కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు (Dhanush) తమిళ్‌లోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన ప్రతి తమిళ్ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తుండటం వల్ల టాలీవుడ్‌లో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక హిందీలోనూ డైరెక్ట్‌ గా రెండు మూడు చిత్రాల్లో నటించి పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ధనుష్ మొట్టమొదటిసారి తెలుగులో చేసిన స్ట్రెయిట్ చిత్రం ‘సార్’ (Sir). కార్పొరేట్ విద్యా వవస్థపై ఒక సాధారణ యువకుడి పోరాటం నేపథ్యంలో రూపొందిన సినిమాకు వెంకీ అట్లూరి(Venki Atluri) దర్శకత్వం(Direction) వహించారు.

సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి కలెక్షన్స్(Collections) ని రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై (OTT Release Date) అప్‌డేట్ వచ్చేసింది.

తమిళ్‌లో ‘వాతి’ పేరుతో విడుదలైన సార్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పామ్(OTT Platform) నెట్‌ఫ్లిక్స్‌ లో (Netflix) మార్చి 17(March 17th) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్ వెర్షన్స్ రెండు కూడా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఒకేసారి స్ట్రీమింగ్‌(Streaming)కు అందుబాటులోకి రానున్నాయి.

కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జబర్దస్త్ కమెడియన్ ఆది తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar)  మ్యూజిక్ అందించారు.

ఇదిలా ఉంటే ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్(Captain Miller)’ చిత్రంలో నటిస్తున్నాడు. సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి అరుణ్ మత్తేశ్వరణ్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే విడుదల కానుంది. ఇది కాకుండా తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula)తో ధనుష్ ఓ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే.

త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్‌ ను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌ మోహన్ రావు నిర్మిస్తున్నారు. దీంతో పాటు ‘రాయన్’ పేరుతో మరో సినిమా చేస్తున్నాడు. ఇందులో విష్ణు విశాల్, ఎస్‌జే సూర్య, కాళిదాస్ జయరాం, దుషార విజయన్ తదితరులు నటిస్తున్నారు.