https://youtu.be/2zKC1GC4FJ4?t=6

పెరుగుతున్నసాంకేతికత మన ఇంటిని పూర్తిగా డిజిటల్ చేసేసింది. ఇంటర్నెట్ పుణ్యమా అని వై ఫై ఆధారంగా Amazon వారి Echo, microsoft వారి Siri వంటి స్మార్ట్ హోం అప్లికేషనులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవన్నీ మనం మన ఇంటిని, అందులోని అనేక వస్తువులను వీటికి అనుసంధానం చేసుకుని కేవలం voice control ద్వారా ఆపరేట్ చేయవచ్చు. అయితే ఇవన్నీ కొద్దిగా సాంకేతికత అనుభవం ఉన్నవారికి అనుకుని వీటిని కొనుగోలు చేయడానికి చాలా మంది వెనకాడుతుంటారు. అలాంటి వారి కోసమే వచ్చేసింది Knocki. దీనిని ఇంట్లో ఏ గోడకైనా అమర్చుకుని కేవలం ఎక్కడైనా తడితే చాలు పైన చెప్పిన స్మార్ట్ హోం అప్లికేషన్స్ మాదిరిగానే ఇదీ పని చేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే దీనిని వాడటానికి మనం అస్తమాను ఫోన్ బయటకు తీయనక్కర్లేదు. ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి దీని ప్రత్యేకతలేంటో చూద్దాం.

దీనిని Jake Boshernitzan మరియు Ohad Nezer రూపొందించారు. ఇది చూడడానికి గుండ్రంగా ఉండే పరికరం. దీనిని మన ఇంట్లో ఏదైనా గోడ మీద ఒక ప్రత్యేకమైన జిగురుతో అంటించుకోవచ్చు లేదా స్క్రూ తో అమర్చుకోవచ్చు. అమర్చుకుని మన ఇంట్లో అన్ని తలుపులను, లైట్లను, వేరే అన్ని పరికరాలకు వై ఫై తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇది accelerometer మరియు algorithm ఆధారంగా రూపొందడం వల్ల ఇది వివిధ రకాల tap లను గుర్తించగలదు.

ఒక్కో తలుపుకు ఒక్కో నిర్దిష్టమైన “tap” ను మనం ఈ యాప్ లో ఫీడ్ చేస్తే చాలు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ నిర్దిష్టమైన “tap” ను గోడ మీద కావచ్చు, వేరే టేబుల్ మీద కానీ తడితే చాలు ఆ తలుపు లేదా లైటు తెరచుకుంటుంది. ఇందులో సుమారుగా 10 “taps” వరకు ఫీడ్ చేసుకునే వీలుంది. ఆఖరికి మీ ఫోన్ మర్చిపోయినా సరే దానికి కూడా ఈ ప్రమాదాన్ని ఊహించి మీరు tap ఫీడ్ చేసి తర్వాత ఒక్క సారి ఏ ప్రదేశం మీదైనా తడితే చాలు మీ ఫోన్ ను రింగ్ చేస్తుంది. అంతే కాదు ఇది మీ tap ను గ్రహించింది అనడానికి గుర్తుగా ఒక చిన్న LED లైట్ కూడా వెలుగుతుంది. ఇక ఇది Google Nest, Spotify, IFTTT, WeMo కాఫీ మెషిన్ వంటి పరికరాలకు అనుసంధానం చేయబడి పని చేయడం విశేషం.

అయితే దీనికి రెండు పరిమితులు ఉన్నాయి. మన ఇంట్లోని వస్తువులను దీనికి అనుసంధానం చేసే సంఖ్యను బట్టి దీనిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే, ఒకటా రెండా అన్నది మనం ఉపయోగించే వస్తువులను బట్టి ఉంటుంది. అలాగే ఒక్కో తలుపు లేదా వస్తువుకు మనం పెట్టిన నిర్దిష్టమైన tap ను గుర్తుంచుకోవడం తప్పనిసరి. అయితే ఇది పిల్లలకు, అవయవ లోపం ఉన్న వారికి, చాలా ఉపయోగపడుతుంది.

ఇది కేవలం 3 AAA బాటరీలతో పని చేస్తుంది. ఇక దీనిని ప్రీ ఆర్డర్ చేస్తే $69 లకు విడుదల తర్వాత అంటే ఈ ఏడాది డిసెంబర్ తర్వాత $129 కు ఇది లభ్యం అవుతుంది.

Courtesy