బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి జరిగే నామినేషన్(Nomination) ప్రక్రియ లో 5 మంది మానస్, సన్నీ, కాజల్, సిరి,రవిలు నామినేట్ అయ్యారు.

సిరి రవిలు వేసిన ప్లాన్ బెడిసి కొట్టి వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళే పడ్డారు. మరో పక్క సన్నీ, మానస్ కాజల్, పింకీల మీద పీకలలోతు కోపంగా వున్నారు.

ఇక జెస్సీ కి హెల్త్ ఇష్యూస్ ఉండడం తో బిగ్ బాస్(Big Boss) హౌస్ నుంచి బయటకు పంపారు.

మరి హౌస్ నుంచి  జెస్సీ వెళ్లిపోవడం తో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియాలంటే మంగళవారం ఎపిసోడ్ పై ఓ లుక్ వేయాల్సిందే…..

జెస్సీని కన్ఫెషన్‌(Confession) రూమ్‌లోకి పిలిచి అతడి ఆరోగ్యం గురించి ఆరా తీశారు బిగ్ బాస్(Big Boss). నీకు మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ అవసరమని, ఇందుకోసం బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నాడు.

దీంతో జెస్సీ బాధను  ఆపుకుంటూ ‘బిగ్‌బాస్‌ నా లైఫ్‌ అనుకున్నా, ఇంతవరకు వచ్చినందుకు హ్యాపీ’ అంటూ హౌస్ మేట్స్(House mates) కి ఇంటి మున్సి వెళ్ళిపోతునాతు చెప్పాడు జెస్సీ. జెస్సీ సడన్ గా  హౌస్‌ వదిలి వెళ్తాడని చెప్పగానే షణ్ముఖ్‌, సిరి వెక్కి, వెక్కి ఏడ్చారు.

సిరి అయితే అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని తలపై  ముద్దు పెట్టింది. జెస్సీ వెళ్లిపోయే ముందు చివరిసారిగా హౌస్‌మేట్స్‌ తో మాట్లాడుతూ నా ఆరోగ్యం బాగోలేనప్పుడు సన్నీ, మానస్‌, పింకీ, కాజల్‌, యానీ.. అందరూ పాంపరింగ్‌ చేశారంటూ బాధపడ్డాడు.

తన ఫ్రెండ్స్‌ షణ్ను, సిరి ఇద్దరు ఉన్నంతవరకు బిగ్‌బాస్‌ జర్నీ చూస్తానని చెప్తూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు లేకపోవడంతో తీవ్రంగా దుఃఖించిన సిరి జెస్సీ తిరిగొస్తాడేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది.

హౌస్ మేట్స్ బాధపడినంత సమయం కాకుండానే జెస్సీ సీక్రెట్ రూం(Secret room)లోకి వచ్చాడు. సీక్రెట్ రూంలోకి వచ్చిన జెస్సీ ‘నాకు మంచి హెల్త్ చెకప్(Health Check up) చేయించారు. నాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు హెల్త్ కండిషన్ ఒకే నేను ఇంకా గేమ్‌లోనే ఉన్నాను.

సీక్రెట్ రూంలో పెట్టినందుకు చాలా థాంక్స్ బిగ్ బాస్(Big Boss)’ అని చెప్పాడు జెస్సీ. మరోపక్క నామినేషన్స్‌(Nominations) ప్రభావంతో  ప్రియాంక సింగ్‌ మీద అలిగిన మానస్‌. ఆమె ఎంత నచ్చచెప్పినా అతడు వినిపించుకోవట్లేదు. నేనేమైనా తప్పు చేస్తే చెప్పంటూ బతిమాలినప్పటికీ మానస్‌ మాత్రం అసలు పట్టించుకోలేదు.

దీంతో పింకీ,మానస్‌ ఎందుకు మాట్లాడట్లేదో తెలియడం లేదని తెగ ఫీలైంది. ఇది విన్న కాజల్‌ నువ్వు  బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావ్ ? అని మండిపడింది. మనం గేమ్‌ ఆడటానికి వచ్చాం, మానసే నేరుగా వచ్చి మాట్లాడేదాకా వెయిట్‌ చెయ్‌, లేదంటే వదిలెయ్‌ అని సలహా ఇచ్చింది.

నామినేషన్స్‌ లో తన ఫ్రెండ్స్‌ సన్నీ, మానస్‌లను సేవ్‌ చేయనందుకు వారు మాట్లాడకపోవడంతో ఎంతగానో బాధపడింది కాజల్.

ఎలాగో ఈవారం ఎలిమినేట్‌(Eliminate) అవుతానని అటు కాజల్‌, ఇటు మానస్‌ ఎవరికి వారే అభిప్రాయపడ్డారు. అయితే మానస్‌ వెళ్లిపోతాడంటే తట్టుకోలేకపోయిన పింకీ అలా అనొద్దని బాధపడింది.

దీంతో ఫైర్ అయినా సన్నీ నువ్వు మాట్లాడే అధికారమే కోల్పోయావని తేల్చేశాడు. ఇక కాజల్‌ నామినేషన్స్‌(Nominatiosn) టైం లో వారిని సేవ్‌(Save) చేయకుండా నమ్మకాన్ని వమ్ము చేసినందుకు సారీ చెప్పింది. ఎప్పటిలా ఉందామని ఎన్నిసార్లు బతిమాలినా, ఎన్నిసార్లు సారీ చెప్పినా సన్నీ, మానస్‌ వినిపించుకోకపోవడంతో తను కూడా ఏడ్చేసింది.

ఇదిలా వుంటే జెస్సీని బయటకు పంపకుండా సీక్రెట్‌ రూమ్‌లో ఉంచాడు బిగ్‌బాస్‌(Big Boss). శ్రీరామ్‌, కాజల్‌ బాగా ఇన్‌ఫ్లూయెన్స్‌(Influence) అవుతుందని రవి తో చెప్తాడు. మరోపక్క మానస్‌ పింకీ ఇచ్చిన వస్తువులను తిరిగిచ్చేయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది.

రవి కోసం బంటులా పని చేస్తే మాత్రం పింకీని అస్సలు నమ్మనని తెగేసి చెప్పాడు. మరో పక్క  తాను, జెస్సీ, షణ్ను ముగ్గురం కంటెండర్‌ అవగానే కెప్టెన్‌(captain) అయ్యామని చెప్తూ ఉప్పొంగిపోయింది సిరి. కానీ నేను కంటెండర్‌ అవగానే నామినేట్‌(Nominate) అవుతున్నానని రవి అనగా ఎలిమినేట్‌(Eliminate) మాత్రం అవడం లేదు, అదే నా బాధ అని మనసులో మాట బయటపెట్టాడు షణ్ను.

తర్వాత సిరి అందరిముందే తన మీద జోకేసిందని తెగ ఫీలయ్యాడు షణ్ను వీళ్ళ మధ్య ఎదో ఒక సమయంలో ఇలాంటి గిలి కజ్జాలు మాములే.

క్లోజ్‌ ఫ్రెండే జోకేస్తే తీసుకోని షణ్ను రవి జోక్‌ చేస్తే ఊరుకుంటాడా? అందరి ముందు తన డ్యాన్స్‌ ను ఇమిటేట్‌(Immitate) చేయడంతో బాగా హర్టయ్యాడు. ఇలాంటి వెకిలి జోకులను తాను తీసుకోలేనని ముఖం మీదే చెప్పాడు. పింకీ  నన్ను గెలికింది, ఇక ఎలా ఉంటుందో చూడని సిరితో చెప్పుకొచ్చాడు. ఇలా చనువు తీసుకుని అతి చేస్తారనే మనుషుల్ని దూరం పెడతానని తెలిపాడు.

సన్నీ, మానస్‌ల పోరుతో ఆలోచనలో పడ్డ కాజల్‌,షణ్నును సేవ్‌(Save) చేయకుండా నన్నెందుకు సేవ్‌ చేశావని శ్రీరామ్‌ను అడిగింది. దీంతో అతడు మనిద్దరి మధ్య గొడవకు ముగింపు పలకడానికే చేశానని చెప్పుకొచ్చాడు. మరో వైపు పింకీ భోజనం ప్లేట్ పట్టుకుని మానస్ దగ్గరకు వెళ్ళింది. ముద్దు కావాలా? ముద్దా కావాలా అని అడిగితే మానస్ ముద్దే కావాలన్నాడు. దీంతో దొరికిందే ఛాన్స్ అని ముద్దులిచింది. మొత్తానికి మానస్ కొప్పని ముద్దులతో కరిగించేసింది పింకీ.

జెస్సీ ని సీక్రెట్ రూమ్ కి పంపడం కేవలం షో యొక్క టిఆర్పిTRP) రేట్ ని పెంచుకోవడానికి బిగ్ బాస్(Big Boss) ఆడే స్ట్రాటెజియేమో అనిపిస్తుంది.

ఇది వరకు లోబోని  సీక్రెట్  రూమ్ కి పంపిన అది పెద్ద గా ఆకట్టుకోలేదు. ఆ తరువాత గార్డెన్ ఏరియాలో ఓ బౌల్ కేక్ దానితో పాటు ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి వుంది??? అని రాసివుంది.

హౌస్ మేట్స్(Housemates) అందరు నాకంటే నాకు అర్హత  వుంది అని చెపుతారు. మరి బిగ్ బాస్ ఆ కేక్ తో ఏ గేమ్ ప్లాన్ చేసారో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే…..