శ్రీ రామ నవమి(Sri Rama Navami), భారతదేశంలోని  అత్యంత పవిత్రమైన హిందూ పండుగలలో ఒకటి, ఈ పండుగని చైత్ర నవరాత్రి(Chaitra Navaratri) చివరి రోజున జరుపుకుంటారు.

ఈ సంవత్సరం రామ నవమి ఏప్రిల్ 10, 2022 న జరుపుకుంటాము. రామ నవమి శ్రీరాముని జన్మని సూచిస్తుంది.

హిందూ గ్రంధాల ప్రకారం, త్రేతా యుగం(Treta Yuga)లో శ్రీరాముడు దశరథ మహారాజుకి, రాణి కౌసల్యకు అయోధ్య(Ayodya)లో నవమి రోజున జన్మించాడు. శ్రీరాముడు విష్ణువు అవతారమని భక్తుల నమ్మకం. దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారని పురాణాలూ(Puranas) చెబుతున్నాయి.

రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడని నమ్ముతారు, అందుకే రామ నవమి పూజ(Rama Navami Pooja) చేయడానికి ఇది అత్యంత పవిత్రమైన సమయం. మధ్యాహ్న క్షణం శ్రీరాముడు జన్మించిన ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తుంది. అలాగే దేవాలయాలలో ప్రత్యేక పూజలు మరియు యాగాలు నిర్వహిస్తారు.

ఈ సమయంలో శ్రీరాముని నామ జపం(Japa), మంత్రాలు(Mantra), భజనలు(Bajanas) చేస్తారు. రాముని ప్రస్తావన ప్రాచీన హిందూ గ్రంథాలలో మాత్రమే కాకుండా జైన(Jain) మరియు బౌద్ధ(Budha) గ్రంధాలలో కూడా కనిపిస్తుంది.

హిందూ ఇతిహాసం(Ithihasyam) – (Ramayanam) – భారతదేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా అంతటా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న గ్రంథంలో రాముడు ప్రధాన వ్యక్తి.

అలాగే 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ(Ravana) సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము.  ఆ తర్వాత శ్రీరామ చంద్రుడు తన రాజ్యాన్ని 11 ఏండ్ల పాటు పాలించాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీ సీతారాముల కళ్యాణం(Seeta Rama Kalyanam) కూడా ఈరోజునే జరిగింది. అందుకే ఈ చైత్ర శుద్ధ నవమి అయిన ఈ రోజుకి ఇంతటి విశిష్టత.

శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి సంవత్సరం భద్రాద్రిలో శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. అయితే కరోనా దృష్ట్యా గతేడాదిలాగే ఈ ఏడాది కూడా శ్రీ సీతారామ కళ్యాణోత్సవ వేడుకలను భక్తులు లేకుండానే నిరాడంబరంగా నిర్వహించనున్నారు.

శ్రీరామనవమి(Sri Rama Navami వేసవి కాలం(Summer season) మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు.

సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశాని(Surya Vamsam)కి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు.

శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైక(kaika)కు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్లు వనవాసం(14 Years Vanavasam) చేశాడు. దీనివల్లనే రాముడిని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

శ్రీ రామనవమి(Sri Rama Navami) రోజున ఉదయానే నిద్రలేచి, తలంటు స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ తో పాటు తోరణాలు పూలు మాలల(Garlands)తో ఇంటి ముందు రంగవల్లికల(Rangolis)తో అలంకరించుకోవాలి(Decorate).

పూజకు అన్ని సిద్ధం చేసి నైవేద్యానికి(Prasadam) పానకం, వడపప్పు, చలిమిడి సమర్పించి, స్తోత్రాలు, పారాయణాలు చేయడం ద్వారా శుభఫలితాలు(Good Results) చేకూరుతాయి. కాబట్టి శ్రీరామ నవమి రోజున, ఆ రామ  దేవుడి కళ్యాణాన్ని తిలకించి భక్తిగా పూజిస్తే సుఖ: సంతోషాలతో వర్ధిల్లుతారని పండితులు చెబుతున్నారు.

మీ అందరికి శ్రీ రామ నవమి శుభకాంక్షలు….