ఊబకాయం లేదా ఒబేసిటీ(Obestiy) అనేది ఇప్పుడు చాలా మంది ఎదురుకుంటున్న సమస్య, ముఖ్యంగా బరువు ఎక్కువ గా వున్నవారు ఎంత ప్రయత్నించినా పొట్ట తగ్గడం లేదని బాధపడుతుంటారు. అవును ఒకసారి పొట్ట వచేసాక దాన్ని తిరిగి సాధారణ స్థాయికి చేరడం అంత సులువు కాదు అయితే, అది అంత అసాధ్యం కాదు. కొన్ని రకాల జాగ్రత్తలు, జీవన శైలి(life style) మార్పులతో పొట్టలోని కొవ్వును  కరిగించుకోవచ్చను.

ఆ మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. కొంతమందికి శరీరం కాస్త సన్నం గానే వున్న, పొట్ట చుట్టూ మాత్రం కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీనినే విసెరల్ ఫ్యాట్ అంటారు. పొట్ట భాగం లో వున్న లివర్, కిడ్నీలు, పాంక్రియాస్ వంటి అవయవాల చుట్టూ కొవ్వు(fat) చేరడం వల్ల ఇది మరింత ప్రమాదకరం గా మారుతుంది.

ఈ భాగం లో కొవ్వు చేరకుండా చేసుకోవాలంటే దాన్ని తగ్గించుకోవాలన్న  ఆకుకూరలు, తృణధాన్యాలు,గింజలు, చిక్కుడులు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

ఒకసారి గా కొవ్వును కరిగించే  అవకాశం లేదు కాబట్టి  కొన్ని ఆహార మార్పులతో అది సాధ్యమవుతుంది. అయితే పొట్టలో కొవ్వు ఎక్కువగా ఉంటే మీరు వదిలించుకోవలసిన బరువు ఎక్కువగా వున్నదని అర్థంచేసుకోవాలి. ఆహారాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. జంతువుల ద్వారా లభించే మాంసాలు, కొవ్వు హెచ్చగా వుండే పాలు, పాలఉత్పత్తులను తగ్గించుకోవాలి.

ప్యాకెట్లలో లభించే  ఆహారాలలో కెలోరీలు , కొవ్వు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. వ్యాయామాల( exercise)తో బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తుంటారు చాల మంది. అయితే గంటల కొద్దీ నడవడం, జాగ్గింగ్ లాంటివి కాకుండా కొద్దీ సమయం పాటు శరీరానికి అత్యంత శ్రమనిచే  వ్యాయామాల ద్వారా పొట్టలోని కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చునని పరిశోధనలు చెబుతున్నాయి.

నిద్రకు మన శరీర బరువుకు సంబంధం ఉంటుంది. ఐదు గంటలకంటే తక్కువగా లేదంటే ఎనిమిది గంటలకంటే ఎక్కువగా నిద్రపోయే వారిలో పొట్ట పెరుగుతుందని తెలుస్తోంది. కనుక తప్పకుండ ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే అప్పటికప్పుడు త్వరగా బరువు తగ్గాలని చేసే క్రాష్ డైట్ ను చేయడం కూడా మంచిది కాదు.

స్థిరంగా, నెమ్మదిగా బరువు(Weight) తగ్గేలా, జీవం శైలిలో మార్పులు చేసుకోవటం మంచిది. బరువు తగ్గాలంటే ఆల్కహాల్ తో కూడిన పానీయాలు మానేయాలి. వాటి పైన నియంత్రణ లేకపోయినా బరువు పెరుగుతారు. సిగరెట్టు  ఎక్కువగా  తాగే వారి లో కూడా పొట్ట పెరిగే అవకాశం వుంది.

ఆలా పొట్ట లో చేరే అధిక కొవ్వుతో మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాదులు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. కనుక పొగ తాగే అలవాటు వున్న వారు దానిని మానేయటం మంచిది. పొట్టలో కొవ్వు చేరకుండా ఉండాలంటే మనసులో వత్తిడి లేకుండా చూసుకోవాలి.

మనసులో వత్తిడి పెరిగిపోతే సరిగా నిద్ర పోలేరు వ్యాయామం చేయలేరు. ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే అవకాశం వుంది. ఇవ్వని పొట్టలో కొవ్వుని పెంచేవే. మానసిక వత్తిడి వున్న వారు సంగీతం వినటం, ధ్యానం(meditation), శ్వాస వ్యాయామలు వంటి ద్వారా ప్రశాంతతను పొందవచ్చు.

పొట్టను తగ్గించుకోవాలని లక్ష్యంతో ప్రయతించేవాళ్ళు మహిళలైతే తమ నడుము సైజు ముప్పైయైదు అంగుళాలు, మగవారైతే నలభై అంగుళల్లా వరకు తగ్గేలా కృషి చేయాలి. పొట్ట తగ్గాలంటే నడక, జాగ్గింగ్(Jagging), వ్యాయామాలు చేయడం మంచిది. పొట్ట తగ్గాలంటే వత్తిడి పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం.

వత్తిడికి గురవుతున్న వారు కొవ్వు, చక్కర పదార్ధాలు ఎక్కువ గా తీసుకునే అవకాశం వుంది. దాంతో వత్తిడి హార్మోన్(hormone) కార్టిసోల్ విడుదల ఏక్కువవుతుంది. ఇది పొట్ట చుట్టూ కొవ్వు (fat)ను పేరుకునేలా చేస్తుంది.

అసలు తమకు పొట్ట చుట్టూ కొవ్వు ఎందుకు పేరుకుంటుంది అనే విషయం లో అవగాహనే పెంచుకుంటే దాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది.