బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) శనివారం బిగ్ బాస్(Big Boss) స్టేజి పై కి ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున శుక్రవారం నాటి ఎపిసోడ్(Episode) ని చూపించారు. సన్నీ తనతో గొడవపడి మాట్లాడకుండా ఉండటంతో కాజల్ ఫీల్ అయ్యి,  కన్నీళ్లు పెట్టుకోవడంతో ఓదార్చిన మానస్. సన్నీ దగ్గరకు వెళ్లి కాజల్‌తో మాట్లాడరా బాధపడుతుంది అని చెప్పాడు.

నేనేమైనా ఫిగర్‌నా మాట్లాడకపోతే ఏడ్వడానికి అని సన్నీ సెటైర్(Settaire) వేశాడు. ఇక సిరి టికెట్ టు ఫినాలే(Ticket to Finale) నేను  ఫస్ట్ ఫైనలిస్ట్(First Finalist) అవ్వాల్సింది.

నేను గెలిస్తే నాకు ఏ పాత వేసేవారో అని శ్రీరామ్‌తో ముచ్చట్లు పెట్టింది. మరో పక్క  సన్నీ, కాజల్, మానస్, ప్రియాంకలు ముచ్చట్లు పెట్టుకుంటారు.  ఇక సన్నీ ‘నీకు బిగ్ బాస్ వరం ఇస్తే ఏం అడుగుతావ్’ అని పింకీని అడిగాడు. విన్నర్ అవ్వాలని అడుగుతా అని చెప్పింది పింకీ. అది కాకుండా ఏమి అడుగుతావ్ ఆలోచించుకో ఆశాభంగం అని సన్నీ అనడంతో. ‘నాకేం అవసరం లేదు అలాంటివి ఇన్ని చూశాం అంటూ తన జుట్టుని తిప్పి మానస్ వైపు విసిరి మరీ చూపించింది ప్రియాంక.

మంచిగా అడిగినప్పుడు మంచిగా ఆన్సర్ చెప్పు అని సన్నీ అడగడంతో ‘సర్లే మానస్ విన్నర్ అవ్వాలని కోరుకుంటా అని చెప్పింది. ‘మాటి మాటికీ విన్నర్ దగ్గరకు ఎందుకు పోతావ్ విన్నింగ్ తప్ప ఇంకేం ఉండవు’ అని చెప్పింది ప్రియాంక. దీంతో అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు అంటూ డైలాగ్ (Dialogue) వేశాడు సన్నీ.

బిగ్‌బాస్‌(Big Boss) ఇంట్లో లెన్స్ కార్ట్(Lens kart) వారి స్పెక్ట్స్ తో  ర్యాంప్‌ వాక్‌(Ramp Walk) జరగ్గా, దీనికి శ్రీరామ్‌, సిరి జడ్జిలుగా వ్యవహరించారు. వీరిలో  కాజల్‌, షణ్నును విజేతలుగా ప్రకటించారు. తరువాత హౌస్ మేట్స్(House Mates) ని పలకరించిన నాగార్జున. అక్కడ సిరి లేకపోవడంతో ఏడుగురు ఉండాలి కదా అంటూ సిరి  వెతకడం పెట్టారు. అంతలోనే కుంటుకుంటూ లోపలి నుంచి వచ్చింది  సిరి.

ఆ తరువాత కంప్లైంట్ బాక్స్ టాస్క్ ఆడించారు నాగార్జున. ఒక్కొక్కరు పేర్లు పిలిచినప్పుడు వాళ్లు వచ్చి ఎవరి మీదనైతే కంప్లైంట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల ఫొటో తీసి కంప్లైంట్ బాక్స్‌ (Complaint Box)లో వేయాలని అన్నారు. మొదటిగా సన్నీ  వచ్చాడు. అయితే  లాస్ట్ 2 వీక్స్ సన్నీ సేఫ్(Safe) ఆడకు అంటు నాగ్ పంచ్ వేసాడు. సన్నీ, సిరి మీద కంప్లైంట్‌ ఇవ్వగా సిరి, మానస్‌- షణ్ను మీద, పింకీ  సన్నీ మీద ఫిర్యాదు చేశారు.

కాజల్‌ సన్నీ తన మనసు ముక్కలు చేశాడని ఆరోపించింది. రెండు రోజులుగా తాను చాలా బాధపడుతున్నానని తెలపడంతో సన్నీ అందరి ముందే ఆమెకు సారీ చెప్పాడు.

నాగార్జున తనకు కూడా హౌస్‌మేట్స్‌(House Mates) పై ఫిర్యాదు(Complaints)లు ఉన్నాయంటూ ముందుగా ప్రియాంకను సొంత వైద్యం వద్దని బిగ్‌బాస్‌ అంతగా చెప్పినప్పటికీ కాళ్లకు బామ్‌ రాసి హాట్ వాటర్(Hot water)  పోసి శ్రీరామ్‌ను నడవలేని స్థితికి తీసుకొచ్చావని ప్రశ్నించాడు.

నువ్వు డాక్టర్‌వి కాదని కాబట్టి ఇలా సొంత వైద్యం చేయొద్దని హెచ్చరించగా దింతో  పింకీ కన్నీరు పెట్టుకుంది. శ్రీరామ్‌ మీద కూడా ఫిర్యాదు ఉందన్నాడు నాగ్‌. నీ తరపున షణ్ను గేమ్‌ ఆడుతున్నప్పుడు అతడి మీద నమ్మకముంచాలని శ్రీరామ్‌కు సూచించాడు.

అలాగే మానస్‌ మీద కూడా ఓ ఫిర్యాదు ఉందన్న నాగ్‌, ఒక గేమ్‌(Game)లో నీకు నువ్వు 29 నిమిషాలు సరిగ్గా కౌంట్‌ చేసుకున్నప్పుడు సన్నీకి మాత్రం తప్పుగా ఎలా లెక్కించావని ప్రశ్నించాడు. అయితే మానస్‌ మాత్రం తాను అది కావాలని చేయలేదని చెప్పుకొచ్చాడు.

టికెట్‌ టు ఫినాలే టాస్క్‌ (Ticket to Finale)లోని ఐస్‌ బకెట్‌(Ice Bucket) ఛాలెంజ్‌(challenge)లో సన్నీ, సిరి ఇద్దరూ దొంగ ఆట ఆడారని నాగ్‌ వీడియోలతో సహా చూపించడంతో  అందరూ పగలబడి నవ్వారు. ఫోకస్‌ టాస్క్‌ (Focus Task)లో గట్టిగట్టిగా అరుస్తూ అందరినీ డిస్టర్బ్‌ చేయడం తప్పని కాజల్‌ని హెచ్చరించారు. తర్వాత శ్రీరామ్‌కు సన్నీ, షణ్ను చేతుల మీదుగా ఫస్ట్‌ ఫైనలిస్టు ట్రోఫీ(First Finalist Trophy)ని అందజేశారు.

ఆ తరువాత  హౌస్‌మేట్స్‌ (House mates)తో ఎమోజీ గేమ్‌(Emoji Game) ఆడించాడు నాగ్‌. ఈ గేమ్‌లో పంచ్‌, షటప్‌, కోపం ఎమోజీలతో ఉండే మూడు దిండ్లను ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ గేమ్‌లో శ్రీరామ్‌ సన్నీకి పంచ్‌ ఇవ్వగా కాజల్‌కు నోరు షటప్ ఎమోజీ ఇచ్చాడు. ప్రియాంక వల్ల నడవలేకపోతున్నానని ఆమె మీద కొంచం కోపం ఉందని కోపమా ఇమేజిని ఇచ్చాడు .

సన్నీ, ​కాజల్‌ కి షటప్‌, ఎమోజి(Emoji) ఇచ్చాడు . సిరి కి కోపం, షన్ను కి  పంచ్‌ ఎమోజి ఇస్తూ అతడు నవ్వితే బాగుంటుందన్నాడు. షణ్ను, కాజల్‌ మీద కోపంగా ఉందన్నాడు. సిరి తల మీద ఒక్క పంచ్‌ ఇస్తే ఆమె బ్రెయిన్‌ సరిగా పని చేస్తుందన్నాడు. ఉచిత సలహాలు(Free Advice) ఇవ్వకుండా నోరు మూసుకోమని ప్రియాంకకు సూచించాడు.  తర్వాత ప్రియాంక వంతు రాగా ఆమె సిరికి పంచ్‌ ఇచ్చింది.

సన్నీ మీద కోపంగా ఉందని పేర్కొంది. కోపంలో నన్ను ఏదైనా అనేస్తాడంటూ మానస్‌ను కాస్త నోరు మూసుకోమని చెప్పింది. ఇక మానస్‌, సిరి మీద కోపంగా ఉందంటూ సన్నీకి పంచ్‌ ఇచ్చాడు. కోపంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కొంచెం తగ్గించుకుంటే మంచిదని పింకీకి సలహా ఇచ్చాడు. కాజల్‌, శ్రీరామ్‌కు పంచ్‌ ఇవ్వగా షణ్ను మీద కోపంగా ఉందని తెలిపింది. నేను చెప్తున్నప్పుడు మాట్లాడకుండా నోరు మూసుకుని వినాలని సన్నీకి సెలవిచ్చింది. సిరి ఇంకోసారి నిన్నే  టార్గెట్‌ చేశానంటే కొడతానని, ఇంకో సారి ఆలా అన్నదంటూ సన్నీని నోరు మూసుకోమని హెచ్చరించింది . షణ్నుకు పంచ్‌ ఇచ్చింది. ప్రియాంక సింగ్‌ మీద కోపంగా ఉందని తెలిపింది.

గతంలో ఫ్యామిలీ మెంబర్స్‌ కోసం హౌస్‌మేట్స్‌(House mates) త్యాగాలు చేసిన వస్తువులను  నాగార్జున తిరిగిచ్చేయడంతో వాళ్లు తెగ సంతోషించారు. కానీ సిరి, ప్రియాంక త్యాగం చేసిన వస్తువులు మాత్రం తిరిగి రాలేదు. వీళ్లిద్దరి వస్తువులు కూడా తిరిగి రావాలంటే మిగతా హౌస్‌మేట్స్‌ త్యాగం చేయాలని ట్విస్ట్(Twist) పెట్టాడు నాగ్‌. బిగ్ బాస్(Big Boss) హౌస్ లో ఎవరు ఉండటానికి అర్హత ఉందనుకుంటున్నారో వారికే త్యాగం చేయాలన్నాడు. అందులో భాగంగా హౌస్‌మేట్స్‌ వాళ్ళ పర్సనల్ థింగ్స్ ని  తులాభారంలో పెట్టాలన్నారు.

సిరి, ప్రియాంకలలో ఎవరి వైపు ఎక్కువ బరువు తూగితే వారు త్యాగం చేసిన వస్తువు తిరిగొస్తుందన్నాడు. దీంతో సన్నీ, మానస్‌ పింకీకి సపోర్ట్‌(Support) చేయగా మిగతావాళ్లు సిరికి సపోర్ట్‌ చేశారు. తులాభారంలో సిరి వైపు ఎక్కువ బరువు తూగడంతో శ్రీహాన్‌ ఆమెకిచ్చిన గిఫ్ట్‌(Gift) తిరిగి వచ్చింది. ఈరోజు శ్రీరామ్‌ ని తప్ప మిగిలిన హౌస్ మేట్స్  ఎవరినీ సేవ్‌(Save) చేయలేదు నాగ్‌. మరి ఆదివారం ఎలాంటి ఫన్(FUN) తో ఆడియన్స్(Audience) ని అలరిస్తారో, ఎవరు ఎలిమినేట్(Eliminate) అయ్యి బిగ్ బాస్ హౌస్ విడిచి వెళ్తారో ఆదివారం ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే