ఒకప్పుడు వైద్య పరీక్ష అంటే, రక్త పరీక్షలతోనే మొదలు. ఏ వ్యాధి నిర్ధారణ కావాలన్నా మన శరీరం నుంచి రక్తాన్ని సేకరించి, దానిని వైద్య శాస్త్ర విధంగా విశ్లేషించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇప్పుడు చెప్పలంటే అలా చేసేవారు అని చెప్పాలి. కారణం, మనకు సూది గుచ్చకుండానే ఎన్నో ఆరోగ్య లక్షణాలను కనిపెట్టే పరికరాలు, యాప్ లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం అలాంటి ఒక యాప్ గురించి చెప్పుకుందాం.

చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి దాకా ఎక్కువ మందికి రక్తహీనత ఉంటుంది. కారణాలు ఏమైనా, మన శరీరంలో ఉండాల్సినంత హిమోగ్లోబిన్ లేకపోతే, అది ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతుంది. అలాంటి హిమోగ్లోబిన్ మన శరీరంలో ఎంత ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఒక యాప్ ను తయారు చేసారు అమెరికాలోని University of Washington కు చెందిన పరిశోధకులు. UW లోని కంప్యూటర్ సైన్సు మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కేవలం స్మార్ట్ ఫోన్ కెమెరా ను ఉపయోగించి కనుక్కోవచ్చు అని నిరూపించారు. అదెలాగో చూద్దాం.

HemaApp దీని పేరు. ఈ యాప్ ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఈ యాప్ లోకి వెళ్లి మన కుడి/ఎడం చేతి చూపుడు వేలిని ఫోన్ కెమెరా ను కప్పేలా ఉంచితే చాలు కొద్ది సెకన్లలో మన హిమోగ్లోబిన్ శాతాన్ని చెప్పేస్తుంది. అది ఎలాగా అనుకుంటున్నారా. మన రక్తంలో రక్తంతో పాటు ప్లాస్మా కూడా ఉంటుంది. చూడడానికి అందరి రక్తం ఎర్రగానే ఉన్నా అందులో కొంచెం తేడాలు ఉంటాయి. ఈ రక్తం మీద కాంతిని ప్రసరింపచేస్తే (chromatic analysis) తద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని అంచనా వేయవచ్చు. ఆ పైన machine learning algorithm ల ఆధారంగా ఈ యాప్ తయారు చేయబడింది.

దీనిని 31 మంది రోగుల మీద పరీక్షించగా, అమెరికాలో FDA ఆమోదం పొంది, అక్కడ లభించే సంప్రదాయ హిమోగ్లోబిన్ మీటర్ (Masimo Pronto) ల తో సమానంగా ఈ యాప్ పని చేసింది. అంతే కాదు ఈ యాప్ అనీమియా ను కూడా ఇలాగే కనిపెట్టగలదు.

అయితే ఈ యాప్ ప్రస్తుతం మన దేశంలో ఇంకా లభించడం లేదు. ఇందుకోసం మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Courtesy