బిగ్ బాస్ సీజన్ 5( Big boss season 5) మంచి టిఆర్పీ(TRP ) తో పాటు మంచి ప్రేక్షకాదరణ కూడా లభిస్తోంది. ఏ సీజన్ లో లేనంతగా కంటెస్టెంట్స్(Contestants) మధ్య హీట్ డిస్కషన్స్, ఆర్గుమెంట్స్, గొడవలతో రెచ్చిపోతున్నారు. ఈ షో అప్పుడే మొదటి వారం ముగించుకుని రెండో వారం లో అడుగుపెట్టింది.
రెండో వారం మొదలవ్వడమే సోమవారం కావడం తో సెకండ్ వీక్ నామినేషన్ ప్రక్రియ తో స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రక్రియ అంటేనే హౌస్ మేట్స్ (House mates) మధ్య గొడవలు, రచ్చలు వేరే లెవెల్ లో ఉంటుంది.
ఈ సారి నామినేషన్స్ (Nominations) లో హౌస్ మేట్స్ ఎవరికీ వారు తమ విశ్వరూపం చూపించారు, ఉమా తన నోటి కి బాగానే పని చెప్పింది . బూతుల పురాణం మొదలెట్టిన ఉమా షాక్ లో హౌస్ మేట్స్, కోపం తో ఊగిపోయిన శ్వేత. కాజల్ కూడా ఓపెన్అప్ అవ్వడం తో ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగింది.
సోమవారం రోజు నామినేషన్ (Nomination) ప్రక్రియలో టాస్క్ (Task) ఇచ్చిన బిగ్ బాస్. అందులో భాగం గా హౌస్ మేట్స్ నక్క వర్సెస్ గ్రద్ద అనే రెండు టీంలు గా విడిపోవాలిసి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు.
ఈ వారం ఇంటినుంచి బయటకు పంపే హౌస్ మాట్ పై పెయింట్ రాయాల్సి ఉంటుందన్నారు. కానీ కంటెస్టెంట్స్ వాళ్ళ టీం కాకుండా మరో టీం నుంచి ఇద్దరిని నామినేట్ చేయాలనీ ట్విస్ట్ పెట్టిన బిగ్ బాస్.
ఇక గద్ద టీం లో యని మాస్టర్, ప్రియా హమీద,విశ్వ, సిరి, లోబో,షణ్ముఖ్, ప్రియాంక ఉండగా, నక్క టీం లో లహరి, శ్వేత,జెస్సి,సన్నీ,నటరాజ్ మాస్టర్,మానస్,ఉమాదేవి,కాజల్ వున్నారు.
ఇక సిరి కెప్టెన్ కావడం తో నామినేషన్స్ నుంచి తప్పుకుంది.
ముందుగా సిరి వచ్చి ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ ని నామినెటే చేసింది. నటరాజ్ మాస్టర్ వచ్చి ప్రియ, ప్రియాంక ను నామినేట్ చేస్తూ ప్రియ మంచి కోసం చెప్పాను, నేను కొంచం అడ్వాన్స్ అయ్యానేమో అని అనడం తో, మీ గేమ్ మీరు ఆడండి నా గేమ్ నేను ఆడతాను అని ప్రియా కౌంటర్ ఇచ్చారు .
యానీ మాస్టర్ వచ్చి ఉమా, కాజల్ని నామినేట్ చేయగా ఉమా ,యానీ మాస్టర్ మధ్య వాదనలు జరిగాయి .ఇక సన్నీ వచ్చి ప్రియ, ప్రియాంకను నామినేట్ చేస్తూ, టాస్కుల్లో ఇంకా యాక్టివ్ కావాలని ప్రియను, కిచెన్‌లో ఉండకుండా ఆటలోకి రమ్మంటూ ప్రియాంక సింగ్‌ను నామినేట్ (Nominate) చేశాడు ప్రియాంక సింగ్ వచ్చి నటరాజ్, సన్నీలను నామినేట్ చేసింది. ప్రియాంక నటరాజ్ మాస్టర్ చాల హార్ష్ గా మాట్లాడారని, కిచెన్ లో ఎంత ఆక్టివ్ గా ఉంటానో, టాస్క్(Task) లు ఆడే విషయం లో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటాను అని సన్నీ తో చెప్పింది.
అయితే ఇందులో ఎవ్వరూ కూడా నామినేటెడ్ చేయడానికి గల సరైన కారణాలు చెప్పడం లేదు. మానస్.. లోబో, ప్రియాలను నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్స్ చెప్పాడు. టాస్కులో లోబో సాయం చేయలేదు, ప్రియ సరిగ్గా మాట్లాడటం లేదంటూ మానస్ వాళ్ళను నామినేట్ చేసాడు.
ఉమా, కాజల్‌ను విశ్వ నామినేట్ చేసేశాడు. నాగార్జున ఇచ్చిన ఆలు కర్రీని ఇంట్లో వాళ్లకి ఇవ్వలేదని చెప్పి ఉమను అనడంత, అసలైన రచ్చ మొదలైంది. నాగార్జున గారు నేను ఒక్కదాన్నే తినాలి అని చెప్పిన తరువాత మిగతా వాళ్లకు ఎలా ఇస్తాను, అలా ఇస్తే అంటూ బూతులు మొదలుపెట్టిన ఉమా. దాంతో హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. షణ్ముఖ్ అయితే నోరెళ్లబెట్టాడు.
ఇక ప్రియాంక సింగ్ అయితే కింద పడి మరీ నవ్వింది. ఆ తరువాత ఉమా వంతు రావడంతో మరింత ఊగిపోయింది. యని మాస్టర్, విశ్వ లను నామినేట్ చేసింది. యని మాస్టర్ తో ఆర్గుమెంట్స్(Arguments) కాస్త తార స్థాయి కి వెళ్లడం తో యాన్ని మాస్టర్ ఎమోషనల్ అయ్యారు.
హౌస్ లో నాకు ఎవ్వరు రెస్పెక్ట్(Respect) ఇవ్వనవసరం లేదని, నేను గేమ్ అద్దడానికి వచ్చా, మీ గేమ్ మీరు ఆడండని ఉమా తేల్చి చెప్పడంతో పింకీ, పోవే ఉమా పో అని వ్యంగ్యంగా మాట్లాడింది.
లోబో రవిని నామినేట్ చేస్తూ తన తో ఫ్రెండ్షిప్ వద్దని, శ్వేత టాస్క్ ఆడడం చూడలేదని అలాగే హౌస్ లో పని చేసినట్టు కూడా చూడలేదని నామినేట్ చేసాడు. ఆ తరువాత వచ్చిన శ్వేత లోబో కి రంగు పూస్తూ లోబో కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ ని విసిరికొట్టింది. అందరు ఫేక్ అని ఒక్క్కొక్కరి రంగు బయటకు వస్తోందని, అలాగే హామీదను నామినేట్ చేసింది. అలాగే ఉమా బిహేవియర్ ని పాయింట్ అవుట్ చేస్తూ గొడవపెట్టుకుంది.
ఆడవాళ్లకు ఆడవాళ్లే రెస్పెక్ట్(Respect) ఇవ్వకపోతే ఎలా అంటూ కాస్తయినా హ్యుమానిటీ చూపించాలని గట్టిగానే ఇచ్చిపడేసింది శ్వేత దీనితో హౌస్ మేట్స్ అందరు క్లాప్స్ తో అప్రిసియేట్(Appreciate) చేసారు.
హమీద లోబో లకి కాస్త దురుసుగా రంగులు పూయడం తో హమీద హర్ట్ అయింది. హౌస్ మేట్స్(House mates) అంత ఇందాకా హ్యూమినిటీ(Humanity) గురించి మాట్లాడి ఇప్పుడు నువ్వు చేసిందేంటి అని అడగగా తన తప్పు తెలుసుకుని హమీదకి సారీ చెప్పిన శ్వేత. ఆ తరువాత షణ్ముఖ్ మీరు కరెక్ట్ కావచ్చేమోగానీ ఈ హౌస్‌కు కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. పైగా మీరు మాట్లాడుతున్న బూతులు వినలేకపోతున్నానంటూ ఉమాదేవిని, రియల్ క్యారెక్టర్‌ను చూడాలనుకుంటున్నానని జెస్సీని నామినేట్ చేశాడు.
కాజల్.. యానీ మాస్టర్, విశ్వను; జెస్సీ.. విశ్వ, లోబోను; శ్రీరామచంద్ర.. నటరాజ్ మాస్టర్, వంట రాదని అబద్ధం చెప్పావంటూ కాజల్‌ను నామినేట్ చేశారు.
దీంతో మరోసారి ఏడ్చేసింది కాజల్. ప్రియ.. సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ సన్నీని, ఆ తర్వాత నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. రవి.. ప్రియాంక సింగ్, శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. నామినేషన్ ప్రక్రియ ముగిసే టైం కి గద్ద(Eagle) టీమ్‌లో నుంచి ప్రియాంక, యానీ,లోబో, ప్రియ నక్క (Wolf) టీమ్‌లో నుంచి ఉమా, నటరాజ్, కాజల్, నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించారు.
ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్(contestants) నామినేట్(Nominate) అయ్యారు.
వీరిలో ఎవరు అవుట్ ఎవరు ఇన్ అయ్యారో చూడాలంటే వారం చివరి వరకు వెయిట్ చేయాల్సిందే .
మరి ఈ వారం ఎంత ఫన్ ఇవ్వన్నుతారో, ఎంత రచ్చ చేయనున్నారో మన హౌస్ మేట్స్.