తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు(Notifications) రిలీజ్  చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవల జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(JL) ఉద్యోగాల బర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

అర్హత(Qualified), ఆసక్తి(Interested) కలిగిన అభ్యర్థులు ఆఫీషియల్ వెబ్ సైట్(Official Website) https://www.tspsc.gov.in/ద్వారా డిసెంబర్ 20, 2022 నుంచి జేఎల్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్(Application Process) మొదలు కానుంది. అంటే రేపటి నుంచి దీనికి సంబంధించి అప్లికేషన్ స్వీకరణకు ఆఖరి తేదీ(Last Date) జనవరి 10, 2023 వరకు ఉంటుంది.

పోస్టుల వివరాలు

జూనియర్ లెక్చరర్ పోస్ట్లు ఇది వున్నాయి. అరబిక్ , బోటనీ , బోటనీ (ఉర్దూ మీడియం), కెమిస్ట్రీ , కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం), కామర్స్ , కామర్స్ (ఉర్దూ మీడియం), ఎకనామిక్స్, ఎకనామిక్స్ (ఉర్దూ), ఇంగ్లీష్ , ఫ్రెంచ్, హిందీ, హిస్టరీ, హిస్టరీ (ఉర్దూ మీడియం), హిస్టరీ (మరీఠీ మీడియం), మ్యాథ్స్, మ్యాథ్స్ (ఉర్దూ మీడియం), ఫిజిక్స్ , ఫిజిక్స్(ఉర్దూ మీడియం), సాంస్క్రీట్(Sanskrit), తెలుగు , ఉర్దూ, జువాలజీ , జువాలజీ (ఉర్దూ మీడియం) వంటి విభాగాల్లో జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత వివరాలు

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ(PG)(ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం) సెకండ్ క్లాస్ పూర్తి చేసి ఉండాలి. లేదా బీఏ ఆనర్స్, బీఎస్సీ ఆనర్స్ లేదా బీకాం ఆనర్స్ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

ఉర్దూ(Urdu) మీడియం, మారాఠీ(Marathi) భాషలకు సంబంధించి సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తగరతి(10th) వరకు మరాఠీ, ఉర్దూ భాషలో చదువుకొని ఉండాలి. లేదా మొదటి భాషగా ఉర్దూ/ మరాఠీ పదో తరగతి లో చదువుకొని ఉండాలి. దీంతో పాటు.. ఉర్దూ/మరాఠీ సెకండ్ భాష గా బ్యాచ్ లర్ డిగ్రీ(Bachelor Degree) పూర్తి చేసి ఉండాలి.

సివిక్స్ లో జూనియర్ లెక్చరర్స్..

సివిక్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పొలిటికల్ సైన్స్(Political Science) లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(Public Administration) లో 50 శాతం మార్కులతో పీజీ(PG) పూర్తి చేసి ఉండాలి. సివిక్స్ (ఉర్దూ మీడియం),సివిక్స్ (మారాఠీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తగరతి వరకు మరాఠీ, ఉర్దూ భాషలో చదువుకొని ఉండాలి. లేదా మొదటి భాషగా ఉర్దూ, మరాఠీ పదో తరగతి లో చదువుకొని ఉండాలి. దీంతో పాటు.. ఉర్దూ/మరాఠీ సెకండ్ భాష(Second Language) గా బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం..

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. అప్లికేషన్ ఫర్ ది జూనియర్ లెక్చరర్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
  • ఇక్కడ అభ్యర్థి యొక్క టీఎస్పీఎస్సీ ఐడీ(TPSSC ID) తో పాటు.. పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ(OTP) మీ రిజిస్టర్డ్(Registered) మొబైల్ నంబర్ కువెళ్తుంది.
  • ఇక్కడ మీ ఓటీపీని ఎంటర్ చేయగానే అప్లికేషన్ పారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలతో పాటు అర్హతకు సంబంధించి వివరాలను నింపాలి.
  • చివరగా అభ్యర్థి యొక్క వివరాలను సరిచూసుకొని.. దరఖాస్తు ఫీజు(Application Fee)ను చెల్లించాలి. చివరకు సబ్ మిట్(Submit) ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోండి. దీనిని ప్రింట్ తీసుకుంటే భవిష్యత్ అవసరాల(Future Reference)కు ఉపయోగపడుతుంది.

ఇప్పటికే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫాం లింక్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉండగా డిసెంబర్ 20 నుంచి యాక్టివేట్(Activate) కానుంది.