కంట్లో చిన్న నలక పడితేనే ఎంతో అసౌకర్యానికి గురవుతాం. వెంటనే అప్రమత్తమై(Alerts) ఆ ఇబ్బందిని తొలిగించే ప్రయత్నం చేస్తాం. కానీ కంటి చూపుని హరించే కొన్ని వ్యాధులను కనిపెట్టడంలో విఫలమవుతున్నాము. ఆ వ్యాధిని గుర్తించి, చికిత్స(Treatment)ను అందించే లోపే జరగకూడని నష్టం జరిగిపోయి, పూర్తిగా కంటి చూపే కోల్పోయే పరిస్థితి కలుగుతుంది. ఆలా చేపకింద నీరులా వ్యాపించే కంటి వ్యాధుల్లో గ్లకోమా(GLAUCOMA) ఒకటి.

ఈ వ్యాధి పట్ల అవగాహన(Awareness) ఏర్పర్చుకుని ముందు చూపుతో వ్యవహరించ కలిగితే అంధత్వాన్ని(Blind) సమర్ధవంతంగా  అడ్డుకోవచ్చంటున్నారు కంటి వైద్య నిపుణులు(Medical Experts.)

ఈ వ్యాధి పట్ల ఎలాంటి జాగ్రత్తలు(Precautions) తీసుకోవాలో తెలుసుకుందాం.

కంటి(EYE) చూపు విషయంలో కొన్ని రకాల నాడులు(Nerves) కీలక పాత్ర(Key Role) పోషిస్తాయి. గ్లకోమా సమస్య(Glaucoma Problem) ఏర్పడినప్పుడు కంటిలో ద్రవాల(Fluids) ఒత్తిడి పెరిగి(Increase Stress) ఆ నాడుల పనితీరు మందగిస్తుంది.ప్రపంచంలో చాల మందిలో ఈ సమస్య  అంధత్వానికి కారణమవుతుంది.

ముఖ్యంగా పిల్లల(Kids) నాడులు మరింత సున్నితంగా వున్న కారణంగా పిల్లల్లో గ్లకోమా సృష్టించే సమస్యలు అన్ని ఇన్ని కావు. ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని గ్లకోమా అనేక రకాలుగా తీసుకుని వర్గీకరించవచ్చు. ఇందులో సాధారణ ఒత్తిడి(Stress) వున్న, గ్లకోమా విషయానికి వస్తే ముందుగా గుర్తించలేకపోవడం వల్ల పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం వుంది. దీన్ని ప్రారంభంలో గుర్తించ కలిగితే ఏ విధమైన సమస్య లేకుండా బయటపడవచ్చు. పిల్లల్లో పుట్టుకతో(Birth)నే గ్లకోమా రావడానికి ఆస్కారం వుంది.

దీన్నే బర్త్ గ్లకోమా(Birth Glaucoma)గా చెప్తారు. దీనికి వెంటనే చికిస్త అవసరం. కంటి పాప రంగు(EYE Color)ని కోల్పోతూ ఉండడాన్ని పిగ్మెంట్(Pigment) అనే గ్లకోమాగా చెప్తారు.

కంటి మీద అధిక ఒత్తడి వున్న కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా బాగా చదివే పిల్లలు, టీవీని దగ్గరగా చూసే పిల్లల్లో కంటి మీద అధిక ఒత్తిడి ఉంటుంది. దానికి తోడు వారి కంటిలో వుండే భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ మార్గంలో ఏ చిన్న ఇబ్బంది కలిగిన పిల్లల మీద దాన్ని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.

సాధారణంగా వృద్యాపం, అనువంశిక వారసత్వం (Inheritance), మధుమేహం(Diabetes), అధిక రక్తపోటు(High BP), కంటిలో ఇన్ఫెక్షన్(Eye Infection), రెటీనాలో  నొప్పి(Pain in Retina) , హస్వదృష్టి(Insight) లాంటి లక్షణాలు  గ్లకోమా ప్రారంభంలో ఎదురవుతాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్లో ఈ సమస్య  ఏ మేరకు ఉందనే విషయాన్ని పరిశీలించాలి. కంటి సమస్యలు వున్న వారు ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు.

గ్లకోమా సమస్యను ప్రారంభంలోనే గుర్తించ కలిగితే చుక్కల మందు ద్వారా మంచి పరిష్కారాన్ని అందించవచ్చు. ఆలస్యం అయ్యే కొద్దీ శస్త్రచికిత్స(Treatment) లేదా లేజర్ చికిత్స (Laser Treatment)అవసరం కావచ్చు.

ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు చలువ కళ్లద్దాలు(Spects) ధరించాలి. వైద్యులు సూచించిన విధంగా మందులు వాడుతూ(Medication) కంటిని గాయాల(EYE Wound) బారి నుంచి రక్షించుకోవడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం(Permanent Solution) లభిస్తుంది. ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు(Eye Test) నిర్వహించడం ద్వారా సమస్యకు ఆస్కారం లేకుండా గ్లకోమా బారినుంచి బయటపడవచ్చు.

పిల్లల నుంచి పెద్దల వరకు ఏ వయసు వారికైనా గ్లకోమా రావచ్చు, వంశపార్యంపరంగా వచ్చే ప్రైమరీ గ్లకోమా(Primary Glaucoma)ను  నియంత్రించే(Control) అవకాశాలు లేకపోయినా అప్రమత్తం(Alert)తో వ్యాధి ముదిరిపోకుండా చికిత్సతో అదుపు చేయవచ్చు.

అలాగే ఇతర వ్యాధుల ప్రభావ, స్టెరాయిడ్ మందులు(Steroid Medicines), ప్రమాదాల(Accidents) వల్ల వచ్చే గ్లకోమాల(Glaucoma)ను కూడా కొన్ని ముందు జాగ్రత్త(Precautions) చర్యలతో నివారించవచ్చు.