పాన్ ఇండియా స్టార్(Pan India Star) ప్రభాస్(Prabhas) హీరోగా రాధా కృష్ణ కుమార్(Radha Krishna Kumar) దర్శక‌త్వం(Direction)లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’(Radhe Shyam). పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌(Heroine)గా న‌టించింది.

తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 11(March 11th )న వ‌ర‌ల్డ్ వైడ్‌(World Wide)గా రిలీజ్(Release) కానుంది. యూరప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరి(periodical Love Story).

డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. .ఎట్టకేలకు ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. ఈ మూవీ నుంచి ఓ ట్రైలర్(Trailer) ని విడుదల చేయాలని మేకర్స్(Makers) నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్ టైం(Time) అండ్ డేట్(Date) తో కూడిన పోస్టర్(Poster) విడుదల చేశారు.మొత్తానికి  మార్చి 11న రాధే శ్యామ్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఏది ఏమైనా ఈసారి చెప్పిన ప్రకారం రాధే శ్యామ్ థియేటర్స్ లో అలరించడం ఖాయం. విడుదలకు సమయం దగ్గర పడిన కారణంగా ప్రొమోషన్స్(Promotions) పై దృష్టి పెట్టారు.

దీనిలో భాగంగా ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధం చేశారు. మహాశివరాత్రి(Maha Shivaratri) పండుగను పురస్కరించుకొని మార్చి 2(March 2nd)న సాయంత్రం(Evening 3) 3 గంటలకు రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన(Official Announcement) చేశారు. దాదాపు మూడేళ్లుగా రాధే శ్యామ్ షూటింగ్ జరుపుకుంటుంది. అనుకోని కారణాలతో షూటింగ్ సవ్యంగా సాగలేదు.

ఈ ఏడాది సంక్రాంతి (Sankranthi)కానుకగా రాధే శ్యామ్ విడుదల కావాల్సి ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో విడుదల  వాయిదా(Postpone) పడింది. ఈ సినిమా రిలీజ్ గురించి మేక‌ర్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. గోపీ కృష్ణా మూవీస్(Gopi Krishna Movies) రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు(Rebel Star KrishnamRaju) స‌మ‌ర్పణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌(YUVI Creations Banner)పై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మించగా,  దాదాపు రూ.300 కోట్ల(300 Crores)కు పైగా బడ్జెట్(Budget) తో రాధే శ్యామ్ తెరకెక్కింది.

రాధే శ్యామ్ చిత్రంపై పరిశ్రమ(Industry)లో భారీ హైప్(Huge Hipe) నెలకొని ఉంది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడి(Palmisrty Expert) పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ప్రేరణ అనే టీచర్(Teacher) పాత్రలో పూజా హెగ్డే కనిపించనుంది.

బాలీవుడ్ తార(Bollywood actress) భాగ్య శ్రీ(Bhagya sri) కీల‌క పాత్ర(Important Role)లో న‌టించారు. సినిమా ఎలాంటి రికార్డుల(Records)ను క్రియేట్(Create) చేయ‌నుందోన‌ని ట్రేడ్(Trade) వ‌ర్గాలు సైతం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి.