ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ (IIT Delhi) నాన్ టీచింగ్(Non-Teaching) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ(Application Process) కొనసాగుతోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్(Official Website) https://home.iitd.ac.in/jobs-iitd/index.php ని సందర్శించడం ద్వారా పూర్తి సమాచారాన్ని పొందడంతో పాటు దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ(Last Date) మార్చి 20(March20), 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. భర్తీ చేయనున్న పోస్టులలో అసిస్టెంట్ రిజిస్ట్రార్(Assistant Register), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AAO), అకౌంట్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్(Accounts and Audit Officer), జూనియర్ ఇంజనీర్(Junior Engineer) మరియు ఇంజనీర్(Engineer) ఉన్నాయి.

పోస్టుల సంఖ్య: 89

వయోపరిమితి..

  • అసిస్టెంట్ రిజిస్ట్రార్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్(AEE) పోస్టులకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు.
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ జూనియర్ అకౌంట్స్ & ఆడిట్ ఆఫీసర్/ జూనియర్ ఇంజనీర్ సివిల్/ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్/ అప్లికేషన్ అనలిస్ట్(Application Analyst) పోస్టులకు గరిష్టంగా 35 సంవత్సరాలు.
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్/ అకౌంట్స్ & ఆడిట్ అసిస్టెంట్: గరిష్టంగా 30 సంవత్సరాలు.
  • సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టులకు గరిష్టంగా 55 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్ / ఇతర వెనుకబడిన తరగతి (OBC) / ఆర్థికంగా వెనుకబడిన విభాగం (EWS) అభ్యర్థులు గ్రూప్-A పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే.. రూ. 500 చెల్లించాలి.గ్రూప్ బీ, సీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి.
  • షెడ్యూల్డ్ కులాలు (SC) / షెడ్యూల్డ్ తెగలు (ST) / వికలాంగులు (PWD) / మహిళా అభ్యర్థులు(Women Candidates) ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.