కమ్మని వాసన వీరజల్లే కొత్తిమీర(Coriander)లో ఎన్నో రకాల ఔషద (medicinal)గుణాలుంటాయి. సాధారణంగా కొత్తిమీర గింజల(Coriander seeds)ను కూడా మసాలా దినుసుల్లో ఉపయోగిస్తుంటారు.

ఈ గింజలను బాగా ఎండబెట్టి గ్రౌండ్ చేసి ఉపయోగిస్తారు. ఈ హెర్బ్(Herb) రక్తంలో చక్కెర స్థాయిల(Sugar Levels)ను తగ్గిస్తుందని ఎన్నో పరిశోధనలు(Research) వెల్లడించాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్(Type2 Diabetes) ఉన్నవారిలో.

కొత్తిమీర గింజలే కాదు కొత్తమీర ఆకులు కూడా థైరాయిడ్(Thyroid) తో సహా ఎన్నో అనారోగ్య సమస్యల(Health Issues)ను తగ్గించడానికి సహాయపడతాయి.

థైరాయిడ్ మెడ ముందు భాగంలో ఉండే ఎండోక్రైన్ గ్రంధి(Endocrine Gland). ఇది సీతాకోకచిలుక ఆకారం(Butterfly Shape)లో ఉండే అవయవం. ఇది జీవక్రియ, ఎదుగుదలను నియంత్రించే హార్మోన్ల(Hormones)కు బాధ్యత వహిస్తుందది. ఒక వ్యక్తి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉంటే హైపోథైరాయిడిజం(Hypo Thyroidism) లేదా హైపర్ థైరాయిడిజం(Hyper Thyroidism) వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అర్థం అయ్యేట్టు చెప్పాలంటే హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంధి తగినంత థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయదు. హైపర్ థైరాయిడిజం అంటే అతి చురుకైన లేదా థైరాయిడ్ గ్రంధి అవసరానికి మించి థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుందని అర్థం.

థైరాయిడ్ పేషెంట్లకు కొత్తిమీర సహాయపడుతుందా?

కొత్తిమీర థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయడానికి సహాయపడతుందని ఆయుర్వేదం(Ayurveda) చెబుతోంది. కొత్తిమీర ఆకులు, గింజలు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండింటినీ నిర్వహించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్తిమీర థైరాయిడ్ పేషెంట్లకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దివ్య ఔషదగుణాలున్న కొత్తిమీరను ఎన్నో ఔషదాల్లో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు.

నిజానికి కొత్తమీర విత్తనాలు డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి. కానీ ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు(Anti Oxidants) పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్ వంటి వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి.

చాలా రకాల వ్యాధులు థైరాయిడ్ తో సంబంధం కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న కొన్ని రుగ్మతల వల్ల కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది.

కొలెస్ట్రాల్ కూడా థైరాయిడ్ సమస్యను పెంచుతుంది. అయితే కొత్తిమీర కొలెస్ట్రాల్(Cholesterol) ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది థైరాయిడ్  హార్మోన్లను బే వద్ద ఉంచడానికి సహాయపడుతుంది. ధనియాల వాటర్ మీరు వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

థైరాయిడ్ ను నిర్వహించడానికి బరువు తగ్గడం చాలా అవసరం.  అయితే థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవడానికి ఒక్క కొత్తిమీర పైనే ఆధారపడకూడదని నిపుణులు చెబుతున్నారు.

కొత్తిమీర ఆకులను వంటకాల్లో గార్నిష్(Garnish) గా ఉపయోగించొచ్చు. లేదా కొత్తిమీర చట్నీ(Coriander Chutney)ని తయారుచేసుకుని తినొచ్చు. కొత్తిమీర విత్తనాలను తీసుకోవాలనుకుంటే.. ముందుగా కొన్ని కొత్తిమీర గింజలను తీసుకుని వాటిని కొన్ని నీళ్లలో వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించండి(Boil). ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా చేసి తాగండి. అయితే ఒక గ్లాస్ ధనియా వాటర్(Dania Water) ను తాగితే సరిపోతుంది. దీన్ని వారానికి 2 నుంచి 3 సార్లు తాగొచ్చు.