జేఈఈ మెయిన్‌ (JEE Main) సెషన్‌ 2(Session 2) పరీక్ష ఫలితాలు ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 29న JEE Main 2023 ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ కీ(Final Key) ని జాతీయ పరీక్షల మండలి (NTA) ఈ రోజే విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ జాతీయ మీడియా(National Media)లో వార్తలు వస్తున్నాయి. అయితే ఫలితాల విడుదల పై NTA మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫలితాలు విడుదలైన తరువాత అభ్యర్థులు(Candidates) ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌(Official Website) https://jeemain.nta.nic.in/ లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోర్‌(Score) చెక్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు JEE Main Session- 2 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రాథమిక కీ(Primary Key)ని విడుదల చేసిన అధికారులు ఏప్రిల్‌ 21 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. తొలి విడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు(Application) చేసుకోగా.. 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా (పేపర్‌-1, 2) వారిలో దాదాపు 9 లక్షల మంది వరకు పరీక్షకు హాజరైనట్టు సమాచారం.

ఈ నెల 30 నుంచి అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం:

జేఈఈ అడ్వాన్స్‌డ్‌(JEE Advanced) పరీక్షకు ఏప్రిల్‌ 30 నుంచి ఆన్‌లైన్‌(Online) దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు మే 8వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్‌ 4వరకు అడ్మిట్‌ కార్డులు(Admit Cards) డౌన్‌లోడ్‌(Download) చేసుకోవచ్చు. పరీక్ష జూన్‌ 4న జరుగనుంది. పేపర్‌- 1 ఉదయం 9 నుంచి 12 వరకు పేపర్‌- 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది. ఇక జూన్‌ 18న ఫలితాలు(Results) విడుదలకానున్నాయి.