బిగ్ బాస్ సీజన్ (Big boss season 5) లో రోజు రోజుకి గొడవలు ,కొట్లాటలు  మరి తారాస్థాయి కి చేరుతోంది. మొదటి రోజు నుంచే  హౌస్ మేట్స్ నోటీ కి పనిచెప్తున్నారు. ఎవరిని కదిలించిన బూతుపూర్ణాలు ,లేదా అగ్గిమీద గ్గుగిలం అయ్యిపోతున్నారు. వీళ్ళ మధ్య జరిగే గొడవలు చూస్తుంటే గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో హౌస్ మేట్స్(House mates) అందరు ఊర మాస్ గా వున్నారు.  ఇక టాస్క్ ఆడమంటే ఫిసికల్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోయింది. ఇంత జరుగుతున్న బిగ్ బాస్ ఏమి పట్టనట్టు ఉండడం విశేషం. బిగ్ బాస్ స్ట్రాటజీస్  ఏంటో అర్ధం కావట్లేదు. కానీ  ఆడియన్స్ కి అయితే హౌస్ మేట్స్ చేసే రచ్చ బాగానే ఆకట్టుకుంటుందనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడుతున్న గేమ్ రణ రంగగానే తలిపిస్తోంది. మరి ఆడవాళ్లు అయితే ఒక్కప్పటి  విధి కొళాయిల దగ్గర కొట్టుకునే వాతావరణాన్ని గుర్తుచేస్తున్నారు.

సెప్టెంబర్  15 వ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే..

ఇక  ‘సాగరా సోదరా’ టాస్క్‌ లో నక్క టీమ్ సభ్యులు ఎక్కువగా సాగదీసి నిలబడ్డారు. ఎల్లో టీం 33.3 మీటర్స్‌ మీద ఉండగా, బ్లూ టీం 33 మీటర్స్ పొడువు ఉండగలిగారు. రెండు పక్కల  లెక్కలు తీసుకున్నాక మానస్‌ ఓకే అనడంతో చివరి క్షణంలో శ్వేత కిందపడిపోయింది. అయితే అప్పటికే టాస్క్‌ అయిపోయింది కాబట్టి అది పరిగణనలోకి తీసుకోరని మానస్‌ టీమ్‌ ఎంత వారించినా అవతలి టీమ్‌ ఒప్పుకోలేదు.

ఈ ఆర్గుమెంట్స్ వల్ల సంచాలకులు ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో టాస్క్‌ రద్దు చేస్తున్నట్లు బిగ్‌బాస్‌(Big boss) వెల్లడించారు.

దీంతో శ్రీరామచంద్ర  ఎగ్జయిట్‌మెంట్‌ తో డ్యాన్స్‌ చేశాడు. అతడి ప్రవర్తనకు ఇర్రిటేట్అయినా రవి టాస్క్‌ రద్దయినందుకు సిగ్గు పడాలి అని అన్నడంతో సిగ్గు మీకు, కానీ మాకవసరం లేదు అని గట్టి కౌంటరిచ్చింది ప్రియ.

ఆ తర్వాత గేమ్ మళ్ళీ మొదటినుంచి ఆడాలని బిగ్ బాస్ తెలపడం తో, మళ్లీ ‘పంతం నీదా నాదా’ టాస్క్‌(Task) మొదలు కాగానే  ఎల్లో టీమ్‌ రెచ్చిపోయి ఆడింది. ఈ క్రమంలో శ్వేత కొట్టిందని సిరి వాదించడంతో, చిరెత్తిన  ప్రియ.. సాయంత్రం కాగానే ఆమెకు దెయ్యం పూనుతుందని మండిపడింది. టాస్క్‌ కు బ్రేక్‌ ఇచ్చిన తర్వాత యాంకర్‌ రవి.. శ్రీరామచంద్రతో ఉన్న గొడవను క్లియర్ చేసుకుందామని చూశాడు. కానీ అతడితో మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడని శ్రీరామ్‌.. సేఫ్‌ గేమ్‌ ఆడుకో, నాతో మైండ్‌ గేమ్‌ ఆడకు అని అరిచాడు.

మరుసటి  రోజు  మానస్‌-శ్రీరామ్‌ మధ్య కూడా హీట్ డిస్కషన్ జరిగింది. మానస్‌ను ఏజ్ ఎంత అని  అడిగాడు శ్రీరామ్‌. అతడు 28 అని చెప్పాడు. ఇప్పటికీ చిన్నపిల్లోడివే, నీకు మెచ్యురెటీ లేదు,  అందుకే నీ ఏజ్‌ అడిగా, అని  సింగర్‌ శ్రీరామ్ అనడంతో, మీకు ఏజ్‌ పెరిగినా మెచ్యురెటీ లేదని రివర్స్‌ కౌంటరిచ్చాడు మానస్‌. మరోవైపు లోబో తన ఇంటిని గుర్తు చేసుకుని ఏడ్చేశాడు. తనకేమైనాయితే  తన వాళ్లను చూసుకునే వాళ్లెవరూ లేరని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా? టాస్క్‌ మొదలైంది. ఇందులో లోబో లేకుండానే గద్ద టీమ్‌ గెలిచింది . దీంతో వారికి ఒక ఫ్లాగ్‌(Flag) వచ్చింది.

పంతం నీదా నాదా

ఆ తరువాత  ‘పంతం నీదా నాదా’ టాస్క్‌ తిరిగి మొదలైంది.. ఇందులో ​ పింకీ సన్నీ ని అప్పు ప్రయత్నం చేయగా అనుకోకుండా సన్నీ పింకీ చేయిని విసిరేయడంతో ఆమె కిందపడిపోయింది. అది చూసిన శ్రీరామ్‌.. పగిలిపోద్ది అని సన్నీని తిట్టాడు. తన మీద నోరు జారినందుకు సన్నీ ఆవేశపడుతుండగా.. మగాడివైతే ఆడుదువు రా అంటూ అతడిని మరింత రెచ్చగొట్టింది ప్రియ. పర్పుల్‌ టీమ్‌ మీద పడి పిల్లోస్‌ తీసుకోవాలని చూసిన ఉమాదేవిని ప్రియ ఓ వస్తువుతో కొట్టింది.ప్రతి దానికి కయ్యానికి కాలు దువ్వే ఉమా కొడితే ఊరుకుంటుందా వాళ్ళ అంతు చూడనిదే వెనుతిరగదు.  తన మీద చేయి చేసుకున్న ఆ టీమ్‌ సభ్యులను ఎటాక్ చేసింది ఉమా .

తనను కొడితే డ్రెస్సు చింపుతానని ఉమా అనడంతో యానీ మాస్టర్‌ రెచ్చిపోయింది. చింపుతా రా చింపు అంటూ, ఒసేయ్‌ ఉమా, సిగ్గు లేదా, తూ అని చీదరించుకుంది.

మరోపక్క పర్పుల్‌ టీమ్‌ దగ్గరకు వచ్చిన శ్వేతను తన్నేందుకు ప్రయత్నించిన  ప్రియ.

రక్తాలు వచ్చేలా కొట్టుకు చస్తున్నా పట్టించుకోని బిగ్‌బాస్‌(Big boss) అంతా అయిపోయాక మాత్రం హౌస్‌లో హింసకు తావు లేదంటూ వార్నింగ్ ఇవ్వడం విశేషం .

ఈ టాస్క్‌ పూర్తయ్యే టైం కి  రెండు టీమ్స్‌ దగ్గరా 11 బెటాన్స్‌ ఉండటంతో రెండు  టీమ్స్‌ కు ఐదు జెండాలు ఇచ్చాడు  బిగ్‌బాస్‌(Bigboss).  ఇక  టాస్క్ పూర్తయ్యాక స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర కూర్చున్న శ్రీరామ్‌ హమీదాకు మసాజ్‌ చేశాడు.

ఈ సందర్భంగా హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, కానీ అంతలోనే మళ్లీ దూరంగా ఉండాలనిపిస్తుంది అని మనసులోని మాట చెప్పింది. ఈ మాటలకూ ఇంప్రెస్స్ అయినా శ్రీరామ్‌.. ఇంకెవరైనా గుర్తొస్తే మాత్రం ఎవరి దగ్గరా ఉండకూడదు అని సెట్టైర్  ఇవ్వడంతో ఫక్కున నవ్వేసింది హమీదా.

చూస్తుంటే ఇంట్లో గొడవలు, రచ్చలే కాకుండా రొమాన్స్ కి కూడా చాన్సెస్ వున్నాయనే అనిపిస్తుంది.

ఈ కోణంలో  కూడా హౌస్ మేట్స్ ఆడియన్స్  ని అలరించున్నారేమో రాన్నున్న రోజుల్లో….