫోన్ ను కొనడానికి చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్. ఇప్పటికీ 2G ఉపయోగిస్తున్న కస్టమర్స్(Customers) కి 4G సర్వీస్ ను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ అఫర్ రిలీజ్ చేసింది. ఇది ఇప్పటికే జియోఫోన్ ను వాడుతున్న కస్టమర్ల కోసం మంచి ప్లాన్ ని అందించింది.

అతిపెద్ద  టెలికాం(Telecom) ఆపరేటర్ జియో తన జియోఫోన్(Jio Phone) ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్(Unlimited) సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది.

ఈ ఆఫర్ లో భాగంగా, ఈ ఆఫర్ ఎంచుకునే కొత్త సబ్స్క్రైబర్లకు(Subscribers) రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్(Voice Calls) మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్(High Speed) డేటాతో సహా అనేక ఉపయోగాలు పొందచ్చు.

అంతే కాకుండా ఈ ఆఫర్ తో పాటు అధనంగా, జియోఫోన్ ఉచితం(Free)గా లభిస్తుంది.

పైన తెలిపిన ఈ ప్రయోజనాలలతో  కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ఆఫర్ బెనిఫిట్స్(Benefits) ని కోరుకుంటే, రిలయన్స్ జియో(Reliance Jio) యొక్క జియో ఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది.

దీని కోసం,కస్టమర్లు సింగిల్ పేమెంట్ గా రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, ఉచిత జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు.

ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్(High Speed) డేటా(Data) ఉంటాయి. ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారు(Customers)ల కోసం కూడా అదనంగా ఒక ప్లాన్ ప్రకటించింది.

దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు నెలకు 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్(Offer) ధరకే పొందవచ్చు.

అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న జియోఫోన్ నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ పొందుపరిచారు.