ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల(Unemployees)కు గుడ్ న్యూస్(Good news). ప్రసార భారతి రిక్రూట్‌మెంట్ (Prasara Bharati Recruitment) నోటిఫికేషన్‌(Notification)ను విడుదల చేసింది. దీని ప్రకారం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్(Marketing Executive) మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-I పోస్టుల(Grade-1 Posts)కు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ(Application Process) ఇప్పటికే ప్రారంభం అయింది.  అర్హత(Qualified), ఆసక్తి(Interested) కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్(Official Website) prasarbharati.gov.inను సందర్శించడం ద్వారా ఆన్ లైన్(Online) లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ(Last date) 23 నవంబర్(November 23rd) 2022గా నిర్ణయించారు.  ఎంపికైన అభ్యర్థులు(Selected Candidates) ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, సిమ్లా, చండీగఢ్, డెహ్రాడూన్‌ వంటి ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-I పోస్టులతో సహా 11 పోస్టులను నియమించనున్నారు.  అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ(University) నుండి MBA లేదా PG డిప్లొమా (మార్కెటింగ్) కలిగి ఉండాలి.

దరఖాస్తుదారు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో(Electronic Media) 1-4 సంవత్సరాల డైరెక్ట్ సెల్లింగ్(Direct Selling) అనుభవం(Experience) కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 ఏళ్లు మించకూడదు. దరఖాస్తులకు సంబంధించి పూర్తి వివరాల(Full Details)కు అధికారిక వెబ్ సైట్ ను https://applications.prasarbharati.org సందర్శించొచ్చు.

దరఖాస్తుల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని తప్పుల సవరణకు ఎలాంటి అవకాశం ఇవ్వడం కుదరదని అధికారులు పేర్కొన్నారు.