నీరు త్రాగకుండా ఎవరైనా వుండగలరా? ఎవరు ఉండలేరు.

మనకు నిత్యం కావలసిన ప్రాథమిక అవసరాల్లో నీరు (Water) కీలక పాత్ర పోషిస్తుంది. కొంతమంది నీటిని అదే పనిగా తాగుతూ కనిపిస్తారు. మరి కొంత మంది నీటిని చాలా తక్కువ గా తాగుతారు. అయితే శరీరతత్వాన్ని బట్టి నీటిని  రోజు తగినంత తీసుకుంటే పలు వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.

మానవ శరీరం (Human Body)  70 శాతం నీటితో నిండి ఉంటుంది. మన మెదడు ఇంకా గుండె 73 శాతం, ఊపిరితిత్తులు 84 శాతం, చర్మం (Skin) 64 శాతం ఆఖరికి మన ఎముకలు (Bones)  కూడా 31 శాతం నీటి తో నిండి ఉంటుంది.

దీని బట్టే అర్ధమవుతుంది, మనం బ్రతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి,నీరు మన శరీరానికి ఎంతో అవసరమని.

అయితే  మన శరీరానికి సరిపడా నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, నీటిని త్రాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే నీటి యొక్క ఉపయోగాలను మరింత పెంచుకునేందుకు పాటించవలసిన అలవాట్లను  తెలుసుకుందాం.

మనం ఆరోగ్యం (Healthy)  గా ఉండాలంటే మంచి నీరు ఎంతో అవసరం. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని  బట్టి మంచి నీరు అవసరం అవుతుంది.

అయితే చాలా మందిని వెంటాడే ప్రశ్న ఏంటంటే రోజుకు ఎంత నీరు తాగాలని. నీరు తాగే సమయం, సందర్భం అవసరం.

శరీరం లో ప్రధానమైన రసాయనం కూడా నీరే. అది వివిధ రూపంలో శరీరమంతా వ్యాపించి ఉంటుంది. శరీరంలో ప్రతి వ్యవస్థ నీటి మీదే ఆధారపడి ఉంటుంది.

శరీరంలోకి ప్రోటీన్లు (Proteins) , మినరల్స్ (Minerals),విటమిన్స్ (vitamins), తీసుకురావడం మొదలుకుని వ్యర్ధాలను బయటకు పంపడం వరకు నీటి మీదే ఆధారపడి ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా శరీరానికి నీరు అందకపోతే అది డీహైడ్రేషన్ (DeHydration) కు కారణం అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు ద్రవ పదార్దాన్ని తీసుకోవాలి. పురుషులకు రోజుకు  కనీసం మూడు లీటర్ల నీరు అవసరమవుతుంది.

గర్భిణులు (Pregnant women) నీటిని బాగా తాగడం వల్లన పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు చెప్తున్నారు.

pregnant women drinking water

అలాగే ఆడవాళ్ళూ కు రెండున్నర లీటర్ల నీరు అవసరం,అన్నది ఇన్స్టిట్యూట్ అఫ్ మెడిసిన్ పరిశోధకుల అంచనాలు, మరి కొద్దీ మంది పరిశోధకులు రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు అంటే దాదాపు రెండు లీటర్లు తీసుకోమని చెప్తారు.

రోజు వ్యాయామం (Daily Excercise) చేసేవారు ఎక్కువ చెమట రూపం (Sweating) లో నీటిని కోల్పోతారు అలాంటి  వారు అదనపు నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అదనంగా తీసుకునే నీరు కనీసం 1 1/2 నుంచి 2 1/2 లీటర్ల  నీరు అవసరం అవుతుంది. వేడిగా ఉండటం, బాగా ఉక్కపోత గా ఉండటం లాంటివి ఎక్కువ చెమట బయటకు పోవడానికి కారణం కావచ్చు.

చలికాలం (Winter) లో వాతావరణం కూడా శరీరం నుంచి అధిక నీటిని మూత్రం రూపంలో బయటకు పంపుతుంది. ఇలాంటి వాతావరణం లో శ్వాసక్రియ కూడా పెరుగుతుంది, కనుక మరింత అదనపు నీరు తీసుకోవడం చాలా అవసరం. అనారోగ్యం తో బాధపడేవారు కూడా అధిక నీరు తీసుకోవాలి.

బ్లాడర్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ లో రాళ్లు (Kidney stones )లాంటి సమస్యలు వున్నా వారు సైతం నీటిని తీసుకునే విషయం లో అదనపు నీటిని తీసుకోవడం అవసరం. అదే విధం గా పాలు ఇచ్చే తల్లులకు పాల రూపం లో  నీరు బయటకు వెళుతుంది. అలాంటి వారికీ అదనపు నీరు అవసరమౌతుంది.

ఈ క్రమం లోనే  నీటిని అదనంగా త్రాగితే  కేవలం రెండు రోజుల్లోనే  మలబద్దకం  సమస్య నుంచి బయటపడవచ్చు.

టైం కి భోజనం చేయకపోవడం, జంక్ ఫుడ్ (Junk Food) ఎక్కువగా తినడం,పరిమితికి మించి ఆహారం తీసుకోవడం ఇలా కారణాలు ఎన్ని వున్నా కడుపులో గ్యాస్ సమస్య (Gastec Problems) ఒక్కోకో సారి బాధిస్తుంటుంది. అయితే నీటిని క్రమం తప్పకుండ తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ‘

ఇలా అనేక విషయాలను దృష్టి లో పెట్టుకుని నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. శరీరం లోకి ద్రవాలు వెళ్లాలంటే వాటిని నీటి ద్వారా తీసుకోవాలనే  నియమం లేదు. శరీరంలోకి ఆహార రూపంలోనూ నీటిని పంపవచ్చు. కూరగాయలు, పండ్లు వంటివి ముఖ్యం గా పుచ్చకాయ , పాలకూర లాంటి వాటి లో అధికంగా నీరు  ఉంటుంది.

వీటితో పాటు పాలు, పండ్ల రసం (Fruit juice) లో ఎక్కువ నీరు ఉంటుంది  గోరు వెచ్చని  నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆహారం తీసుకోవటానికి ముందు గానీ, తరువాత గానీ కనీసం అరగంట వ్యవధి లో నీటిని తీసుకోవాలి.

ఉదయాన్నే పరగడుపున తాగే నీరు శరీరంలో మెటబాలిజాన్ని పెంచుతుంది. ఇలా మన శరీర పరిస్థితిని బట్టి నీటిని తీసుకోవాలి. అదే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఏదైనా శృతిమించితే ఎన్ని ప్రమాదాలు కొని తెస్తుందో? ఏదేమైనా  మన శరీరాన్ని బట్టి నీటిని సరైన మోతాదులో తీసుకోవడమే ఉత్తమం.