అక్కినేని హీరోస్ లో ఒక్కరైనా సుశాంత్(Sushanth) తాజాగా ఓ అప్డేట్(UPDATE) తో మన ముందుకు వచ్చేశాడు. కాళిదాసు(Kalidasu) మూవీతో హీరో(Hero)గా టాలీవుడ్ ఎంట్రీ(Tollywood Entry) ఇచ్చిన యంగ్ స్టార్ సుశాంత్..

తను కెరీర్(Career)  మొదలుపెట్టిన తక్కువ సమయం లోనే  కరెంట్, అడ్డా, దొంగాట, అటాడు కుందాం..రా , చి౹౹ల౹౹సౌ౹౹ వంటి సక్సెస్  మూవీలతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

హీరోగా అవకాశాలు తగ్గడంతో అల వైకుంఠ పురములో..సినిమాతో మంచి క్లాస్ క్యారెక్టర్(Class Character) లో నటించి క్లాస్, మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు.

కరోనా టైం(Corona Time) లో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో మంచి సక్సెస్(Success) సాధించిన ఈ హీరో మరో అడుగు ముందు వేసి ఓటీటీ ఎంట్రీ(OTT Entry) ఇస్తున్నాడు .

ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్(Web Series Trend) నడుస్తుండడంతో వెబ్ సిరీస్ లో అద్భుతమైన కథకు గ్రీన్ సిగ్నల్(Green Signal) ఇఛ్చాడు సుశాంత్. ఏంతో ఆసక్తి కరమైన కథ సుశాంత్ కు నచ్చడంతో ఫస్ట్ టైమ్ ZEE5 వెబ్ సిరీస్ ను సెలెక్ట్ చేసుకున్నాడు సుశాంత్.

ప్రస్తుతం ZEE5 లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ను కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకం(Kolla Entertainments)పై ప్రవీణ్ కొల్లా(Praveen Kolla) నిర్మిస్తున్నారు. వరుడు కావలేను(Varudu Kavalenu) ఫేమ్ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య(Lakshmi Sowjanya) దర్శకత్వం వహిస్తున్నారు. అటు సినిమాల్లో నటిస్తూనే.. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. ఇటు వెబ్ మూవీస్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు సుశాంత్.

ఇక ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయిన సుశాంత్ ను ZEE 5 టీం గ్రాండ్ వెల్ కం చెపుతూ పోస్టర్(Poster) ను రిలీజ్ చేశారు. పోలీస్ జీప్ ముందు మఫ్టీ లో కూల్ గా నిల్చొని చూస్తున్న ఫోటో ను చూస్తుంటే..ఈ వెబ్ సిరీస్ లో ఒక పోలీస్ ఆఫీసర్(Police Officer) గా నటిస్తున్నాడని తెలుస్తుంది.

త్వరలో ఈ వెబ్ సిరీస్ గురించి పూర్తి వివరాలు(Full Details) తెలియజేస్తామని యూనిట్(Unit) చెప్పింది.