తెలుగు వారి లోగిళ్ళలో పండుగలు(Festivals), పెళ్లిళ్లు(Marriages), పేరంటాలు(Auspicious day), నోములు(Puja),వ్రతాలు(Vratas) ఇలా శుభకార్యం ఏదైనా సరే తాంబూలం ఖచ్చితంగా వుండి తీరాల్సిందే.ఇప్పుడంటే తగ్గింది కానీ, ఒక్కప్పుడు మన పెద్దల కాలంలో అయితే భోజనం ముగిసేసరికల్లా  ఘుమఘుమలాడే కిళ్ళీ చేతిలో ఉండేది.

ఈ తాంబూల సేవనం  మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంది, ఆయుర్వేదం(Ayurvedam). ముఖ్యంగా తమలపాకు(Beetel Leaf)లో అనేక ఖనిజ, లవణాలు(Minerals, Salts), ఆరోగ్య పోషకాలు(Health Nutrients) ఇమిడి ఉన్నాయంటారు నిపుణులు(Experts). తమలపాకుతో వణుగూరు ఆరోగ్యప్రయోజనాల(Health Benefits) గురించి తెలుసుకుందాం!

తాంబూల సేవనం మన తెలుగు వారికీ అనాదిగా వస్తున్న ఆచారం(Culture) తాంబూలం లేనిదే మన తెలుగు లోగిళ్ళలో ఏ శుభకార్యం(Occassions) జరగదు. మంగళకార్యాలు, ఉత్సవాలు, దేవత పూజలు, వివాహాది శుభకార్యాలలో తాంబులానికే అగ్రపీఠం.

ఇక పెళ్లిలో మొదట కార్యక్రమంగా తాంబూలాలు పుచ్చుకుంటాం. ఇంటికి వచ్చిన అతిధుల(Guests)కు తాంబూలం ఇచ్చి సత్కరిస్తాం. ఇక భోజనం విషయానికి వస్తే ష్ట్రాసోపేతమైన రుచులు ఎన్ని ఉన్నపటికీ చివర్లో తాంబూల సేవనం చేయకపోతే, ఆ భోజనానికి పరిపూర్ణత రాదు.

లేలేత తమలపాకులు ఒకటి,రెండు పలుకుల వక్కలు(Beetels), కాస్తంత సున్నం, జాపత్రి(Mace), జాజికాయ(Nutmeg), యాలకులు(Cardamom), లవంగాలు(Cloves), పచ్చకర్పూరం(Green Camphor), కొబ్బరి తురుము(Coconut grater), సోంపు(Anise) ఇలా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు రకరకాల దినుసులను, సుగంధ(Aromatic) ద్రవ్యాలను కలుపుకుని తనివితీరా తాంబూల సేవనం చేస్తుంటారు.

అయితే తాంబూలంలో దినుసులు ఎన్ని కల్పిన మౌలికంగా ఉండేవి తమలపాకులు,వక్క,సున్నం మాత్రమే, తమలపాకులో కూడిన తాంబూల సేవనం ఆరోగ్యరీత్యా చాల మంచిదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

తమలపాకు మనకు రోగనిరోధక(Immunity) శక్తిని పెంచుతుంది. చిన్నపిల్లల(Children)కు జలుబు చేసినపుడు తమలపాకు రసం(Beetel Leaf juice) ఒకటి,రెండు చుక్కలు పాల(Milk)తో రంగరించి ఇస్తే జలుబు(Cold), దగ్గు(Cough) యిట్టె తగిపోతుంది. తమలపాకుతో సున్నం కలిపి వేసుకుంటే శరీరంలో కాల్షియమ్(Calcium) సమపాళ్లలో ఉండేలా చూస్తుంది. ప్రతిరోజు కొన్ని తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూ(Beetal leaf Paste)రి వేడినీలాలల్లో తీసుకుంటే బోదకాలు తగ్గుముఖం పడుతుంది.

తమలపాకును 100 గ్రాముల మిరియం గింజలు(Pepper) కలిపి నిత్యం తీసుకుంటుంటే బరువు(Weight loss) క్రమంగా అదుపులోకి వస్తుంది. తమలపాకును వేడి చేసి వాపు,నొప్పి కలిగిన కీళ్లు మీద కడితే నొప్పి తగ్గుతుంది. తమలపాకును భోజనం తరువాత తీసుకుంటే నూరు శుభ్రమౌతుంది.

ఇది జీర్ణ క్రియ(Digestive system)కు బాగా తోడ్పడుతుంది. తమలపాకు అంటి-యాక్సిడెంట్(Anti-Oxidanant) గా పనిచేస్తుంది, అంటే ముసలితనపు ముడతల(Wrinkles)ను కట్టడిచేస్తుంది. వేడిగా వుండే తమలపాకు రసాన్ని(Beetal juice), కొబ్బరి నూనె(Coconut oil) తో కలిపి వెన్ను(spinalcord)కు మర్దన చేయడం వల్ల నడుము నొప్పి(Hip Pain) నుంచి తక్షణం ఉపసనం(Relax) కలుగుతుంది. తమలపాకు తినే వారిలో మలబద్దకం(Constipation) అనే సమస్యే ఉండదు.

గుండె(Heart) అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నపుడు తమలపాకు రసాన్ని టీస్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది. తాంబూలం నమిలేటప్పుడు వచ్చే మొట్టమొదట రసం విషపూరితం(Toxin)గా ఉంటుందని చెబుతారు. రెండో సారి నమిలేటపుడు వచ్చే రసం అజీర్ణానికి(Indigestion) కారణం అవుతుందని చెబుతారు.

మూడవసారి జెనించే రసం అమృతం(good)తో సమానం అంటారు. కనుక తాంబూలం వేసుకునే సమయంలో ఈ విషయాన్నీ మనం గుర్తుంచుకోవాలి. తమలపాకు ఓ ఔషధం(Medicine)లాంటిది.కానీ దీన్ని ఎక్కువగా తీసుకోవడం ఏమంత మంచిది కాదని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా తమలపాకులో పొగాకుని చేర్చుకుని తీసుకోవడం ఇతరీతర కృత్రిమ పదార్దాల(Artficial ingredients)ను కలుపుకుని తీసుకోకూడదు.

ఇక అధికరక్తపోటు(High Blood Pressure) కలిగినవారు యధేచ్చగా వాడకూడదు. తాంబూలంను తయారు చేసేటప్పుడు సున్నాన్ని కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్త నాళ్ల(Blood Cells)లా మీద, రక్త సరఫరా(Blood Circulation) మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. తాంబూల సేవనంలో మనం ఈ విషయాన్ని తప్పని సరిగా  గుర్తుంచుకోవాలి.