ప్రస్తుతం ఉన్న రోజుల్లో గర్భం (Pregnancy) రావడమే కష్టంగా ఉంది.ఒకవేళ్ల వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టంగా మారింది.అందుకే గర్భం దేవుడిచ్చిన  వరంలా (God’s Gift) భావిస్తుంటారు ప్రతిఒక్కరు.

ఎందుకు చాల మంది గర్భం  ధరించలేకపోతున్నారంటే కలుషిత వాతావరణం,జంక్ ఫుడ్స్ (Junk Food) ,అధిక వత్తిడి ,సరిపడా వాటర్ తీసుకోకపోవడం,పనుల వత్తిడి వల్ల నిర్లక్ష్యం అంటే జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల చాల మంది గర్భం ధరించలేకపోతున్నారు.

ఒకవేళ ధరించిన గర్భం నిలబడకపోవడం వంటి సమస్యల నుండి బయటపడదాం.

గర్భం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

1.మహిళలు మాములు సమయం కంటే గర్భం సమయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి.

2.ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి మరియు ప్రశాంతంగా మానసిక వత్తిడి లేకుండా ఉండాలి.అప్పుడే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా (Healthy) ఉంటుంది.

3.మాములు సమయంకన్నా గర్భం సమయంలో కనీసం 10గంటలైనా నిద్రపోవాలి.

Pregnancy Sleep

4.మూడో నెల నుండి ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిది ఆలా పడుకోవడం వల్ల శిశువుకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

  1. అధిక బరువులు ఎత్తకూడదు.చిన్నపాటి వ్యాయామం లేదా వాకింగ్ చేస్తే మంచిది.

Walking

6.మొదటి 6నెలలు నెలకొకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి,ఏడు మరియు ఎనిమిదవ నెలల్లో రెండు సార్లు,తొమ్మిదొవ నేలలో వారానికి ఒకసారి వైద్య పరీక్షలు (Doctor Checkup) తప్పనిసరి.

7.దూర ప్రయాణాలు,ఎక్కువగా చేయకూడదు.ఎక్కువగా ఒకే చోట నిలబడటం,కూర్చోవడం కూడా చెయ్యకూడదు.వీలైతే ప్రతి 15నిమిషాలకు ఒకసారి లేచి అటు ఇటు తిరగాలి.

8.ఉద్యోగం చేసే మహిళలు (Employee women) అయితే మరి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి,ఎందుకంటే గర్భం సమయంలో వచ్చే మార్పులు తట్టుకొని ఉద్యోగం చేయడం కష్టమే అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటు,మంచి ఆహారం,ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి

1 .పౌష్టికాహారం తీసుకోవాలి.అనగా పాలు,గ్రుడ్లు పండ్లు,ఆకుకూరలు,పప్పుధాన్యాలు క్రమంతప్పకుండా తినాలి.

2.ఎక్కువగా లిక్విడ్స్ (Liquids) తీసుకోవాలి అనగా పండ్ల రసాలు (Fruit Juices) మరియా అధికంగా వాటర్ (Water) తాగాలి.ఆలా తాగటం వల్ల శరీరం డీహైడ్రేషన్ (Dehydration)అవ్వదు.

మూమూలుగా ఉన్నప్పటికంటే రెండింతలు ఎక్కువగా తాగాలి.

Pregnancy food

3.గర్భిణీ స్త్రీలకు పండ్లలో దానిమ్మ (Pomegranate )చాలా మంచిది.ఎందుకంటే విటమిన్ కే,ఐరన్,ఫైబర్ ,పొటాషియం ఎక్కువగా ఉంటాయి.ముఖ్యంగా శిశువు ఎదుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.

4.ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల నెలలు నిండకుండానే చాలా మంది ప్రసవం అవుతున్నారు.అలాంటి ప్రమాదాలు తప్పుతాయి.

5.ఎండిన నల్లద్రాక్ష తినడం వల్ల శరీరం డిహైడ్రాట్ అవ్వకుండా ఉంటుంది.

6.అరటి పండు (Banana) తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి,ముఖ్యంగా మలబద్దకంని నివారిస్తుంది.

అంతేకాకుండా అరటి పండులో ఫోలిక్ యాసిడ్ (Folic Acid) అధికంగా ఉండటం వల్ల శిశువు బ్రెయిన్,నాడీవ్యవస్థ,వెన్నెముక ఏర్పడటానికి ఈ ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం.

7.సాల్మన్ చేపలు తినడం వల్ల కళ్ళు,మెదడు (Eyes, Brain) బాగా అభివృద్ధి చెందుతాయి.దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారానికి రెండు లేదా మూడు సార్లు తింటే మంచిది.

ధ్యానం చేయడం ,బుక్స్ చదవడం,మనసుని ఆహ్లాదముగా ఉంచుకోవడం మంచిది.

ప్రెగెన్సీ సమయంలో చేయకూడని పనులు.

మొదటి మూడు నెలలు అధిక బరువులు మొయ్యరాదు.మొబైల్ ఫోన్స్ (Mobile Phone) ఎక్కువగా వాడకూడదు,అది రాత్రి సమయంలో లైట్ ఫోకస్ కంటి రెటీనా మీద పడి నిద్రరాదు.నిద్ర తక్కువైతే అనారోగ్యం తలెత్తుతుంది.

ఎక్కువగా రద్దీ స్థలాలికి,షాపింగ్ మాల్స్ కి వెళ్లకుండా ఉంటే మంచిది.వెలికలుగా పడుకోకూడదు.

నిద్రలేమి ఉండకూడదు.అనవసరమైన ఆలోచనలు,అధిక మానసిక ఒత్తిడి (Stress) ఉండకూడదు.

ప్రెగెన్సీ సమయంలో కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రెగెన్సీ సమయంలో కరోనా (Corona Virus) సోకకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎక్కువగా బయట తిరగకూడదు.ఒకవేళ అత్యవసరమైతే మాస్క్ ధరించాలి.ఆరు అడుగులు దూరం పాటించాలి.ఎప్పటికప్పుడు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి అదే విధంగా మీ చేతులని నోరు మరియు ముక్కు కు దూరంగా ఉంచండి.

జలుబు,దగ్గు,హై ఫీవర్,వాంతులు,కడుపు నొప్పి,గొంతో నొప్పి,వాసనా,రుచి లేకపోవడం.

ఇలా    ఎటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

మాములో రోజుల్లో లాగా కాకుండా గర్భిణీలు వ్యధ పరీక్షలకు కోసం ఎక్కువ సార్లు హాస్పిటల్స్ కి వెళ్లకుండా ఇంట్లోనే వీడియో కాల్స్ (Video calls) ద్వారా డాక్టర్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ అత్యవసరం అయితే వెళ్ళవచ్చు.

Doctor video call

ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని సుఖ ప్రసవాన్ని పొంది ,తల్లి ,బిడ్డ ఆరోగ్యంగా ఉండండి.

బోసి నవ్వుల చిన్నారిని మీ ఇంటికి ఆనందం గా ఆహ్వానించండి (Welcome to healthy baby).