సాంకేతికత పెరిగే కొద్దీ దాని వల్ల మనం కొత్త కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నాం. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సెల్ ఫోన్ signals వల్ల పిచుకలు వంటివి అంతరించడం, సెల్ ఫోన్లు, వీడియో గేములు వంటివి ఆడటం వల్ల పిల్లలు ఆరు బయట ఆడుకొనే సమయం తగ్గిపోవడం వంటివి కొన్ని ఉదాహరణలు. సరే, మరి ఈ “Tech Neck” అంటే ఏంటి అనుకుంటున్నారా. ప్రపంచీకరణ, సాంకేతిక అభివృద్ధి తదనుగుణమైన జీవన విధానంలో మార్పుల వల్ల మనం ఎక్కువ సమయం లాప్టాప్/tablet/సెల్ ఫోన్ పట్టుకునే కూర్చుoటున్నాం. అలా కూర్చోవడంలో వంగి కూర్చోవడం వల్ల మన తల బరువు వెన్నెముక మీద పడుతుంది. ఫలితంగా మెడ కింద భుజములు వద్ద నొప్పి మొదలవుతుంది. దీనినే “Tech Neck” అంటారు. గతంలో లేని ఈ సమస్య కేవలం ఈ ఎలక్ట్రానిక్స్ వల్ల ఉత్పన్నమవడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.

అసలు చాలా మందికి నిటారుగా కూర్చోవడం, right posture యొక్క ప్రాముఖ్యత తెలియక ఎలా పడితే అలా కూర్చుని ఆనక మెడ నొప్పి, నడుము నొప్పి వచ్చిందని బాధ పడుతుంటారు. అసలు వ్యక్తిత్వ వికాసంలో right posture పెద్ద పాత్రనే పోషిస్తుంది. అలాగే ఇంటర్వ్యూ లలో కూడా దీనిని గమనిస్తూనే ఉంటారు. మన ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని తెలిపే ఈ right posture లో కూర్చోవడం చాలా ముఖ్యం. కానీ మనం మనకు తెలియకుండానే కూర్చోకూడని భoగిమలో కూర్చుంటాం. ఈ విషయంలో మన లోపాన్ని సరిదిద్ది మనం సరైన భంగిమలో కూర్చునేలా చేయగలదు “Alex”.

ఇది ప్రపంచపు మొట్ట మొదటి personal posture coach. ఇది మన మెడ వెనుక ధరించాల్సిన చిన్న పరికరం. కళ్ళ జోడు లాగ దీనిని మన మెడ వెనుక నుంచి ధరించాలి. దీనిలోని సెన్సార్ మన మెడ వెనుక భాగంలో ఉండి, మనం కొద్ది నిముషాల కంటే ఎక్కువ వంగి కూర్చునప్పుడు, vibrate అవడం ద్వారా మనల్ని నిటారుగా కూర్చోమని గుర్తు చేస్తుంది. ఈ సెన్సర్ మన మెడ వెనుక ఉండడం వల్ల ఇది మెడ వంగిన కోణం, తల మన శరీరానికి తగ్గట్టు వంచిన విధానాన్ని బట్టి మన భంగిమను అంచనా వేస్తుంది. ఇదే ఈ “Alex” కు ఇలాంటి మార్కెట్లో ఉన్న మరి కొన్ని పరికరాలకు ప్రధాన తేడా అంటున్నారు దీని రూపకర్తలు. అంతే కాదు ఇది ఒక మొబైల్ యాప్ ద్వారా మొబైల్ కు అనుసంధానం చేయబడి పని చేస్తుంది. ఈ యాప్ iOS మరియు ఆండ్రాయిడ్ ఫోన్లకు పని చేస్తుంది. ఇది real time లో సేకరించిన data ఆధారంగా మీరు ఎంత సేపు, ఎన్ని గంటలు సరైన భంగిమలో కూర్చున్నారో చూపించేస్తుంది. అయితే ప్రస్తుతం ఇది kickstarter campaign లో నిధులు సేకరించే పనిలో ఉంది.

మరింకేం దీనిని సొంతం చేసుకుని సాంకేతికత వల్ల ఉత్పన్నమయ్యే సమస్యకు సాంకేతికత తోనే సమాధానం చెబుదాం.

Courtesy