బిగ్ బాస్ సీజన్ 5(Big boss season5) విజయవంతంగా దూసుకుపోతోంది. గత రెండు రోజులు గా  హౌస్ మేట్స్ మధ్య గొడవలు, కొట్లాటలతో పాటు రొమాన్స్ కూడా నడుస్తోంది. హౌస్ మేట్స్ మధ్యలో వున్నా రొమాంటిక్ కోణాలను కూడా చూపెడుతున్నారు. ఇంతకీ ఎవరి మధ్య రొమాన్స్ నడుస్తుందో, ఇంకా బిగ్ బాస్(Big boss) కంటెస్టెంట్స్ కి ఎలాంటి టాస్క్ లు ఇచ్చాడో చూసేద్దాం.  ఇక శుక్రవారం 12వ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఉదయం ఆర్ఆర్ఆర్ దోస్తీ పాటతో హౌస్ మేట్స్ ని నిద్రలేపాడు. ఆ తరువాత విశ్వ కొత్త కెప్టెన్‌(captain)గా హౌస్ మేట్స్ కు పాటించవలసిన  కొన్ని రూల్స్ గురించి మాట్లాడాడు. ఆ తరువాత బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు అనే టాస్క్ (Task)గురించి ప్రియ బిగ్ బాస్ పంపిన లెటర్‌ను చదివింది.

ఇక విశ్వ శ్రీరామ్ తో మానస్‌లో చాలా మార్పొచ్చిందని, తాను చాలా  మ్యాచురెడ్ అని అనుకున్నాను, మంచి ఫ్రెండ్ అని అనుకున్న అని  ముచ్చటపెడతాడు విశ్వ  . మరోవైపు హౌస్ మేట్స్(House mates) ని ఇమిటేట్‌ చేస్తూ శ్వేతను తెగ నవ్వించాడు జెస్సీ, దాంతో శ్వేతా నీలో కనిపించని శాడిస్ట్ వున్నాడని, చాల షేడ్స్ ఉన్నాయిరా అని అంటుంది. తరువాత  రెండోవారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ మొదలైంది.

ఇందులో భాగంగా స్క్రీన్‌పై చూపించిన కంటెస్టెంట్లు(Contestants) బజర్‌ మోగగానే బంతిని పట్టుకోవాలి. పట్టుకున్న బంతిపై ఏ ఫుడ్‌ రాసి ఉంటుందో దాన్ని మాత్రమే పంపిస్తాడు బిగ్‌బాస్‌. టాస్క్‌ మొదలవగానే విశ్వ, లహరి, లోబో, సిరి.. ఎవరూ బాల్‌ పట్టుకోలేకపోయారు. కానీ నటరాజ్‌ మాస్టర్‌, ప్రియాంక మాత్రం బాల్‌ క్యాచ్‌ చేసి హౌస్ లో  వాళ్లకు ఫుడ్‌ దొరికేలా చేశారు.

ఇక మరో వైపు శ్రీరామచంద్ర నీమీద ఇంటరెస్ట్ చూపిస్తున్నాడంటూ హమీదాతో కాజల్‌ చెప్పింది. సన్నీ కూడా నిన్ను తెగ ఇష్టపడతాడని యానీ మాస్టర్‌ నొక్కి చెప్పింది. అయితే  ఇదే విషయం సన్నీ ని అడగగా హమీద  తనకు బెస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రమేనని సన్నీ చెప్పాడు  మొత్తానికి ఈ డిస్కషన్స్ చూస్తుంటే హౌస్ లో  లవ్ స్టోరీ మొదలైనట్లే అనిపిస్తోంది..  ర్వాత బిగ్‌బాస్‌ హౌస్ మేట్స్(Housemates) ఏకాభిప్రాయంతో బెస్ట్‌, వరస్ట్‌ పర్ఫామర్‌ పేర్లను ఎంచుకోమన్నాడు.

విశ్వ, హమీదా.. షణ్ముఖ్‌ను; శ్రీరామచంద్ర, మానస్‌, సన్నీ, యాంకర్‌ రవి, లోబో.. నటరాజ్‌ మాస్టర్‌ను; లహరి, షణ్ముఖ్‌.. మానస్‌ను; ప్రియ, సిరి, నటరాజ్‌ మాస్టర్‌, ప్రియాంక సింగ్‌.. శ్రీరామచంద్రను; ఉమాదేవి, శ్వేత వర్మ.. జెస్సీని బెస్ట్‌ పర్ఫామర్లు (Best performer)గా పేర్కొన్నారు. ఎక్కువ ఓట్లు సాధించిన నటరాజ్‌ మాస్టర్‌ ఈ వారం బెస్ట్‌ పర్ఫామర్‌గా సెలక్టయ్యాడు.

తరువాత  వరెస్ట్ పెరఫార్మెర్ (Worst performer) ని ఎంపిక చేసుకోమని బిగ్ బాస్(big boss) చెప్పగా,  మొదటగా కెప్టెన్‌ విశ్వ తన అభిప్రాయాన్ని చెప్తూ .. పింకీ త్వరగా రెడీ అయితే బాగుంటుందని ,ఆమెను వరస్ట్‌ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు.

ఇది మింగుడుపడని పింకీ.. తాను చాలా తక్కువగా రెడీ అవుతానని, ఎంత రెడీ అయినా తనెప్పుడూ అందరికీ సమయానికి వంట సిద్ధం చేశానని స్పష్టం చేసింది.

తర్వాత యాంకర్‌ రవి.. యాటిట్యూడ్‌ చూపించాడంటూ సన్నీని ఎంచుకున్నాడు. శ్వేత.. సిరిని; మానస్‌.. టాస్క్‌లో సహనాన్ని కోల్పోయిన శ్రీరామ్‌ను; ఉమాదేవి, కాజల్‌, షణ్ముఖ్‌, ప్రియ, సిరి.. సన్నీని; యానీ మాస్టర్‌.. ఉమాదేవిని; శ్రీరామచంద్ర.. యాంకర్‌ రవిని వరస్ట్‌ పర్ఫామర్లుగా అభిప్రాయపడ్డారు.

అయితే ఎక్కువ ఓట్లు వచ్చిన సన్నీని ఈవారం వరస్ట్‌ పర్ఫామర్‌గా ప్రకటించడంతో  బిగ్అ బాస్ ఆదేశం ప్రకారం సన్నీ ని  జైల్ కి పంపించారు.

మరో వైపు కిచెన్‌లో జరిగిన విషయాల గురించి కాజల్‌, ప్రియ డిస్కషన్‌ పెడతారు.

bigboss priya

ఈ వాదన కాస్త  గొడవగా మారి సంస్కారం అంటూ పెద్దపెద్ద మాటలు అనుకునేదాకా వెళ్లింది. ముందు ఒకలా, వెనుక ఒకలా మాట్లాడుతూ సింపతీ గేమ్‌ ఆడాలని చూడకు అంటూ కాజల్‌పై బాగానే కోపం తో ఊగిపోతోంది  ప్రియ.

వామ్మో, ఈమె సెకనుకో అబ​ద్ధం ఆడుతుందని కామెంట్‌ చేసింది. దీంతో ఏడుపు ఆపుకోలేకపోయిన కాజల్ ను రవి వచ్చి  కాస్త ఓదారుస్తాడు. కానీ అంతలోనే ప్రియ వచ్చి సారీ చెప్పి ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెడుతుంది.

తర్వాత బిగ్‌బాస్‌(Bigboss)… హౌస్ మేట్స్ మనసు విప్పి మాట్లాడండంటూ బీబీ న్యూస్‌(BB News) టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో రవి, కాజల్‌ రిపోర్టర్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. టాస్క్‌ మొదలవగానే.. కాజల్‌, రవి.. తమ పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయారు.

bigboss house discussions

పెళ్లి కాకపోయుంటే ఇంట్లో ఎవరికి సైట్‌ కొట్టేవాళ్లు అని కాజల్‌ రవిని ప్రశ్నించగా అతడు కాజల్ పేరే చెప్పాడు. దీంతో అవాక్కైన కాజల్‌ అంత సీన్‌ లేదులే అని నవ్వేసింది. తర్వాత యానీ మాస్టర్‌.. తనకు హౌస్‌లో పెద్ద కూతురు దొరికిందంటూ శ్వేత గురించి చెప్పింది.

పనిలో పనిగా శ్రీరామ్‌, హమీదా, సన్నీ మధ్యలో ట్రయాంగిల్‌ స్టోరీ నడుస్తుందని చెప్పేస్తుంది.

లోబో ని రవి అంటే ఎందుకు అంత ఇష్టం అని అడగగా తన  దోస్త్ అని అంటాడు లోబో, అలాగే  ఉమాదేవి తనపొట్టి అని అంటాడు. ఇక నటరాజాను ఇంట్లో గుంటనక్క ఎవరు అని అడగగా సమయం వచ్చినప్పుడు చెప్తానంటాడు, అయితే వెంటనే  సమయం లేదు మిత్రమా అంటూ ఫన్ చేస్తుంది కాజల్.

తర్వాత శ్రీరామచంద్ర ప్రేమ గురించి మాట్లాడుతూ.. ఫస్ట్‌ వీక్‌లో సిరి, హమీదా మీద, తర్వాత లహరి మీద, ఇప్పుడు ప్రియ మీద లవ్‌ స్టార్ట్‌ అయిందని చెప్పుకొచ్చాడు.

ఇంట్లో ఉన్నవాళ్లలో భార్య, గర్ల్‌ ఫ్రెండ్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌, పని మనిషిగా ఎవరు సెట్ అనుకుంటున్నారో చెప్పమని రవి ప్రశ్నించాడు. దీనికి శ్రీరామ్‌ ఏమాత్రం తడుముకోకుండా లహరి, ప్రియ భార్యగా, సిరి, హమీదా గర్ల్‌ఫ్రెండ్స్‌గా, శ్వేత బెస్ట్‌ ఫ్రెండ్‌గా, కాజల్‌ పని మనిషిగా ఉంటే బాగుంటుందని టపీమని చెప్పాడు. దీంతో యాంకర్‌ రవి.. శ్రీరామచంద్ర ఇంటి పనిమనిషిగా కాజల్‌ అని చెపుకొస్తాడు శ్రీ రాంచంద్ర అంటాడు, దీంతో కాజల్ అవాక్కవుతుంది.

మానస్‌ ని హౌస్ లో ఎవరు వైఫ్ గ, గర్ల్  ఫ్రెండ్, పనిమనిషి గా ఎవరిని  సెలెక్ట్ చేసుకుంటావ్ అని అడుగుగా, సిరి బెస్ట్‌ఫ్రెండ్‌, ప్రియాంక మరదలు, హమీదా ప్రేయసి, లహరి భార్య అయితే బాగుంటుందన్నాడు.

mans

సన్నీ.. శ్వేతను భార్యగా, హమీదాను గర్ల్‌ఫ్రెండ్‌గా, సిరిని పనిమనిషిగా సెలక్ట్‌ చేసుకుంటాడు. ఆ తర్వాత జెస్సీ.. సిరిని గర్ల్‌ఫ్రెండ్‌గా, కాజల్‌ను పని మనిషిగా ఎంచుకున్నాడు. మొత్తానికి అందరూ కలిసి కాజల్‌ను పనిమనిషిని చేశారు.

ఇక శ్రీరామచంద్ర, షణ్ముఖ్‌లలో ఎవరిని సెలక్ట్‌ చేసుకుంటావన్న ప్రశ్నకు హమీదా వెంటనే శ్రీరామ్‌ అని తడుముకోకుండా  చెప్పేసింది. అంతే కాదు.. శ్రీరామచంద్ర, హమీదా ఇద్దరూ కలసి మనోహర అనే రొమాంటిక్‌ సాం(Romantic song)గ్ కు డ్యాన్స్‌ చేశారు.

తరువాత శ్రీరామ్ చంద్ర ని హాగ్ ఇవ్వాల్సి వస్తే ఎవరికీ ఇస్తావ్ అనే ప్రశ్నకి  అమ్ముకి(lahari) ఇస్తా అని లహరి వెంటనే హాగ్ ఇస్తాడు. ఇక కాజల్,హమీద, జెస్సి సన్నీ దగ్గర కూర్చుని డిస్కషన్ పెడతారు. మొత్తానికి హౌస్ మేట్స్ లో అని కోణాలను చూపించిన బిగ్ బాస్(Big boss).

ఇక రేపు వీకెండ్ హంగామా(weekend hungama) లో ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారో తెలిసిపోతుంది.

ఈ వారంలో హౌస్ మేట్స్ మధ్య జరిగిన గొడవల పై హోస్ట్ నాగార్జున ఎలా స్పందించనున్నారో మరి.