కంటి చూపు దేవుడు ఇచ్చిన వరం. అది లోపించడం ఎంతో బాధాకరం. పూర్తి గుడ్డివారు కాకపోయినా ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి కొన్ని ఆరోగ్య కారణాల వల్ల నడి వయసు నుంచీ చాలా మేర చూపు తగ్గిపోతుంది. దాంతో వారు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక మనం అను నిత్యం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ వంటివి ఉపయోగించడం వారికి ఎంతో కష్టం. ఎందుకంటే ఇంత చిన్న స్క్రీన్ మీద ఉండే అక్షరాలూ వారికి సరిగా కనపడవు. అందువల్ల మన పనులను ఎంతో సులభంగా చేసి పెట్టగల స్మార్ట్ ఫోన్ వారిని ఎంతో ఇబ్బంది పెడుతుంది.

స్మార్ట్ ఫోనులోని built-in zoom ఉంది కదా అంటే, అది వారికి ఏమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే, దాని వల్ల అసలే చూపు తగ్గిపోయిన వారు ఈ zoom ఫీచర్ వల్ల తమకు కావాల్సిన వాక్యాలు ఎక్కడున్నాయో తెలియని అయోమయం ఏర్పడుతుంది. ఈ ఇబ్బందిని గ్రహించే Massachusetts Eye మరియు Ear/Harvard Medical School కు సంబంధించిన Schepens Eye Research Institute కు చెందిన పరిశోధకులు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అప్లికేషను ను తయారు చేసారు. అదే ఈ head motion magnifying smart phone application. గూగుల్ గ్లాస్ ఆధారంగా పని చేసే ఈ స్మార్ట్ ఫోన్ అప్లికేషను ప్రత్యేకించి చూపు మందగించిన వారి కోసం తయారు చేయబడింది. ఇక ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం.

ఈ స్మార్ట్ ఫోన్ అప్లికేషను వ్యక్తి తల కదలికల ద్వారా పని చేస్తుంది. ఈ అప్లికేషను, ఫోను స్క్రీన్ ను గూగుల్ గ్లాస్ కు చేరవేస్తుంది. అంటే ఆ వ్యక్తి కళ్ళ ముందు స్క్రీన్ కనబడుతుంది అన్న మాట. అది కూడా magnify (ఒకటికి పదింతలు పెద్దది) చేయబడి కనిపిస్తుంది. అలా కనిపించిన తరువాత ఆ వ్యక్తి యొక్క తలను కదుపుతూ స్క్రీన్ ను నియంత్రిస్తూ, దాని మీద ఏముందో తరచి తరచి చూడచ్చు. అలా కావలసిన అప్లికేషను మీద క్లిక్ చేసి దాన్ని ఉపయోగించచ్చు. దానికి సంబంధించిన వీడియో ను ఇక్కడ చూడవచ్చు. చూపు మందగించిన వారికి magnification ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

అంతేనా, ఈ magnification ను ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ head-motion magnifying smart phone application ను మరియు ఫోనులోనే ఉండే zoom ఫీచర్, ఈ రెండిటిలో ఏది ఉపయోగకరమో తెలుసుకోవడానికి ఈ పరిశోధకులు ఒక పరీక్ష చేసారు. ఈ ప్రత్యేకమైన లోపం ఉన్న వారిలో కొంత మందిని సాధారణ స్మార్ట్ ఫోన్ ఉపయోగించమనీ, అలాగే మరి కొంతమందిని ఈ ప్రత్యేకమైన అప్లికేషను ద్వారా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ కొన్ని పనులు చేయమని చెప్పారు. ఫలితంగా రెండవ బృందంలోని సభ్యులు 28 శాతం తక్కువ సమయంలో పనులను పూర్తి చేసారు అని ఈ పరిశోధక బృందంలో ఒకరైన Shrinivas Pundlik పేర్కొన్నారు.

ఈ బృందం ఈ గూగుల్ గ్లాస్ ఆధారిత head motion magnifying smart phone application ను మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నారు.

Courtesy