స్మార్ట్ ఫోన్లతో ఇప్పటికే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఎన్నో కొత్త కొత్త పరికరాల సాంకేతికత ఈ స్మార్ట్ ఫోన్ ఆధారంగా రూపొందించబడుతోంది. ఈ స్మార్ట్ ఫోనుతో ఇప్పటికే బ్యాంకింగ్, వైద్యం ఇంకా ఎన్నో రంగాల్లో ఎన్నో ఉపయొగాలున్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోనుతోనే వైద్య రంగంలో మరొక ప్రయోజనం కలగబోతోంది. అదే ఈ స్మార్ట్ ఫోన్ మైక్రో స్కోపీ. దీని ద్వారా ఇప్పుడు వైద్యులు స్కిన్ కాన్సర్ ను సంప్రదాయ మైక్రోస్కోప్ సహాయం లేకుండానే గుర్తించవచ్చని అంటున్నారు. అదెలాగో చూద్దాం.

హూస్టన్ లోని The University of Texas Health Science Centre కు చెందిన Richard Jahan-Tigh, డెర్మటాలజీ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈయన తన బృందంతో కలిసి McGovern Medical School మరియు Harvard Medical School లో ఈ స్మార్ట్ ఫోన్ మైక్రోస్కోపీ ని గూర్చి పరిశోధించారు. అంటే, స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ కు అదనంగా మరో మైక్రోస్కోప్ లెన్స్ ను అమర్చితే అదే స్మార్ట్ ఫోన్ మైక్రోస్కోప్ అవుతుంది. ఎవరైనా సరే వారి స్మార్ట్ ఫోన్ కెమెరా ను మైక్రో స్కోప్ గా మార్చవచ్చు. ఇందుకు కావలసింది 3 mm బాల్ లెన్స్, ఈ లెన్స్ ను అమర్చడానికి ఒక చిన్న ప్లాస్టిక్ మరియు టేప్. వీటి సహాయంతో స్మార్ట్ ఫొన్ కెమెరా ను మైక్రోస్కోప్ గా మార్చవచ్చు. ఈ బాల్ లెన్స్ కేవలం 14 డాలర్లు ఖరీదు చేయడంతో, చాలా తక్కువ ధరకే వైద్యులు తమ స్మార్ట్ ఫోనును మైక్రోస్కోప్ గా మార్చుకునే వీలుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని డాక్టర్లు వీరి ఆసుపత్రులలో ఇంతటి ఖరీదైన మైక్రోస్కోప్ లు లేనప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ మైక్రో స్కోపీ ద్వారా త్వరితంగా రోగ నిర్ధారణ చేయవచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది అంటే, రోగి చర్మ భాగాన్ని ఈ ఫోన్ మైక్రోస్కోప్ లెన్స్ తో ఫోటో తీయడమే. ఎవరైనా మైక్రోస్కోపి లో అనుభవం కలిగిన సిబ్బంది కేవలం ఈ photo ద్వారా తేలిగ్గా వ్యాధిని నిర్ధారణ చేయగలరు. Tigh, తన పరిశోధనలో భాగంగా ఈయన 1021 స్లైడ్లను (స్కిన్ శాంపిల్స్) ను సంప్రదాయ మైక్రోస్కోప్ మరియు స్మార్ట్ ఫోన్ మైక్రోస్కోప్ తో పోల్చి చూడగా, ఈ స్మార్ట్ ఫోన్ మైక్రోస్కోప్: non-melanoma స్కిన్ కాన్సర్లను 90 శాతం గుర్తించగలిగితే melanoma స్కిన్ కాన్సర్ల ను 60 శాతం గుర్తిoచగలిగింది.

ఈ పరిశోధన ద్వారా పరిశోధకులు స్మార్ట్ ఫోన్ మైక్రో స్కోపీ కి భవిష్యత్తులో ఎంతో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఈ పరిశోధనను ARCHIVES of Pathology and Laboratory Medicine లో ప్రచురించారు.

Courtesy