ఏదైనా ఆహారం(Food) స్వీకరించేటప్పుడు కరివేపాకు(Curry leaves) కనిపిస్తే ఖచ్చితంగా తీసివేస్తారు. ఆ రుచిని ఇష్టపడకపోవడమే ఇందుకు సగం కారణం. కానీ దాని ప్రయోజనాలు(Benefits) తెలిస్తే, పారేయదానికి మనసు రాదు. సౌత్ ఇండియన్ ఆహారంలో అత్యుత్తమ వంట పదార్ధంగా ప్రసిద్ధి చెందింది కరివేపాకు.

వాస్తవానికి దీనిని వంటలలో జోడించడానికి అనేక కారణాలున్నాయి. కరివేపాకు ఎ, బి, బి2, సి మరియు ఇ విటమిన్లను కలిగి ఉండడం మాత్రమే కాకుండా, ఇనుము మరియు కాల్షియంలలో కూడా పుష్కలంగా ఉంటుంది. చెడు బ్యాక్టీరియాను, కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ వంటి వాటిని కూడా నాశనం చేయగలవని నిరూపించబడినది కూడా.

ఈ కరివేపాకు ఇతర మూలికల వలె, ఫోలిక్ ఆమ్లం, మరియు ఇనుము(Iron)లో పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీ బాక్టీరియల్(Anti Bacterial), యాంటీ ఇన్ఫ్లమేటరీ(Anti Inflammatory) లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కరివేపాకు జుట్టును పునరుద్దరణ చేసేందుకు సహాయం చేస్తుంది మరియు బూడిద రంగు లేదా తెల్ల జుట్టును వదిలించుకోవటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మీరు చుండ్రు(Dandruff) వంటి సమస్యలతో బాధపడుతూ ఈ కరివేపాకు ఖచ్చితంగా ఉపశమనాన్ని ఇవ్వగలదని ప్రజల నమ్మకం.

కరివేపాకు జీర్ణక్రియ(Digestion) సజావుగా సాగడంలో సహాయం చేస్తుంది మరియు రక్తహీనత(Anemia)కు వ్యతిరేకంగా పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుంది. అతిసారం లేదా మలబద్దకం(Constipation) వంటి వ్యాధుల చికిత్సలో కరివేపాకు అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుందని వైద్యులు సూచిస్తుంటారు కూడా; అతిసారంతో భాధపడుతున్న ఎడల, 4 నుండి 5 కరివేపాకులు నేరుగా తినడం మంచిదిగా సూచించబడింది.

మీరు అజీర్ణ సమస్యలతో భాదపడుతున్న ఎడల మీ భోజనం తర్వాత 2 నుండి 3 కరివేపాకులను తినడం ద్వారా ప్రయోజనాలని పొందగలరని సూచించబడింది. ఉదయం పూట ఏదైనా ఆహారాన్ని తీసుకోవడానికి ముందు, 5 నుండి 6 కరివేపాకులు తీసుకోవడం ద్వారా మీ శరీరంలో సరైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడడం ద్వారా, మధుమేహంతో పోరాడడానికి సహకరిస్తుంది.

ముఖ్యంగా టైప్ 2 మధుమేహ(Type 2 Diabetes) భాధితులకు ఎంతగానో సహాయపడగలదు. కరివేపాకులు, శరీరంలో రక్తపోటు(BP)ను కూడా నిర్వహిస్తుంది, ముఖ్యంగా అధిక రక్తపోటు.

కంటి శుక్లాలు(Eye Balls), ఇన్ఫెక్షన్స్(Infection) వంటి అనేక కంటి సమస్యలను సైతం తగ్గిస్తుంది మరియు దృష్టిని మెరుగుపరచడానికి కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే పెద్దలు కరివేపాకును పారవేయొద్దని సూచనలిస్తుంటారు. కరివేపాకులు బరువును తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఒత్తిడి(Stress) స్థాయిలను సైతం తగ్గిస్తుంది. తురిమిన కరివేపాకు, బెల్లంతో కలుపుకుని నిద్రకు ఉపక్రమించే ముందు తినడం ద్వారా కొలెస్ట్రాల్, గుండెవ్యాధుల(Heart problems)ను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ ఆకులు కీమోథెరపీ(Chemo Therapy) యొక్క దుష్ప్రభావాల చికిత్సలో అద్భుతంగా పనిచేస్తాయి కూడా. కరివేపాకులు క్యాన్సర్ వ్యతిరేక ఏజెంట్ వలె పనిచేస్తాయి. మీరు జలుబు బారిన పడి, ముక్కుదిబ్బడకు గురైనట్లయితే, కరివేపాకులు ముక్కు మరియు ఊపిరితిత్తుల నుండి శ్లేష్మాన్ని తొలగించి ముక్కుకు ఉపశమనం కలిగించుటలో సహాయం చేయగలదు.

చర్మం(Skin) కమిలిపోవడం, దురద, మరియు వాపు వంటి వివిధ రకాల చర్మ వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి కరివేపాకులు సహాయపడతాయి.15-20 కరివేపాకు ఆకులను కొద్దిగా నీటికి జోడించి మిక్స్ చేయాలి. మీ సమస్యకు ఉత్తమ ఫలితాలను పొందడానికి క్రమంగా ఉపశమనం పొందడానికి 30 నిముషాల పాటు ఈ మిశ్రమాన్ని ప్రభావితమైన ప్రాంతానికి వర్తించండి. ప్రకాశవంతమైన చర్మం కోసం, మీరు కరివేపాకుల పొడిని, నిమ్మరసం మరియు రోస్ వాటర్ కలిపిన మిశ్రమాన్ని మీ ముఖానికి వర్తించండి.

క్రమంగా ఇది మీ అందాన్ని మెరుగుపరచడంలో సహాయపడగలదు. కరివేపాకు మీ గాయాలను సైతం నయంచేసే గుణాలను కలిగి ఉంటుంది. మరియు హానికరమైన అంటురోగాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. కరివేపాకు పేస్టుకి, కొంత నీటిని జోడించి ఆపై గాయం మీద మిశ్రమాన్ని వర్తించడం ద్వారా ఉపశమనాన్ని పొందగలరు.

మీరు మీ రోగనిరోధకత(Immunity)ను పెంచుకోవాలనుకుంటే, 15 కరివేపాకులను రోజులో తీసుకోవడం ఉత్తమంగా సూచించబడినది. కానీ మీరు పరిమితిని మించి తీసుకున్న ఎడల, అది కడుపు సంబంధిత సమస్యలు(Stomach Related Problems), ఆమ్లత్వం, వికారం వంటి దుష్ప్రభావాలకు కారణం అయ్యే అవకాశాలు లేకపోలేదు.