తమిళ హీరో(Tamil Hero) శింబు(Shimbhu) ఇటీవల ‘మానాడు’(Maanadu) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. టైం లూప్ కాన్సెప్ట్(Time loop Concept) తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో భారీ సక్సెస్(Success) ని సాధించింది. అయితే ఈ సినిమాని తర్వాత తెలుగులో కూడా డబ్ చేసి ఓటీటీ(OTT)లో విడుదల  చేశారు.

ఓటీటీలో కూడా తెలుగు ప్రేక్షకుల(Audience) నుంచి భారీ స్పందన(Huge Response) అందుకుంది. ఈ సినిమాపై శింబుకి అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

ఈ మూవీని వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో రూపొందింది . ఇందులో శింబుకు జంట(Pair)గా కళ్యాణి ప్రియదర్శన్‌(Kalyani Priyadarshini) నటించింది.  ఈ సినిమాను తెలుగులో రీమేక్‌(Remake) చేయనున్నట్లు ప్రకటించారు.

సురేష్‌ ప్రొడక్షన్స్(Suresh Productions) ఈ సినిమా రీమేక్‌ హక్కుల(Rights)తో పాటు, అన్ని భాషల డబ్బింగ్ రైట్స్(Dubbing Rights) ని కొనుక్కున్నారు. అయితే ఈ సినిమాని తెలుగులో నాగచైతన్య(Naga Chaitanya) తో,అభితో ఇలా చాలామంది హీరోలతో అనుకున్నారు. కానీ ఆఖరికి రానా(Rana)తో రీమేక్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు మీడియా(Media)తో మాట్లాడిన నాగచైతన్య తెలిపారు.

తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి తన సొంత బ్యానర్(Own Banner) లోనే ఈ సినిమా రానా హీరోగా తెరకెక్కబోతుంది అని సమాచారం. అయితే దర్శకుడిగా తమిళ్ వర్షన్ డైరెక్ట్ చేసిన వెంకట్ ప్రభునే తీసుకుంటారా లేక వేరే తెలుగు డైరెక్టర్ ని తీసుకుంటారా చూడాలి.

ఈ చిత్రానికి  యువన్ శంకర్(Yuvan Shankar) రాజా సంగీతాన్ని(Music) అందించారు, హీరోగా శింబు – విలన్(Vilan) గా ఎస్.జె. సూర్య(S.J,Surya) ప్రధానమైన పాత్రలను పోషించారు. విభిన్నమైన కథాకథనాలతో తెరకెక్కిన ఈ సినిమా, అక్కడి బాక్సాఫీస్(Box office) దగ్గర భారీ హిట్ ని  నమోదు చేసింది.

కెరియర్(Carrier) పరంగా శింబూకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చిన సినిమా ఇది. ఎస్.జె. సూర్య విలనిజాని(Vilanism)కి మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేసారు .ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ హీరో పాత్రను రానా చేయనున్నాడనే టాక్ బయటికి వచ్చింది. మరి విలన్ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. తెలుగులో కూడా ఈ సినిమాను వెంకట్ ప్రభునే డైరెక్ట్(Direct) చేయనున్నాడని అంటున్నారు.