టాలీవుడ్ గ్లామర్ క్వీన్ గా రాణిస్తున్న అక్కినేని సమంత (Samantha Akkineni ) ఎప్పుడు ఏదో ఒక వార్తతో నెట్లో యాక్టీవ్ గా ఉండే సంగతి అందరికి తెలిసిందే.టాలీవుడ్ లోతనదైన శైలిలో తనకంటూ ఓ ప్రతేక్య  స్థానాన్ని ఏర్పరచుకుంది సమంత.

సామ్ అలియాస్ సమంత ఈ పేరు తెలియని వారు ఉండరు.ఎందుకంటే తనకు ఉన్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు ఒక రేంజిలో తాను అభిమానులని సంపాదించుకుంది.

ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ తో తన క్రేజ్ ని నిరూపించుకుంది సమంత. 18 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకున్న ఫాలోయింగ్ ని అర్ధం చేసుకోవాల్సిందే.హీరోయిన్‌ సమంత క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సమంత ఈ పేరులో ఈమె ముఖంలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది.సమంతని చూడగానే ఇష్టపడని వాళ్ళు ఉండరు.తనకి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ ని బట్టి ఎన్నోకంపెనీలు సైతం తమ బ్రాండ్లకు ప్రచారం చేయాల్సిందిగా అడ్వేర్టైజింగ్ కంపెనీలు క్యూ కడుతున్నాయి.

ఇందుకు తగ్గట్లుగానే భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో ఒక్కో పోస్ట్‌కి గాను సమంత దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు తీసుకుంటుందని టాక్‌ వినిపిస్తోంది.సమంత టాప్ హీరోయిన్ గానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తుంది. అంతేకాకుండా ఇంకొకవైపు  వాణిజ్య ప్రకటనలతో కూడా సంపాదిస్తుంది.

తెలుగు ఓటీటీ ఆహా ( (OTT Aha)ద్వారా సామ్ జమ్ అనే టాక్ షో తో అందరిని ఆకట్టుకుంది.

sam jam

తన జీవితంలో జరిగే ప్రతి సంతోషాన్ని అభిమానులతో ఎప్పటికప్పుడు   పంచుకుంటూ సోషల్ మీడియాకు చేరువగా ఉంటుంది సమంత అక్కినేని. ఫాలోయింగ్‌ విషయంలోనూ సౌత్‌లో మిగతా హీరోయిన్ల కంటే సమంతదే పైచేయి అని చెప్పొచ్చు.

అంతేకాకుండా ఇంకొకవైపు  వాణిజ్య ప్రకటనలతో కూడా సంపాదిస్తుంది.ఇలా సమంత గురించి చెప్పుకుంటూపోతే ఎంత చెప్పిన తక్కువే.

ఏంమాయ చేసావే  చిత్రంతోనే అందరిని ఆలా మంత్రముగ్ధుల్ని చేసింది.విభిన్నమైన పాత్రలతో ఒక గుర్తింపుతెచ్చుకుంది.

మరో వైపు ,

తను ప్రతి సినిమాని,తన పాత్రను ఆచి తూచి ఎంచుకుంటుంది.సమంత శకుంతల (Shakuntala)మూవీ లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.తను సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా  సమంతకు వీడ్కోలు చెప్తూ చిత్ర యూనిట్ అంతా గ్రాండ్ గా  పార్టీ సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో భరతుడు పాత్రలో అల్లు అర్హ (Allu Arha) నటించింది. మొన్ననే తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తిఅయింది.

సమంత ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా సామ్ దర్శకుడికి ఎమోషనల్ గా ధన్యవాదాలు తెలియజేసారు. గుణశేఖర్‌ దర్శకత్వం వస్తున్నా ఈ సినిమాను  ‘దిల్‌’ రాజు, నీలిమా గుణ ఇద్దరు కలసి  చేస్తున్నారు.

Shakuntala

సమంత ఫ్యాన్స్ , శకుంతల మూవీ లో సమంత పాత్ర ఎలా చేసిందో అని అందరు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.తన బాగా చేసిందని టాక్ వినిపిస్తుంది.

అందులోను అల్లు అర్హ మొదటసారి నటించిన సినిమా కాబట్టి అటు అల్లు ఫ్యామిలీ ఫాన్స్ కి ,ఎటు అక్కినేని మరియు సమంత ఫాన్స్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇక సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి.

మొత్తానికి ఈ అమ్మడు

మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్టు గా , అటు సోషల్ మీడియా లో , ఇటు అడ్వేర్టైస్మెంట్స్,సినీ ఇండస్ట్రీ లో బాగా బిజీ అయిపోతూ ,చేతి నిండా పని ,డబ్బుతో దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుంటోంది ఈ అక్కినేని వారి కోడలా మజాకానా అని పించుకుంటోంది.