బిగ్ బాస్ సీజన్ 5 (Big boss season 5) లో సండే ఫండే ఎంటర్టైన్మెంట్ ఈ వారం నవరాత్రి స్పెషల్ తో  ప్రేక్షులను టీవీల ముందు కట్టిపడేసింది ఈ షో.

ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ రోజు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్(Big Boss) నుంచి ఒక్కరు బయటకు వెళ్లే టైం కూడా వచ్చేసింది. సాధారణం గా పండగా అంటే అందరు కుటుంబం తో చేసుకుంటారు. కానీ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ మాత్రమే చేసుకుంటారు.

అయితే ఈ దసరా పండు(Dasara)గా రోజు హౌస్ మేట్స్ కి  బిగ్ బాస్ బోలెడన్ని సర్ప్రైజ్ లు  ఇచ్చారు. తొమ్మిది మంది ఈ వారం ఎలిమినేషన్ లో నామినేట్ అవ్వగా అందులో ఒక్కరిని ఎలిమినేట్ చేసి మిగిలిన వారి సేవ్ చేయాలిసి వుంది.

అలాగే గత నెల రోజులు గా కంటెస్టెంట్స్ వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ కి దూరం గా వుంటున్నారు కాబట్టి కంటెస్టెంట్స్ వాళ్ళ  ఫామిలీ మెంబెర్స్ మాట్లాడిన వీడియో  చూపించి సర్ప్రైజ్ చేసారు.

ఆ వీడియో లు చుసిన హౌస్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు. దాంతో పాటు కొంతమంది గెస్ట్స్ హౌస్ మేట్స్(Housemates) ని ప్రేక్షకులను తమ ఆటపాటల్లో అలరించారు. ఆ హై లైట్స్ ఇక్కడ చూద్దాం.

నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌లో నాగ్‌ ట్రెడిషనల్ పంచెకట్టులో అదిరిపోయాడు. నాగ్ కు ఏ  మాత్రం తీసిపోకుండా సూపర్ గా రెడీ అయినా కంటెస్టెంట్స్ .

సండేను స్పెషల్‌డేగా మార్చేందుకు స్టేజీ మీదకు విచ్చేసిన నాగ్‌.. మగాళ్లందరూ బంగార్రాజులాగా, ఆడాళ్లందరూ సత్యభామల్లా ఉన్నారంటూ  హౌస్ మేట్స్(House mates) కి కంప్లిమెంట్ ఇచ్చారు.

నవరాత్రి(Navaratri) సందర్భంగా 9 ఆటలు, 9 అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ గేమ్స్ ఆడడానికి హౌస్ మేట్స్ ని ఏ టీమ్‌లో రవి, హమీదా, శ్వేత, సన్నీ, షణ్ముఖ్‌, ప్రియాంక, లోబో, యానీ ఉండగా మిగిలినవారు బి టీమ్‌లో ఉంటారు.

ముందు గా ఈ టీంల  మధ్య రింగ్‌ ఫైట్‌ పెట్టారు. ఇందులో సన్నీ, సిరి గెలవడంతో వారికి ఫ్యామిలీ వీడియో చూపించారు. లోబో తన కూతురు మాట్లాడిన వీడియో చూడగానే చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. తర్వాత జెస్సీ తల్లి తో మాట్లాడించారు.

తర్వాత రెండు టీమ్‌లు చెరో స్కిట్‌తో మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఈ గేమ్‌లో రవి టీమ్‌ గెలవగా అతడు మరోసారి పాలపిట్ట అవార్డు అందుకున్నాడు.

ఈ సందర్భంగా అతడి టీమ్‌లోని యానీ మాస్టర్‌కు ఆమె తల్లి మాట్లాడిన వీడియో చూపించారు. దీంతో యాని మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఆ తరువాత హెబ్బా పటేల్‌ నా తప్పు ఏమున్నదబ్బా అంటూ డ్యాన్స్‌ తో అదరగొట్టింది..

తర్వాత కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్‌(Big boss) బాక్స్ లు పంపించాడు. ఎవరికి ఎక్కువ స్వీట్లు వస్తే వారే గెలిచినట్లు అని చెప్పాడు. రవి టీమ్‌లోని హమీదాకు పూతరేకులు, పింకీ, షణ్ముఖ్‌లకు స్వీట్లు రావడంతో  ఏ టీమ్‌ గెలవగా మరోసారి వారు పాలపిట్ట అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా యాంకర్‌ రవి భార్య, కూతురు మాట్లాడిన వీడియో ప్లే చేయడంతో అతడు ఎమోషనల్‌ అయ్యాడు. తర్వాత నాగార్జున రెండు టీములను కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఈ ఆటలో  ప్రియ టీమ్‌ గెలవడంతో ఆమె టీమ్‌లోని విశ్వకు అతడి ఫ్యామిలీ మాట్లాడిన వీడియో చూపించారు. తరువాత  నాట్యం సినిమా హీరోయిన్ సంధ్యారాణి తన స్పెషల్‌ పర్ఫామెన్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేసింది.

తరువాత  కడవ మీద కడవ ఎత్తుకుని నడిచే టాస్కులో కాజల్‌ గెలిచింది. దీంతో బి టీం మరోసారి అవార్డు గెలుచుకోవడం తో ప్రియా కు  ఆమె కుమారుడు మాట్లాడిన వీడియో చూపించారు. తర్వాత హౌస్‌మేట్స్‌(House mates) బతుకమ్మ పేర్చి ఆడారు.

బతుకమ్మ అందంగా పేర్చి ప్రియ టీమ్‌ అవార్డు  గెలిచింది. దీంతో కాజల్‌కు ఆమె కూతురు మాట్లాడిన వీడియో చూపించారు. అటు మంగ్లీ మాస్‌ పాటలు పాడి అందరినీ ఓ ఊపు ఊపేసింది. ఈ షో కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వచ్చిన హైపర్‌ ఆది కంటెస్టెంట్లు అందరినీ ఓ ఆట ఆడేసుకున్నాడు.

హమీదా వాకిట్లో శ్రీరామ్‌ చెట్టు అనే ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నారంటూ వాళ్లిద్దరి మీద జోకేశాడు ఆది. నాగ్‌ తాకిన షర్ట్‌ ను అంత అపురూపంగా చూసుకున్నావు, మరి నన్ను హగ్‌ చేసుకున్నారు. నన్నేం చేస్తావంటూ పంచ్‌ వేశాడు.

జెస్సీని, సిరిని కాపాడటానికే షణ్ముఖ్‌ పుట్టాడని కౌంటరిచ్చాడు. ఈ ముగ్గురు మిగతావాళ్లతో కూడా కలిసి ఆడితే బాగుంటుందని సెలవిచ్చాడు. ఆ తరువాత స్విమ్మింగ్‌పూల్‌లో ఎక్కువ సేపు వుండాలంటూ టాస్క్ ఇచ్చిన నాగ్ . ఈ  టాస్క్‌లో బి టీమ్‌ నుంచి విశ్వ గెలిచాడు. దీంతో అదే టీమ్‌లోని సిరికి ఆమె అమ్మ మాట్లాడిన వీడియో చూపించారు.

తర్వాత బొమ్మను అందంగా ముస్తాబు చేయాల్సిన టాస్క్‌ లో ప్రియ టీమ్‌ గెలిచి మరోసారి పాలపిట్ట అవార్డు సొంతం చేసుకుంది .దీంతో ఆ టీమ్‌లోని హమీదాకు ఆమె ఫ్యామిలీ మాట్లాడిన వీడియో చూపించారు.

మొత్తం ఆడిన 8 గేముల్లో ప్రియ 6 గెలవగా రవి 2 గెలిచాడు. తర్వాత స్టేజీ మీద సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ టీమ్‌.

హీరో అఖిల్‌.. తనతో పాటు వచ్చిన పూజా హెగ్డేను ఇంప్రెస్‌ చేయమని ఇంట్లోని మగవాళ్లకు టాస్క్‌ ఇచ్చాడు.

దీంతో శ్రీరామ్‌ పాట పాడగా, సన్నీ మిమిక్రీ చేశాడు. షణ్ముఖ్‌ మాత్రం సింగిల్స్‌ కోసం స్కిట్‌ వేశాడు. జెస్సీ, మానస్‌ డ్యాన్స్‌తో ఇంప్రెస్స్ చేసారు. కానీ పూజా మాత్రం.. తను అఖిల్‌కే పడిపోయానని చెప్పింది.

అయితే ఈ గేమ్‌లో మానస్‌ గదరికంటే బాగా డాన్స్ చేసాడని  తెలిపాడు నాగ్‌. దీంతో మానస్‌కు ఫ్యామిలీ వీడియో చూపించారు.

9మందిలో చివరగా విశ్వ, హమీదా మిగలగా వీరిలో నుంచి హమీదా ఎలిమినేట్‌(Eliminate) అయినట్లు వెల్లడించారు. దీంతో శ్రీరామ చంద్ర ఎమోషనల్(Emotional) అయ్యాడు.

ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన హమీద కంటెస్టెంట్స్ కి హౌస్ లో ఎలా ఉండాలో చెప్పింది. అయితే హమీద కోసం పాత పాడిన శ్రీ రామ్. నా హృదయంలో నిదురించే చెలి అంటూ శ్రీరామచంద్ర పాడిన పాటకు హమీద భావోద్వేగానికి లోనైంది.