మెగాస్టార్(Mega Star) చిరంజీవికి(Chiranjeevi) అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే 53వ(53rd) ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌(Title) ను మెగా స్టార్ కి అందించనున్నట్లు అనౌన్స్(Announce) చేసారు.

ఈ మేరకు కేంద్రమంత్రి(Central Minister) అనురాగ్ ఠాకూర్(Anurag Takur) ఆయనకు శుభాకాంక్షలు(Wishes) తెలిపారు. గోవా(Goa)లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవ(International Film Festival) వేడుకలు(Celebrations) ప్రారంభమయ్యాయి.

ఈ ఏడాది మొత్తం 79 దేశాల(79 Countries)కు చెందిన 280 చిత్రాల(280 Movies)ను ప్రదర్శించనున్నారు అతను భారతీయ సినిమా యొక్క అత్యంత విజయవంతమైన మరియు ప్రభావవంతమైన నటులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఈ అవార్డును 2013లో భారతీయ సినిమా 100 సంవత్సరాలు(100 Years) పూర్తి చేసుకున్న సందర్భంగా అందించడం ప్రారంభించారు.

నాలుగు దశాబ్దాల పైచిలుకు నుంచి సాగుతున్న అద్భుతమైన కెరీర్‌(Career)లో 150కి పైగా చిత్రాల్లో నటించినందుకు చిరంజీవికి ఈ అవార్డు అందించారు.

వహీదా రెహమాన్(Wahid Rehman) ఈ అవార్డును మొదటిసారి అందుకోగా… ఆ తర్వాత రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం, అమితాబ్ బచ్చన్, సలీం ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్ జోషి వంటి దిగ్గజాలకు ఈ అవార్డు దక్కింది. ఈ సంవత్సరం చిరంజీవికి ఈ అవార్డును అందించనున్నారు.

చిరంజీవి 1978లో విడుదలైన ‘పునాదిరాళ్లు’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. తరువాత అతను అనేక భారీ-బడ్జెట్ తెలుగు చిత్రాలలో నటించాడు, వాటిలో ఎక్కువ భాగం బాక్సాఫీస్(Box office) వద్ద విజయం(Success) సాధించాయి.మెగా స్టార్ కి 10 ఫిల్మ్‌ ఫేర్(Film fare) అవార్డులు మరియు 4 నంది(4 Nandi) అవార్డులతో సహా అనేక అవార్డులు మరియు ప్రశంసలను అందుకున్నాడు. సూపర్ స్టార్ ప్రస్తుతం రెండు చిత్రాల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

బాబీ(Bobby) దర్శకత్వం(Direction) వహిస్తున్న వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి(Sankranthi)కి విడుదల కానుంది, ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ(Ravi Teja) కీలక పాత్ర(Key Role)లో కనిపించనున్నారు. అలాగే  మెహర్ రమేష్(Mehar Ramesh) దర్సకత్వంలో  ‘భోలా శంకర్'(Bhola Shankar), ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం'(Vedhalam) యొక్క తెలుగు రీమేక్(Telugu Remake). అతను చివరిగా సల్మాన్ ఖాన్(Salman Khan) తో కలిసి గాడ్ ఫాదర్(God Father) లో కనిపించాడు.