యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ జోష్ లో వున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ  చిత్రాలు చేసే ఈ కుర్ర హీరో హిట్లు ప్లాపుల తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.

ఈ మధ్య విడుదలైన A1 ఎక్స్ప్రెస్ చిత్రం తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు, అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది.

ఈ చిత్రం లో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటించింది. A1 ఎక్స్ప్రెస్ చిత్రం తరువాత సందీప్ కిషన్ నటిస్తున్న మూవీ గల్లీ రౌడీ. ఈ మూవీ ముందు గా రౌడీ బేబీ అని  టైటిల్ అనుకున్నారు.

కానీ అనుకోని కారణాల వాళ్ళ ఈ మూవీ పేరు లో మార్పు చేయాల్సి వచ్చింది.

సందీప్ కిషన్ హీరో గా నటిస్తున్న గల్లి రౌడీ (Galli rowdy) చిత్రాన్ని ఎంవివి  సినిమాస్ బ్యానర్ పై ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల స‌క్సెస్‌లో ముఖ్య  పాత్రను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంకట్ ఈ  చిత్రానికి సమర్పికుడి గా వ్యవహరించడమే  కాకుండా స్క్రీన్ ప్లే ను కూడా అందించారు.

కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌ట‌పాకాయ్‌, సీమ‌శాస్త్రి,  దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ మూవీలో హీరోయిన్  గా నేహా శెట్టి నటిస్తున్నారు. తాజా గా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక వార్త ఫిలిం ఇండస్ట్రీ లో చెక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రం మే 21 (May21) న  థియేటర్స్ లో విడుదల  కావాల్సింది. కానీ కోవిడ్ ఆంక్షల వల్ల సినిమా రిలీజ్ ని వాయిదా వేశారు.ఆ తరువాత జులై లో ఓటిటి లో రిలీజ్ చేస్తారని ఒక రూమర్ వచ్చింది.

ఈ పుకార్లన్నిటికి చెక్ పెడుతూ హీరో సందీప్ కిషన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సెప్టెంబర్ 3 న రిలీజ్ చేస్తునట్టు పోస్ట్ చేసి రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా ఖరారు  చేసాడు.

గల్లి రౌడీ ఫన్ మసాలా ఎంటర్టైనర్ గా సెప్టెంబర్ లో మన ముందు కు వచ్చేస్తోంది. ఇది వరకే ఈ మూవీ ఫస్ట్ లుక్, టీసర్  ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తాజా గా ఈ మూవీ నుంచి మరో లిరికల్  వీడియో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి  యూ/ఏ సర్టిఫికెట్ కూడా పొందింది.. సందీప్ కిషన్ నేహా శెట్టి  (Neha setty) తో పాటు  రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహ,  పోసాని కృష్ణ ముర‌ళి, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు.

ఇప్పటికే  ఈ  చిత్రం నుంచి రిలీజైన ‘పుట్టేనె ప్రేమ..’ అనే లవ్ సాంగ్, ‘చాంగురే చాంగురే.. అనే ఐటెమ్ సాంగ్‌ (Item song) కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడదే బాటలో ‘విశాఖ‌ప‌ట్నంలో రౌడీగాడు’ సాంగ్ ఆకట్టుకుంటోంది..