మన టాలీవుడ్ యంగ్ హీరో, లవర్ బాయ్ అయిన  నాగ శౌర్య నటించిన లక్ష్య సినిమా టీజర్ ని ఈ రోజు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ (NorthStar Entertainment) యూట్యూబ్ ఛానల్, నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భం గా రిలీజ్ చేశారు. మొన్నటి ఊహలు గుస గుస లాడే నుంచి నిన్నటి అశ్వథామ వరకు నటించి తనకంటూ నటన లో క పంథా ఏర్పరుచుకున్న నాగ శౌర్య ఈ సినిమాలో ఒక సరికొత్త లుక్కు తో మరియు ఒక సరికొత్త కాన్సెప్ట్ తో  మనందరి ముందుకు రాబోతున్నాడు. అంతే కాకుండా ఈ టీజర్ లో విలక్షణ నటుడు అయినా జగపతి బాబు వాయిస్ తో వచ్చే ‘కొందరికి ఆట వల్ల గుర్తింపు వస్తుంది.. కొందరి వల్ల ఆటకే గుర్తింపు వస్తుంది’, ‘పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం’, డైలాగ్స్ ఈ సినిమా పై మన అంచనాలని రెట్టింపు చేసే లాగా వున్నాయి అంటే అతిశయోక్తి కాదు.

ఈ టీజర్ పై మీరు ఒక లుక్కు వెయ్యండి మరి.

ప్రధాన పాత్రలు: యంగ్ హీరో నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ, జగపతి బాబు

సినిమాటోగ్రాఫర్‌: రామ్‌రెడ్డి,

సంగీతం: కాల‌బైర‌వ‌,

ఎడిట‌ర్‌: జునైద్‌,

నిర్మాత‌లు: నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్,

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సంతోష్‌ జాగర్లపూడి