ప్రస్తుత బిజీ లైఫ్ లో కంప్యూటర్(Computer), లాప్ టాప్(Laptop)  వాడని వారు ఎవరున్నారు?  అయితే మీరు పని తొందరగా చేయాలనుకున్నప్పుడు షార్ట్ కట్ కీస్(Short Cut Keys) కోసం వెతుకుంటారు కదా!

ప్రతీసారి మౌస్(Mouse) దగ్గరకు చేయి తీసుకెళ్లడం వల్ల చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది. దీని వల్ల పని పూర్తి కావడానికి టైం పడుతుంది. అలాంటపుడు  కొన్ని షార్ట్ కట్ కీస్ నేర్చుకుంటే పనిని చాలా తొందరగా చేసేయవచ్చు. ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి. అయితే తెలియని వారు కూడా చాలామంది ఉంటారు.

అలాంటి వారికోసం ఓ 10 కీబోర్డ్(Ten Key board) షార్ట్ కట్ కీస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. మీరు ఓ సారి  లుక్ వేయండి.

Ctrl+V or Shift+Insert

మీరు కాపీ చేసుకున్న దాన్ని ఎక్కడైనా పేస్ట్ చేయాలనుకుంటే Ctrl+V or Shift+Insert ఈ రెండు ఉపయోగించి చేసుకోవచ్చు. అదే ఆపిల్ యూజర్లయితే Cmd+V ప్రెస్ చేయడం ద్వారా ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు.

Ctrl+C or Ctrl+Insert and Ctrl+X

మీరు ఏదయితే సెలక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని Ctrl+C or Ctrl+Insert ద్వారా కాపీ చేసుకోవచ్చు. అలాగే దాన్ని అక్కడ నుంచి కట్ చేసుకోవాలనుకుంటే Ctrl+X ఉపయోగించి కట్ చేసుకోవచ్చు.

Ctrl+Z and Ctrl+Y

మీరు ఏదైనా మిస్టేక్ చేసిన యెడల దానికి మీరు సరిదిద్దుకోవాలనుకుంటే Ctrl+Z ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీరు కట్ చేసిన పదాన్ని కూడా ఈ కీ ప్రెస్ చేయడం ద్వారా పొందవచ్చు. Ctrl+Y  నొక్కడం ద్వారా మళ్లీ యథాస్థానానికి రావచ్చు.

Ctrl+F

ఈ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు ఇంటర్నెట్ బ్రౌజర్లో ఏమి కావాలో వెతుక్కోవచ్చు. అలాగే మీరు వర్డ్ లో ఉన్నప్పుడు ఏదైనా ప్రత్యేక పదాన్ని కనుగొనాలంటే Ctrl+F ప్రెస్ చేసి ఆ పదాన్ని అక్కడ టైప్ చేస్తే సరిపోతుంది.

Alt+Tab or Ctrl+Tab

వీటిని ఒకేసారి ప్రెస్ చేయడం ద్వారా మీరు మీ బ్రౌజర్లో ఓపెన్ చేసిన మరో పోగ్రాంకి వెళ్లొచ్చు.

Ctrl+Backspace and Ctrl+Left or Right arrow

వీటిని ప్రెస్ చేయడం ద్వారా మీరు వెనక్కి ముందుకి వెళ్లవచ్చు. మీరు మౌస్ ఉపయోగించకుండా వీటితో కావలసిన చోటుకి వెళ్లవచ్చు.

Ctrl+S

మీరు మీ పైల్ సేవ్ చేయాలనుకుంటే Ctrl+S ప్రెస్ చేస్తే సరిపోతుంది.

Ctrl+P

మీరు ఏదైనా ప్రింట్ తీసుకోవాలనుకుంటే Ctrl+P ప్రెస్ చేస్తే నేరుగా అక్కడికి వెళ్లవచ్చు.

Page Up, Spacebar, and Page Down Page Up

టైప్ చేయడం ద్వారా మీరు మీ బ్రౌజర్లో పైనున్న స్టోరీ దగ్గరికి వెళ్లవచ్చు. అలాగే Spacebar, and Page Down ప్రెస్ చేయడం ద్వారా కింద ఉన్న స్టోరీలోకి వెళ్లవచ్చు.