శివ(Shiva) అంటే మంగళం(Mangalam) అని అర్ధం, పరమ మంగళకరమైనది శివ స్వరూపం, ఆ పరమ శివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగా మహా శివరాత్రి. పురాణా(Puranas)ల్లో చెప్పినట్టు వంటి ఈ మహా శివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘ మాసం కృష్ణ పక్షం(Krishna Paksham)లో చతుర్దశి(Chatrudasi) నాడు జరుపుకుంటాం.

శివ రాత్రి(Shivaratri) అంటే మంగళకరమైన, శుభప్రదమైన రాత్రి. చీకటి అజ్ఞానానికి సంకేతం కదా, మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తన వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన(Knowlegde) వెలుగు జ్యోతకమవుతుంది, అందుకే అది శివరాత్రి.

మహా శివరాత్రి ప్రతి మాసంలోను అమావాస్య(Amavasya)కు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి పిలుస్తారు. మాఘ(Magha) మాసం లో వచ్చే మాస శివరాత్రిని మహా శివరాత్రి అని పిలుస్తారు. మార్గశిర(Margasira) మాసంలో బహుళ చతుర్థి, అర్ద నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది.

శివునికి అతి ఇష్టమైన తేదీ అది. అందుకే ఈ రోజున శివుని లింగాత్మకంగా ఆరాధించిన వారు ఎవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజు శివ ప్రతిష్ట చేసిన లేక శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం. మహా శివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి(KumaraSwamy) కన్నా ఇష్టులవుతారని శివుడు చేప్పటాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

శివరాత్రి విశిష్టత(Importance)ను శివుడే స్వయంగా పార్వతి దేవి(Parvathi Devi)కి వివరించారు. మాఘమాసంలో పద్నాలుగో రాత్రయినా అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది ఈ దినమున కేవలం ఉపవాసం చేయటమే ఎన్నో స్నానములు, దానములు, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.

మణులకన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలు ఉపవాసం(Fasting) ఉండి రాత్రి నాలుగు జాములలో నాకు అభిషేకం(Abhishekam) చేయాలి మొదటి జాము పాలతోనూ, రెండో జాము పెరుగుతోను, మూడవ జాము నెయ్యితోనూ, నాలుగోవ జాము తేనె తో చేస్తే ఎంతో ఫలితం. మర్నాడు ఉదయమున సాధువులకు ఆహారం సమర్పించి పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుని తరువాత ఉపవాసాన్ని చాలించాలి.

ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు అని తెలిపాడు. ఈ రోజు స్వామి జ్యోతిర్లింగ(Jyothirlingam) రూపంలో సేవించడం ఆనవాయితీ. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసం ఉండి శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. శివుడు సన్యాసమూర్తి అందుకే సన్యాస దీక్షను స్వీకరించేవారు, ఈ రోజున దీక్ష తీసుకుంటారు. ఉపవాసం అనగా దగ్గర నివసించడం, ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం.

పురాణాల ప్రకారం శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగరణ చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. పత్రం, పుష్పం, ఫలం వీటిలో ఏది సమర్పించిన పరమ శివుడు స్వీకరిస్తారు. భక్తి శ్రద్దలతో తనను కొలిచే భక్తులను అనందంగా అనుగ్రహిస్తాడు. అసలు ఈ శివరాత్రిని ఎందుకు జరుపుకుంటామో అనేది మనము ఓ సారి తెలుసుకుందాం.

అమృతం(Amrutham) కోసం దేవదానవులు క్షీరసాగర మధనం(KsheeraSagara Madanam) చేసారు. అప్పుడు అమృతం కంటే ముందు అలాహాలం పుట్టింది. ఆలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులు అందరు భయాందోళన చెందారు. ఆలాహలం బారిన నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడుని శరణు వేడారు.

లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడు అయ్యాడు. ఆలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలి నీలంగా మారటంతో నీలకంఠుడిగా పేరుపొందారు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించ సాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవటానికి క్షీరసాగర మధనంలో పుట్టిన చంద్రుడి(Moon)ని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోసమానం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుణ్ణి ఆలాహలం(Poison) తాపం ఇబ్బంది పెడుతూనే వుంటుందట. అందుకే భక్తులు నిత్యం శివ లింగానికి అభిషేకాలు చేస్తువుంటారు.

ఆలాహలం మింగినపుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిల్లడంట, ఆందోళన చెందిన దేవతలు శివునికి మెలుకవ వచ్చే వరకు జాగరణ చేసారంట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహా శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం(Fasting) చేసి జాగారం వుంటారు. జాగారం వున్నా సమయంలో శివనామ సంకీర్తనల(Sankeerthanas)తోను, జపధ్యానాలతోను కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహా శివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. శివారాధనలో మూర్తి రూపం, లింగరూపంలోను పూజిస్తారు లింగ రూపమే ప్రధానమైనది.

ప్రతి లింగంలోను శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి, ఈ శివరాత్రి రోజు రాత్రి శివ కళ్యాణం(Shiva Kalyanam) కూడా జరుగుతుంది. ఈ కల్యాణంలో పాల్గొనడం కూడా మహా భాగ్యంగా భావిస్తారు భక్తులు.